కొల్లిపర: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 146:
ఇక్కడ వైకుంఠ ఏకాదశికి ప్రత్యేక కార్యక్రమాలు జరుగును. ఈ ఆలయంలో 2014,జూన్-7 శనివారం నాడు స్వామివారి శాంతికళ్యాణం నిర్వహించెదరు. ఆలయంలో స్వామివారిని పునహఃప్రతిష్ఠించి 5 సంవత్సరాలు అయిన సందర్భంగా, సూర్యోదయం నుండియే ప్రత్యేక పూజాదికాలు ప్రారంభించెదరు. [6]
 
25.5 లక్షల రూపాయల ప్రాధమిక అంచనా వ్యయంతో, ఈ ఆలయ రాజగోపుర నిర్మాణం చురుకుగా సాగుచున్నది. ముఖద్వారానికి ఏర్పాటుచేసిన శిలా తోరణాలను కోటప్పకొండ సమీపంలోని పురుషోత్తమపట్నం నుండి తీసికొని వచ్చినారు. ఈ శిలలపై కళాకారులతో నగిషీలు చెక్కించినారు. రాజగోపుర నిర్మాణం 8/2017 కి పూర్తి కాగలదు. [15]
 
===శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి, గోపయ్యస్వామి వార్ల ఆలయం===
కొల్లిపర గ్రామంలో [[కృష్ణా నది]] పరీవాహక ప్రాంతములో కొలువుదీరిన శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి, గోపయ్యస్వామి వార్ల తిరునాళ్ళు, ప్రతి సంవత్సరం, ఫాల్గుణమాసంలో పౌర్ణమిరోజున వైభవంగా నిర్వహించెదరు. సూర్యోదయానికే భక్తులు పెద్దసంఖ్యలో ఆలయానికి తరలివచ్చి, పొంగళ్ళు, పసుపు కుంకుమలు, పట్టువస్త్రాలు సమర్పించుకుంటారు. తిరునాళ్ళను పురస్కరించుకొని, వీధులలో సందడి వాతావరణం నెలకొంటుంది. " వింతా " వారి కుటుంబం నుండి తిరుపతమ్మ తల్లికి పట్టువస్త్రాలు సమర్పించటం ఇక్కడి ఆనవాయితీ. గ్రామ (ప్రభ) బండి ఏర్పాటు చేసి, పసుపు, కుంకుమలతో కుటుంబసభ్యులు ఆలయానికి తరలివచ్చెదరు. [5]
"https://te.wikipedia.org/wiki/కొల్లిపర" నుండి వెలికితీశారు