సీమబద్ధ: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:భారతీయ చలనచిత్రాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ప్రతిష్ట → ప్రతిష్ఠ (2), పని చేస్తు → పనిచేస్తు, → (5), ( → using AWB
పంక్తి 1:
'''సీమబద్ధ''' (బెంగాలీ:সীমাবদ্ধ) 1971లో నిర్మించబడిన [[బెంగాలీ భాష|బెంగాలీ]] సినిమా. ఈ చిత్రానికి [[సత్యజిత్ రే]] దర్శకత్వం వహించాడు. [[19వ భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు|19వ భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలలో]] ఈ సినిమా ఉత్తమ చిత్రంగా రాష్ట్రపతి బంగారు పతకం గెలుచుకుంది<ref>{{cite journal|last1=సంపాదకుడు|title=సీమబద్ధ|journal=విజయచిత్ర|date=1 June 1972|volume=6|issue=12|pages=8-9|accessdate=2 July 2017}}</ref>.
==నటీనటులు==
* వరుణ్‌చందా
పంక్తి 16:
 
==చిత్రకథ==
శ్యామలేందు ఛటర్జీ స్వగ్రామం పాట్నా. కాలేజీ జీవితంలో తెలివైన వాడిగా పేరు తెచ్చుకున్న శ్యామలేందు చదువు ముగియగానే కలకత్తాలో బల్బులు, ఫ్యాన్‌లు ఉత్పత్తి చేసే ఒక పెద్ద బ్రిటీష్ కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు. తన భార్య డోలన్‌తో పాట్నా నుంచి కలకత్తాకు మకాం మార్చాడు.
 
ఉద్యోగంపట్ల ఎక్కువ శ్రద్ధ చూపించిన శ్యామలేందు కొద్ది కాలంలోనే తను పనిచేస్తున్న హిందుస్తాన్ - పీటర్స్ లిమిటెడ్ కంపెనీకి మేనేజర్ అయ్యాడు.
 
ఇప్పుడతనిది ఆడంబరమైన జీవితం. పెద్ద బంగళా, కారు ఇంకా ఎన్నో వసతులు అతనికి ఏర్పడ్డాయి. సౌకర్యాలతో పాటు కోరికలూ అతనిలో పెరగసాగాయి.
 
ఇప్పుడు అతడి లక్ష్యం ఒక్కటే. అది తను పని చేస్తున్నపనిచేస్తున్న కంపెనీకి మార్కెటింగ్ డైరెక్టర్ కావడం!
 
డోలన్ చిన్న చెల్లెలు సుదర్శన (తుతుల్). పాట్నాలో శ్యామలేందు ఛటర్జీ వున్నప్పుడే ఆమె ఎవరికీ తెలియకుండా అతనిపట్ల మనసులో ఒక విధమైన అభిమానాన్ని పెంచుకుంది. అతనికీ, తన అక్కగారైన డోలన్‌కూ వివాహమైనా అతని మీదున్న అభిమానం మాత్రం తగ్గలేదు.
పంక్తి 30:
నిరంతరం యాంత్రిక జీవితంలో అనేక ఒత్తిడులకు లోనౌతున్న శ్యామలేందుకు ఆమె మాటలు వసంతకాలంలో కోయిల పాటల్లా వినిపించాయి.
 
సరిగ్గా ఆ సమయంలోనే శ్యామలేందుకు అనుకోని ఓ చిక్కు వచ్చి పడింది. ఇరాక్ దేశంలో వున్న ఒక కంపెనీకి, తమ కంపెనీ ఎగుమతి చేయనున్న సీలింగ్ ఫ్యానులు చిట్టచివరి పర్యవేక్షణలో నాణ్యత లోపించినట్లుగా కనుగొనబడ్డాయి. అంటే తమ కంపెనీ పరువు ప్రతిష్టలకుప్రతిష్ఠలకు పెద్ద నష్టం వాటిల్లబోతుందన్నమాట. ఆ పరిస్థితులలో తను ఏమీ చేయలేక పోతే ఇక కంపెనీకి మార్కెటింగ్ డైరెక్టర్ కావడం అన్నది కలలోని మాట.
 
వెంటనే మళ్ళా ఫ్యాన్‌లు తయారు చేయించి పంపడమూ జరిగే పనికాదు. ఇచ్చిన గడువు లోపల సరుకు ఎందుకు రాలేదని ఇరాక్‌లోని ఆ కంపెనీ వాళ్ళు అడిగితే ఏం సంజాయిషీ ఇచ్చుకోవాలి?
పంక్తి 42:
"ఛటర్జీ! మీరెందుకు అలా అలోచిస్తారు? కలకత్తలో జనం చావడం లేదా?" అన్న కార్మిక సంక్షేమశాఖ అధికారి మాటలకు నవ్వుతూ అతనికి తన కృతజ్ఞతలు తెలుపుకున్నాడు శ్యామలేందు.
 
అయితే అతని మస్తిష్కంలో తుతుల్ అన్న మాటలు ఒక ప్రక్క నుంచి అతన్ని వెంటాడుతూనే ఉన్నాయి.
 
ఆమె శ్యామలేందును నిలదీసి అడిగింది "ఆ తీవ్రవాదులెవరో మీకు తెలియదా?" అని.
 
"ఎవరూ... ఆ అల్లర్లలో గాయపడ్డవాళ్ళా?" అని ఎగతాళిగా అడిగింది డోలన్ మధ్యలో కలుగజేసుకుంటూ.
 
"కాదు... ఆ అల్లర్లకు అసలు కారకులైన వాళ్ళు?" ఆవేశం ధ్వనించింది తుతుల్ మాటల్లో.
 
"భలే దానివే! ఆ సంగతి ఈయనకెలా తెలుస్తుంది?" అంది ఆమె తన భర్తను సమర్థిస్తూ.
 
అనుకున్నట్లుగానే అంతటి క్లిష్ట పరిస్థితి నుంచి కంపెనీ పరువు ప్రతిష్టలనుప్రతిష్ఠలను కాపాడినందుకుగాను శ్యామలేందుకు మార్కెటింగ్ డైరెక్టర్ పదవి లభించింది! భోగలాలసత్వానికి బానిస అయిన డోలన్ ఈ వార్త విని సంతోషంతో ఉప్పొంగిపోయింది. జీవితంలో అతను సాధించిన ఆ ఉన్నతమైన పదవికి అందరూ అతన్ని మెచ్చుకున్నారు.
 
కాని అందుకు హర్షించనిదల్లా తుతుల్ ఒక్కతే! కారణం ఫ్యాక్టరీలో జరుపబడిన ఆ కుట్ర శ్యామలేందువల్ల జరిగిందన్న సంగతి ఆమె తెలుసుకుంది.
 
"ఒకరు పైకి రావడానికి ఇలా ఎందరినో బాధ పెట్టడం ఎంతటి క్రూరత్వమో గ్రహించలేని వాళ్ళు వీళ్ళూ మనుషులేనా?" అని బాధతో నిట్టూర్చింది తుతుల్. ఆమెకు శ్యామలేందు పట్ల ఏహ్యభావం కలిగింది.
 
అతను తనకు బహూకరించిన గడియారాన్ని తిరిగి అతనికే అప్పగించింది, అది చూపిన కాలంలో తాను చూసినదేమిటో తెలుసుకున్నట్లుగా!
పంక్తి 64:
==పురస్కారాలు==
* 1971: [[19వ భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు]] - [[భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ సినిమా|ఉత్తమ సినిమా]]
* 33వ వెనీస్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం - FIPRESCI అవార్డు
 
==మూలాలు==
పంక్తి 71:
==బయటిలింకులు==
* {{IMDb title|0067729}}
 
 
 
{{భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు}}
"https://te.wikipedia.org/wiki/సీమబద్ధ" నుండి వెలికితీశారు