ప్రబంధము: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఉన్నది. → ఉంది. (2), నందలి → లోని , నుండీ → నుండి , మహ → మహా using AWB
పంక్తి 1:
తెలుగు కవిత్వంలో 15వ శతాబ్ది నాటికి అభివృద్ధి చెందిన ప్రక్రియా భేదం ప్రబంధం. ప్రకృష్టమైన పదబంధమున్న [[కావ్యం]] '''ప్రబంధము'''.
== చరిత్ర ==
ప్రబంధమంటే కావ్యమనే అర్థంలో [[తిక్కన]] తాను రచించిన 15 పర్వాలను ప్రబంధమండలి అన్నాడు. [[ఎర్రన]]కు 'ప్రబంధ పరమేశ్వరుడు' అనే బిరుదు ఉన్నదిఉంది. అయితే ఈ ప్రబంధ శబ్దానికి ప్రక్రియపరమైన ప్రబంధ శబ్దానికి భేదం ఉన్నదిఉంది. [[నన్నెచోడుడు]] అష్టాదశ వర్ణనలను పేర్కొనడమే కాక [[కుమార సంభవం]]లో అనేక వర్ణనలు చేశాడు. [[శ్రీనాథుడు]], [[పిల్లలమర్రి పినవీరభద్రుడు]] అష్టాదశ వర్ణనల్లో కొన్నింటిని రసరమ్యంగా నిర్వహించారు. కొన్ని ప్రబంధ ప్రక్రియా లక్షణాలు లేకపోవడం వల్ల ఇవి ప్రబంధాలు కాలేకపోయాయి. [[అల్లసాని పెద్దన]] [[మనుచరిత్ర]] రచనతో ప్రబంధ ప్రక్రియకు అంకురార్పణ జరిగింది.<br />
పెద్దన రాసిన [[మనుచరిత్ర]] బహుళ ఆదరణ సంపాదించి ప్రక్రియగా ప్రబంధానికి రాజాదరణ సాధించిపెట్టింది. వచ్చిన వసుచరిత్ర [[మనుచరిత్ర]]<nowiki/>కు మించిన [[కవిత్వం]] కలిగిన కావ్యమనే పేరు సంపాదించింది. [[తెనాలి రామకృష్ణుడు]] రాసిన పాండురంగ మహత్మ్యంమహాత్మ్యం, [[పింగళి సూరన]] [[కళాపూర్ణోదయం]], [[చేమకూర వెంకటకవి]] రాసిన [[విజయవిలాసం]] వంటివి ప్రబంధాలుగా ప్రసిద్ధి పొందాయి.
 
==లక్షణాలు==
ప్రబంధ లక్షణాలను పలువురు విమర్శకులు ఇలా వివరించారు.
* [[పింగళి లక్ష్మీకాంతం]]: ప్రబంధమునకు ఏక నాయకాశ్రయత్వము, దానితోపాటు వస్త్వైక్యము ప్రధాన ధర్మములు. ప్రబంధము అష్టాదశ వర్ణనాత్మకమై యుండవలెను. అందు శృంగారము ప్రధాన రసము. ఆవశ్యకతను బట్టి తక్కిన రసములు గౌణములు కావచ్చును. ఆలంకారిక శైలి ప్రబంధమునకు జీవము. ప్రబంధము భాషాంతరీకరణము కాకూడదు. స్వతంత్ర రచనయై యుండవలెను. పదునారవ శతాబ్ది ఆది నుండీనుండి వెలువడిన మనుచరిత్రాది కావ్యములన్నిటికి పైన పేర్కొన్న లక్షణములన్నియు సమగ్రముగా పట్టినను, పట్టకున్నాను, స్వతంత్ర రచనలగుట చేతను, ఆలంకారిక శైలీ శోభితములగుట చేతను అవన్నియు ప్రబంధములుగానే పరిగణింపబడినవి.<ref>[[పింగళి లక్ష్మీకాంతం]], విజ్ఞాన సర్వస్వము, సంపుటి 3, తెలుగు సంస్కృతి-1, పుట.603.</ref>
* కాకర్ల వెంకట రామ నరసింహము: కథైక్యమును [[అష్టాదశ వర్ణనలు|అష్టాదశ]] వర్ణనలును గలిగి శృంగార రస ప్రధానమై, అర్థాతిశాయియైన శబ్దమును గ్రహించి యాలంకారిక సాంకేతికములకు విధేయమై, ఆనాటి విస్తృతిగల యితివృత్తముతో, భాషాంతరీకరణముగాక, స్వతంత్రరచనయేయైన తెలుగు కావ్యము ప్రబంధము. అయితే పైని వివరించిన లక్షణములు కొన్ని ప్రబంధములందు గానరాకున్నను నాయా యుగధర్మ ప్రాధాన్యము బట్టియు, రచనా ధోరణి బట్టియు నవియు బ్రబంధనామముననే వ్యవహరింపబడుచున్నవి.<ref>కాకర్ల వేంకట రామ నరసింహము, ఆంధ్ర ప్రబంధములు : అవతరణ వికాసములు, పుట iv.</ref>
* [[దివాకర్ల వేంకటావధాని]]: ధీరోదాత్త నాయకములును, [[శృంగారం|శృంగార]] రస ప్రధానములును, పంచమాశ్వాస పరిమితములును ఐన కావ్యములు ఆలంకారిక శైలిలో వ్రాయబడినవి- వీటికే ప్రబంధములని పేరు.<ref>[[దివాకర్ల వేంకటావధాని]], 'ఆంధ్రవాజ్మయ చరిత్రము-II' ''సంగ్రహాంధ్రవిజ్ఞానకోశము'', సంపు-I, పుట 576</ref>
పంక్తి 21:
==ఉదాహరణలు==
#[[మనుచరిత్ర]]
#సంస్కృతమునందలిసంస్కృతము లోని మాలవికాగ్నిమిత్రము
#[[ఆముక్త మాల్యద]]
#[[నాలాయిర దివ్య ప్రబంధము]]-తమిళము
"https://te.wikipedia.org/wiki/ప్రబంధము" నుండి వెలికితీశారు