కాశీ: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నుండీ → నుండి , → (3) using AWB
పంక్తి 56:
 
=== స్వాతంత్రానికి ముందు చరిత్ర ===
16వ శతాబ్దంలో మొగల్ చక్రవర్తి [[ఆక్బర్]] పాలనలో వారణాశిలో సరికొత్త సంస్కృతి మొదలైంది. ఆక్బర్ చక్రవర్తి ఆధ్వర్యంలో వారణాశిలో శివునికి మరియు [[విష్ణుమూర్తి]]కి రెండు పెద్ద ఆలయాలను నిర్మించబడ్డాయి. పూనా రాజు 200 మీటర్ల (660 అడుగులు) ఎత్తైన అంపూర్ణాదేవి నమందిరం నిర్మించాడు. అలాగే పూనా రాజు పాలనలో శివా - విష్ణులకు అంకితమివ్వబడిన అక్బారి వంతెన కూడా నిర్మించబడింది. 16వ శతాబ్దం నుండి వారణాశికి యాత్రికుల రాక ప్రారంభమైంది. 1665లో ఫ్రెంచి యాత్రికుడైన " జీన్ బాప్టిస్ట్ ట్రావర్నియర్ " ఈ నగరాన్ని సందర్శించి వారణాశిలోని గంగాతీరంలో ఉన్న " బిందు మహాదేవాలయం " సౌందర్యాన్ని వర్ణించాడు. చక్రవర్తి షేర్ షాహ్ సూరి కాలంలో వారణాశి రహదారి పునరుద్దరినబడి [[కొలకత్తా]] నుండి పెషావర్ వరకు పొడిగించబడింది. తరువాత బ్రిటిష్ పాలనా కాలంలో ఈ రహదారి ప్రఖ్యాతమైన " గ్రాండ్ ట్రంక్ రోడ్డుగా " అవతరుంచింది. 1656లో ఔరంగజేబు పలు ఆలయాలు ధ్వంసం చేయబడి మసీదులు నిర్మించబడ్డాయి. నగరం తిరిగి సంస్కృతి పరంగా వెనుకబడింది. అయినప్పటికీ [[ఔరంగజేబు]] మరణానంతరం భారాదేశంలో తిరిగి హిందూ రాజ్యాలు తలెత్తి వర్ద్ధిల్ల సాగాయి. ప్రస్తుతం వారణాశిలో ఉన్న ఆలయాలు హిందూ రాజులైన రాజపుత్రులు మరియు మరాఠా రాజులచేత నిర్మించబడ్డాయి. ప్రస్తుతం వారణాసిలోని పలు నిర్మాణాలు 18వ శతాబ్ధానికి చెంది ఉన్నాయి. బెనారస్ రాజు లేక కాశీ నరేష్ తో సహా ఈ రాజులు బ్రిటిష్ పాలనా సమయంలో (క్రీ.శ 1775-1945) కూడా కొనసాగారు. 1737లో మొగల్ చక్రవర్తుల ఆధ్వర్యంలో " బెనారస్ రాజ్యం ( కింగ్డం అఫ్ బెనారస్) " పేరుతో సాధికారంగా ఏర్పాటు చేయబడి 1947 వరకు కొనసాగింది. 18వ శతాబ్దంలో మహమ్మద్ షాహ్ ఆధ్వర్యంలో గంగాతీరంలో ఉన్న మాన్ మందిరం ఘాట్ వద్ద ఒక " అబ్జర్వేటరీ " కేంద్రాన్ని నిర్మించబడింది. ఇది జ్యీతిషశాస్త్ర విషయాల పరిశీలనకు అనుకూలమైంది. 18వ శతాబ్దంలో ఈ ప్రాంతానికి బ్రిటిష్ గవర్నర్లైన వారెన్ హేస్టింగ్, వారణాశిలో సంస్కృత కళాశాలను స్థాపించిన జూనాథాన్ డంకన్ కాలంలో వారణాశి పర్యాటకం మరింత వర్ధిల్లింది. 1867లో వరణాశిలో పురపాలక సంఘస్థాపన జరిగిన తరువాత వారణాశి నగరంలో మరింత అభివృద్ధి కొనసాగింది.
 
=== ప్రత్యేక సంఘటనలు ===
పంక్తి 83:
మొదటినుండి యాత్రా స్థలం అవ్వడం వలన, వారాణసి దేశం అన్ని ప్రాంతాలనుండి జనులను ఆకర్షించేది. కనుక ఇది ప్రముఖ వాణిజ్య కేంద్రంగా అభివృద్ధి చెందింది.
 
వారణాశిలోని 29% ప్రజలు ఉద్యోగాలను కలిగి ఉన్నారు. వారిలో 40% వస్తూత్పత్తి పరిశ్రమలలో పనిచేస్తుండగా 26% ప్రజలు వ్యాపార వాణిజ్యాలు చేస్తున్నారు, 19% ప్రజలు సేవారంగాన్ని జీవనోపాధిగా ఎంచుకున్నారు, 8% రవాణా మరియు సమాచార రంగంలో పనిచేస్తున్నారు, 4% వ్యవసాయరంగంలో పనిచేస్తున్నారు, 2% నిర్మాణరంగంలో పనిచేస్తున్నారు ( వీరికి సంవత్సరంలో ఆరుమాసాలు మాత్రమే పని ఉంటుంది). తయారి పనివారిలో 51% స్పిన్నింగ్ పనిలో ఉన్నారు, 6% ప్రజలు ముద్రణ మరియు ప్రచురణ పనిలో ఉన్నారు, 5% ప్రజలు విద్యుత్తు మిషనరీ పనిలో ఉన్నారు, మిగిలిన వారు పరిశ్రమలోని ఇతర పనులలో ఉన్నారు.
 
వారణాశిలో తయారీ వ్యవస్థలో [[పట్టు]]<nowiki/>నేత ఆధిక్యత వహిస్తుంది. వారణాశిలో సాధారణంగ నేతపని కుటీరపరిశ్రమగా ఉంటుంది. నేవారిలో అధికంగా మోమిన్ అంసారీ ముస్లిములు ఉన్నారు. వారణాశి పలుచని పట్టువస్త్రాలు మరియు బనారస్ పట్టు చీరలు భారతదేశం అంతటా పఖ్యాతి వహిస్తున్నాయి. వివాహాది శుభకార్యాలలో ధరించే ఈ పట్టు చీరలు వెండి మరియు అంగారు జరీనూలుతో అలకృతమై ఉంటాయి. మిగిలిన భారతదేశం కంటే వారణాశిలో అత్యధికంగా బాలలను కట్టుబానిసలుగా పట్టుపరిశ్రమలో వాడుకుంటున్నారు. సమీపకాలంలో అభివృద్ధి చెందుతున్న పవర్ లూంస్ మరియు కంప్యూటర్ డిజైన్లు అలాగే చైనా పట్టువస్త్రాల పోటీ వంటి సమస్యలు సంప్రదాయక పట్టునేత పరిశ్రమను కలవరానికి గురిచేస్తూ ఉంది.
పంక్తి 174:
=== కవళీ మాత ===
కవళిమాత ఒకప్పుడు కాశిలో నివసిస్తూ ఉండేది. ఆమె జీవనోపాధి కొరకు గవ్వలను అమ్ముతూ ఉండేది. ఆమె సదావిశ్వేరుని భక్తిశ్రద్ధాసక్తులతో ఆరాధించేది. శివారాధనకు ముందుగా గంగానదిలో స్నానం ఆచరించేది. గంగాస్నానం తరువాత విశ్వేశ్వర దర్శనం అయిన తరువాత ఆమె ఆహారాన్ని స్వీకరించేది. ఒకరోజు ఆమె స్నాంచేసి గట్టుకు రాగానే ఒక [[హరిజనుడు]] ఆమెను స్పృజించాడు. హరిజన స్పర్శ కారణంగా ఆమె తిరిగి గంగలో స్నానానికి వెళ్ళింది. అలా ఆమె స్నానం చెయ్యడం తిరిగి హరిజనుడు స్పృజించడం తిరిగి గంగాస్నానానికి పోవడం చేస్తుండగా రాత్రి అయింది. ఆమె ఆరోజంతా [[భోజనం]] చేయలేదు. కాశీ అన్నపూర్ణా మాత క్షేత్రం కనుక ఆక్షేత్ర సరిహద్దులలో ఎవరూ భోజనం చేయకుండా ఉండకూడదు కనుక అన్నపూర్ణాదేవి స్వయంగా కవళీకి ప్రత్యక్షమై తనక్షేత్రంలో ఎవరూ పస్తులు ఉండదు కనుక భోజనం చెయ్యమని చెప్పింది. కవళీ మాత్రం విశ్వేశ్వర దర్శనం చేయకుండా భోజనం చెయ్యనని చెప్పింది. అన్నపూర్ణా మాత కోపించి ఆమెను కాశీ సరిహద్దులు దాటి వెళ్ళమని ఆదేశించింది. కవళీ కాశీ సరిహద్దులు దాటి వెళ్ళిన ఆమె విశ్వేశ్వర దర్శనం చెయ్యలేక పోయినందుకు చింతిస్తూ శివుని గురించి తపసు చేసింది. ఆమెకు శివిడు ప్రత్యక్షం కాగానే ఆమె " ఈశ్వరా ! నాభక్తిలో లోపమేమిటి. నన్నిలా కాశీనుండి పంపిన తరువాత నేనిక నీదర్శనం ఎలాచేయగలను. " అని ఆవేదనపడింది. [[ఈశ్వరుడు]] " కవళీ ! నీ భక్తి తిరుగులేనిది అయినప్పటికీ హరిజనుడు స్పృజించాడని తిరిగి స్నానం చేయడం అపరాధమే. నాకు హరిజనులు, పురజనులే కాదు. సకల ప్రాణులూ ఒకటే. ఎవరైనా నన్ను స్పృజించి నమస్కరించడానికి అర్హులే. నీవు హరిజన స్పర్శ అపవిత్రమని భావించి చేసిన అపరాధానికే ఈ దండన లభించింది. అయినప్పటికీ నీభక్తికి, తపసుకు మెచ్చి నీకు ఒక వరం ఇస్తాను. ఇక మీదట
నా భక్తులు నన్ను సందర్శించిన ఫలితం నీకు ఇస్తాను. భక్తులు నీకు కానుకలు సమర్పించి వారి దర్శన ఫలితాలను తిరిగి పొందగలరు " అని చెప్పి అదృశ్యం అయ్యాడు. అప్పటి నుండీనుండి కవళీ " కవళీ మాత " అయింది. కనుక భక్తులు కాశీ విశ్వేరదర్శనం చేసుకున్న ఫలితం కవళీ మాతకు దక్కుతుంది. అందుకు పరిహారంగా భక్తులు కవళీమాత దర్శనం చేసుకుని ఆమెతో " ఈ గవ్వలు నీకు సమర్పిస్తున్నాము. కాశీ ఫలితం నాకు ఇవ్వు " అని ప్రార్థించిన భక్తులకు కాశీ పోయిన ఫలితం దక్కుతుందని విశ్వశించబడుతుంది. కనుక కాశీవిశ్వేశ్వర దర్శనం చేసుకున్న భక్తులు కవళీమాతను కూడా దర్శించుకుంటారు.
 
=== మసీదులు ===
"https://te.wikipedia.org/wiki/కాశీ" నుండి వెలికితీశారు