మాయా దర్పణ్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 34:
 
==చిత్రకథ==
శిథిలమై బూజుపట్టిన చావిడి, పాతకాలపు తలుపులు, గోడలూ గల ఆ ఇంటి మధ్యకు చూస్తే ఒక యువతి కనిపిస్తుంది. భారతదేశానికి స్వాతంత్ర్యం రాకముందు ఒక చిన్న ఎస్టేట్‌కు దివాన్‌గా పనిచేసిన ముసలాయన చిన్నకూతురు ఆమె. చిన్నతనంలోనే తల్లిని పోగొట్టుకున్నది. ఇంకా ఆమెకు వివాహం కాలేదు. ఆమె అన్న తండ్రితో పాట్లాడి, ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయి అస్సాం టీ తోటలలో పనిచేస్తున్నాడు. అతను ఆమెకు తరచు ఉత్తరాలు రాస్తూ వుంటాడు. ఆ ఉత్తరాలు చదివినప్పుడల్లా బూజు పట్టి దుమ్ముకొట్టుకొని వున్న ఆ యింటిని విడిచిపెట్టి, ఆ పచ్చని, ప్రశాంతమైన వాతావరణంలోకి పారిపోవాలని ఆమె అనుకుంటూ వుంటుంది. కాని, వృద్ధాప్యంలో వున్న తండ్రితో గల అనుబంధం ఆమెను కదలనివ్వడం లేదు. కాని, ఆమె మాత్రం, ఆ అనుబంధాన్ని తెంపుకుని వెళ్ళిపోవాలనకుంటూ వుంటుంది. స్వేచ్ఛని కోరుకుని వెళ్ళాలనుకుంటూ వుంటుంది. తండ్రి తాను కోరుకున్న అబ్బాయితో అంతస్తులు కారణంగా చూపి వివాహం జరిపించలేదు. ఆ కారణంతో తండ్రి తన యౌవనాన్ని వృథా చేస్తున్నాడు. ఆమె సహించలేకపోయింది. అయితే, వదిలి వెళ్ళడానికీ ఆమెకు మనస్కరించడం లేదు. వితంతువైన ప్రేమ; తండ్రి పరిస్థితీ ఆమెను కదలనివ్వకుండా చేస్తున్నాయి.
 
==పురస్కారాలు==
"https://te.wikipedia.org/wiki/మాయా_దర్పణ్" నుండి వెలికితీశారు