వికీపీడియా:వికీప్రాజెక్టు/స్వేచ్ఛా సాఫ్టువేరు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 28:
 
==సమావేశాలు==
[[వికీపీడియా:సమావేశం/తెలుగు_స్థానికీకరణ_సమావేశం|తెలుగు స్థానికీకరణ సమావేశం]]: [[మొజిల్లా ఫౌండేషన్]], [[స్వేచ్ఛ]],[[తెలుగు]][[వికీపీడియా]] సంస్థలు హైదరాబాద్‌లో 29 మరియు 30 జూలై 2017 తేదీల్లో స్వేచ్ఛ, గచ్చిబౌలి, హైదరాబాదు వేదికగా నిర్వహిస్తున్న తెలుగు స్వేచ్ఛా సాఫ్టువేరు అభివృద్ధి, స్థానికీకరణ, సమాచార విస్తరణ కార్యక్రమంలో, నిర్వహణలో పాల్గొనేందుకు వికీమీడియన్లను సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమం ద్వారా తెలుగు వికీపీడియాలో సాంకేతిక సంబంధమైన అంశాలు అభివృద్ధి చేసేందుకు ఒక ఎడిటథాన్ నిర్వహించాలని, దానికి ఇక్కడ ముందస్తుగా స్వేచ్ఛా సాఫ్టువేర్లపై ఆసక్తి ఉన్నవారితో పాటు అందరికీ తెలుగు వికీపీడియాపై శిక్షణను ఇవ్వాలని ఆశిస్తున్నాం. తద్వారా తెలుగు వికీపీడియా మరియు ఇతర తెలుగు వికీ ప్రాజెక్టులలో సాంకేతిక అంశాలపై వ్యాసాలు, బుక్‌లెట్లు తయారుకావాలని లక్ష్యం. తెలుగు వికీపీడియన్లు ఇప్పటికే స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వాన్ని అభివృద్ధి చేస్తూండగా మొజిల్లా ఫైర్‌ఫాక్స్, ఉబుంటు మొదలుకొని సాఫ్టువేరు పరంగా తెలుగు స్వేచ్ఛా సాఫ్టువేరు రంగంపై జరుగుతున్న కార్యకలాపాలపై అవగాహన కలుగుతుంది. తెలుగు వారై సాంకేతిక నైపుణ్యం ఉన్నవారికి తెవికీతోనూ, తెవికీకి అవసరమయ్యే సాంకేతికాంశాలపైనా అవగాహన ఏర్పడే వీలుంది.
 
== గణాంకాలు==