తెలుగు నాటకాలు - జాతీయోద్యమం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఆగష్టు → ఆగస్టు using AWB
పంక్తి 12:
జాతీయోద్యమ ముఖ్య లక్ష్యం పరదేశీయుల్ని పారద్రోలడమే ప్రధాన ధ్యేయమైనప్పటికీ, నాటకాల్లో నాడు జాతీయోద్యమం సామాజిక రంగంలో కనిపించే అనేక సమస్యల్ని పరిష్కరించేదిశగా పయనించిన కోణాన్ని కూడా రచయిత ఈ గ్రంథంలో వివరంగా పేర్కొన్నారు. వందేమాతరం, విదేశీవస్తు బహిష్కరణ, సత్యాగ్రహం, క్విట్‌ ఇండియా ఉద్యమం మొదలైన చారిత్రక ఘట్టాలను తెలుగు నాటకాల్లో ప్రతిఫలించిన తీరు ఈ గ్రంథంలో కనిపిస్తుంది.
 
కేవలం 1947 ఆగష్టుఆగస్టు 15 వరకు మాత్రమే కాకుండా, 1948 సెప్టెంబరు 17న హైదరాబాదు రాష్ట్రం భారతదేశంలో విలీనం అయ్యేవరకూ చరిత్రను పరిగణనలోకి తీసుకొన్నప్పుడు మాత్రమే, ఆంధ్రప్రాంతానికి సంపూర్ణ స్వాతంత్ర్యం సిద్ధించినట్లవుతుందంటారు రచయిత. అందుకనే ఈ గ్రంథంలోని అయిదో అధ్యాయంలో తెలుగు నాటకాలపై చూపిన తెలంగాణా సాయుధ పోరాట ప్రభావాన్ని వివరించారు.
 
వేదాంతకవి 1948 లో రాసిన ఛలో హైదరాబాద్‌, వాసిరెడ్డి భాస్కరరావు, సుంకర సత్యనారాయణలు కలిసి రాసిన [[మాభూమి]] నాటకాలపై సుదీర్ఘమైన విశ్లేషణ చేశారు. ఈ రెండు నాటకాలు చదివితే తెలంగాణాలో జరిగిన సాయుధ పోరాటం చాలా వరకూ అవగాహన కొస్తుంది. నిజాం నిరంకుశ పాలనలో అమీనులు, దేశ్‌ముఖ్‌లు సాగించిన దురంతాల పై నాటి సామాన్య ప్రజలు సహితం పోరాడిన సంఘటనలన్ని జాతీయోద్యమంలో భాగంగానే చూడాలనేది ఈ గ్రంథంలో కనిపించే ఒక ప్రతిపాదన. తెలంగాణా సాయుధ పోరాటంలో స్త్రీల పాత్రను కూడా చిత్రించిన నాటకాలను వివరించారు. స్త్రీ చైతన్యాన్ని కూడా ఆయా నాటకాల్లో ప్రతిఫలించిన తీరుని వివరించారు.