"భోగరాజు పట్టాభి సీతారామయ్య" కూర్పుల మధ్య తేడాలు

 
===స్వాతంత్ర సమరయోధుడు, కాంగ్రెస్ నాయకుడిగా===
చదువు పూర్తైన తర్వాత మచిలీపట్నంలో డాక్టరుగా ప్రాక్టీసు పెట్టాడు కానీ లాభదాయకమైన సంపాదనను వదులుకొని గాంధీజీచే ప్రభావితుడై బ్రిటిషు వారికి వ్యతిరేకంగా స్వాతంత్ర్య ఉద్యమములో పాల్గొన్నాడు. కాంగ్రెస్ పార్టీలో పట్టాభీ [[గాంధీజీ]]కి అతి సన్నిహితంగా ఉండేవాడు. 1939లో భారత జాతీయ కాంగ్రేసు పార్టీ అధ్యక్ష పదవికి అతివాద అభ్యర్థి అయిన [[సుభాష్ చంద్రబోస్]]కు వ్యతిరేకముగా, [[మహాత్మా గాంధీ]] అభిమతానికి దగ్గరైన వాడిగా పట్టాభిని పోటీలో నిలబెట్టారు. అయితే నేతాజీ పెరుగుతున్న ప్రాబల్యం మరియు పట్టాభి స్వాతంత్ర్యానంతరం, తమిళ ఆధిపత్యమున్న కొన్ని జిల్లాలను భావి తెలుగు రాష్ట్రములో కలపటానికి మద్దతునిస్తున్నాడన్న భావన ఈయన ఓటమికి కారణమయ్యింది. పట్టాభి ఓటమి తన ఓటమిగా గాంధీజీ భావించి బాధపడ్డాడు. ఆ తరువాత మళ్ళీ [[1948]]లో జరిగిన కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలలో [[పురుషోత్తమ్‌దాస్పురుషోత్తమ దాస్ టాండన్]] పై గెలిచి స్వతంత్ర భారత తొలి కాంగ్రెస్ అధ్యక్షుడిగా అవతరించాడు.
 
1942లో క్విట్ ఇండియా ఉద్యమ ప్రారంభములో కాంగ్రెసు పార్టీ కార్యాచరణ వర్గంలో పనిచేస్తూ ఉండగా మొత్తం కార్యాచరణ వర్గ సహితంగా పట్టాభిని అరెస్టు చేసి మూడేళ్లపాటు [[అహ్మద్ నగర్]] కోటలో బయటి వ్యక్తులెవ్వరితో సంబంధాలు లేకుండా బంధించి చిత్రహింసల పాలు చేశారు. బందీగా ఉన్న ఈ సమయంలో పట్టాభి తన దినచర్యను గూర్చి విస్తారమైన డైరీ నిర్వహించాడు. దీనినే ఆ తదనంతరం ఫెదర్స్ అండ్ స్టోన్స్ (ఈకలు మరియు రాళ్ళు) గా ప్రచురించారు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2161460" నుండి వెలికితీశారు