జయదేవుడు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2), కి → కి (4), తో → తో , సాంప్రదాయా → సంప్రదాయా, ప using AWB
పంక్తి 4:
జయదేవుడు [[ఒడిషా]] రాష్ట్రం, [[ఖుర్దా]] జిల్లాలోని ''ప్రాచి లోయ''లో ఉన్న [[కెందుళి]] (బిందుబిల్వ) గ్రామంలో ఒక ఉత్కళ [[బ్రాహ్మణ]] కుటుంబంలో జన్మించాడు. ''కెందుళి సాసన్'' ( ఇప్పుడిలా పిలువబడుతోంది ) గ్రామం, [[పూరీ (పట్టణం)|పూరీ]]కి సమీపంలో ఉంటుంది. కెందులి పట్నము, కెందులి దౌళి, కెందులి సాసనము మూడు గ్రామములలో కలసిన ప్రదేసము. ఇవి ప్రాచీనది ఒడ్డున ఉన్నాయి. ఈనది పరమపవిత్రమైననది. కెందులి గ్రామసీమ నుండి రెండుమైళ్ళ దూరంలో ఖుశభద్రానది రెండు పాయలతో ప్రాచీనదిని కలిసేచోటును జనం [[త్రివేణీసంగమ]] మని వ్యవహరిస్తారు. కెదులి గ్రామములో వాసుదేవ విగ్రహాలు [[నారాయణ]] నామంతో అనేకం కనిపిస్తున్నాయి. అందువల్ల జయదేవుని జన్మగ్రామం [[ఒరిస్సా]]లోని ప్రాచీనది ఒడ్డున ఉన్న కెందులి అని చారిత్రకారులు నిర్ణయించారు.
ఈ విషయమును జయదేవుడు 7 వ అష్టపదిలో "కిందుబిల్వ సముద్ర సంభవ" అని పేర్కొనెను. జయదేవుడి తల్లిదండ్రులు, ''భోజదేవుడు'' మరియు ''రమాదేవి'' లు. జయదేవుడు జన్మించినప్పుడు ఒడిషా ''చోడగంగ దేవ'' ఏలుబడిలో ఉండేది. జయదేవుడు ''కుర్మపాటక''లో తన [[సంస్కృత]] విద్యాభ్యాసం గావించాడు. తరువాత దేవదాసీ అయిన ''పద్మావతి''ని వివాహమాడాడు. ఆమె కృష్ణ భక్తురాలు. ఆ కాలంలో ఆ ప్రాంతమంతా ''వైష్ణవ బ్రాహ్మణుల'' ప్రాబల్యంలో ఉండేది. జయదేవుడు చిన్నతనం నుండే సంగీత సాహిత్యములలో గొప్ప పాండిత్యమును సంపాదించెను. బీద బ్రాహ్మణుడైన జయదేవుడు ఊరి చివర ఒక గుడిసెలో నివసిస్తూ చాలా వరకూ ధ్యానములో కాలము గడిపినాడని తెలియుచున్నది.
ఈయన.1090-1153 మధ్యకాలంలో జీవించినట్లు తెలుస్తుంది.జయదేవుడు క్రీ.శ.1116 నుంచి 1160 వరకూ గౌడదేశాన్ని పాలించిన రాజైన లక్షణసేనుని ఆస్థానంలో ఉండేవాడు.<ref>{{cite book|last1=ప్రముఖ వాగ్గేయకారులు|title=డాక్టర్ బి.వేంకటేశ్వర్లు|publisher=అమరావతి పబ్లికేషన్స్|page=14|edition=రెయిన్ బొ ప్రింట్|accessdate=20 July 2017}}</ref>
 
[[బెంగాలు]]లోని నవద్వీపమునకు రాజైన లక్షణసేనుని ఆస్థానమున క్రీ.శ. 1116 లో జయదేవుడు ఒక పండితుడిగానున్నట్లు అచట గల ఆధారములను బట్టి తెలియుచున్నది. మహారాజు కోటద్వారము వద్ద గల రాతిపై "గోవర్థనుడు, పారణ, జయదేవుడు" అను మూడు రత్నములు మహారాజు కొలువులో నున్నట్లు చెక్కబడియున్నవి.
"https://te.wikipedia.org/wiki/జయదేవుడు" నుండి వెలికితీశారు