తెలుగు నాటక వికాసము: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 24:
# ప్రథమభాగం: ఇది [[తెలుగు నాటకము|తెలుగు నాటక]] చరిత్రకు పూర్వరంగప్రాయం. ఇందులో 4 అధ్యాయాలు ఉన్నాయి. మొదటి అధ్యయంలో నాట్యకళ యొక్క స్వరూప నిరూపణాత్మకము, రెండవ అధ్యాయంలో ప్రాచ్య-పాశ్చాత్య రూపక నిరూపణాత్మకము, మూడవ అధ్యాయంలో ప్రాచీనకాలంలో తెలుగు రాష్ట్రాలలో [[సంగీతము|సంగీత]]-[[నృత్యం|నృత్య]]-నాట్యములు పొందిన వికాసం, నాలుగవ అధ్యాయంలో ప్రాచీనాంధ్రదేశములోని దృశ్య కళా స్వరూపములును ఇందులో వివరించబడింది.
# ద్వితీయభాగం: ఆధునిక తెలుగు నాటకరంగ ఆరంభ వికాసాలకు సంబంధిచిన భాగం. ఈ పుస్తకం మొత్తంలో ఈ ద్వితీయభాగమే ప్రముఖమైనదిగా చెప్పవచ్చు. మొదటి అధ్యయం (1860-1886) లో ఆధునిక తెలుగు నాటక రచనా-ప్రదర్శనల ప్రారంభం, రెండవ అధ్యాయం (1886-1900) లో తెలుగు నాటక రచన బహుముఖములుగా వికసించడం, మూడవ అధ్యాయం (1900-1920) లో ఆధునిక తెలుగు నాటక రచనా-ప్రయోగాల విసృతి, నాలుగవ అధ్యాయం (1920-44) లో నాటక రచనకు సంబంధించిన నూతన ప్రయోగాలు, ఐదవ అధ్యాయం (1920-44) లో నాటికల ఏకాంకిల వికాసం, ఆరవ అధ్యాయంలో సమకాలీన రచనలు (1944 తరువాతి రూపక చరిత్ర) వివరించడం జరిగింది.
# తృతీయభాగం: ఈ భాగంలో మూడు అధ్యాయాలు ఉన్నాయి. ఈ భాగం తెలుగు నాటక చరిత్రకు సింహావలోకన భాగం. మొదటి అధ్యాయంలో ఇతివృత్త-రచనా స్వరూపాలనుబట్టి నాటకరచన సమీక్ష, రెండవ అధ్యాయంలో ఆధునిక నాటక ప్రయోగాల వివిధ దశలు, మూడవ అధ్యాయంలో తెలుగులోని నాటక విమర్శ యొక్క చరిత్ర, ఇతర అంశాల సమీక్షలు[[సమీక్ష]]లు కలవు.
 
== మూలాలు ==