నాగార్జునసాగర్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 66:
[[ఫైలు:Nagarjunasagar foundation stone.JPG|thumb|200px|శంకుస్థాపన ఫలకం.]]
 
మద్రాసు ప్రభుత్వము వారి ప్రయత్నాలకు అన్నివిధములా అడ్డు పడింది. రాజా గారు కృష్ణా రైతుల వికాస సంఘము స్థాపించి కేంద్ర ప్రభుత్వముపై ఒత్తిడి తెచ్చారు. ప్రభుత్వము [[ఖోస్లా కమిటీ]] ఏర్పాటు చేసింది. కమిటీ పర్యటనలో [[నందికొండ]] ప్రస్తావన లేదు. రాజా ఎంతో నచ్చజెప్పి నందికొండ సందర్శన చేర్పించాడు. కానీ కమిటీ సభ్యులు నందికొండకు కార్లు, జీపులలో వెళ్ళుటకు అనువైన దారి లేదనే సాకుతో విషయమును దాటవేయుటకు ప్రయత్నించారు. రాజా వేలరూపాయలు ఖర్చు పెట్టి ఇరవైఇదు గ్రామాలనుండి ప్రజలను, స్వయంసేవకులను కూడగట్టి, వారము రోజులు రాత్రింబగళ్ళు కష్టపడి పనిచేసి, కార్లు వెళ్ళుటకు వీలగు దారి వేశారు. 1952లో[[1952]]లో ఖోస్లా కమిటీ [[నందికొండ]] డాం ప్రదేశము చూసి ప్రాజెక్టు కట్టుటకు ఇంతకన్న మంచి చోటు వుండదని తేల్చింది. [[విజయవాడ]] నుండి 260 మైళ్ళ పొడవునా ఖోస్లా కమిటీకి ప్రజలు ఘనస్వాగతం పలికారు. ప్రాజెక్ట్ ప్రాంతం పరిశీలించిన ఖోస్లా "ఇది భగవంతుడు మీకు ఇచ్చిన అమూల్యమైన వరం" అని తెల్పాడు.
 
ఖోస్లా కమిటీ రిపోర్టును తొక్కిపెట్టుటకు [[ఢిల్లీ]]లో ప్రయత్నములు మొదలైనవి. రాజా ఢిల్లీ వెళ్ళి ప్రొఫెసర్ [[ఎన్.జి.రంగా]], [[మోటూరు హనుమంతరావు]], [[కొత్త రఘురామయ్య]] మొదలగు పార్లమెంటు సభ్యులను కలిసి, రిపోర్టును వెలికితీయించి దాని ప్రతులను అందరికి పంచిపెట్టి, ప్రణాళికా సంఘం సభ్యులందరిని ఒప్పించి సుముఖులు చేశాడు. ప్రణాళికా సంఘం ఖోస్లా కమిటీ సూచనలను [[1952]]లో ఆమోదించింది. జలాశయ సామర్థ్యం 281 టి.ఎం.సి.గా సూచించింది. అదే సమయములో రాష్ట్ర ప్రభుత్వము కూలిపోయింది. రాష్ట్రములో గవర్నర్ (చందూలాల్ త్రివేది) పాలన ఆరంభమయింది. త్రివేది ప్రధానమంత్రి [[జవహర్ లాల్ నెహ్రూ]] గారిని ఖోస్లా కమిటీ రిపోర్టు ఆమోదించమని విజ్ఞప్తి చేశారు. చివరకు 1954 లో నాగార్జునసాగర్ నిర్మాణానికి ఆమోదముద్ర లభించింది. [[1955]] [[డిసెంబర్ 10]]న ([[మన్మధ]] నామ సంవత్సరం [[కార్తీక బహుళ ద్వాదశి]] నాడు) అప్పటి [[ప్రధానమంత్రి]] [[జవహర్‌లాల్ నెహ్రూ]] ప్రాజెక్టు నిర్మాణానికి [[శంకుస్థాపన]] చేసారు. అప్పటి హైదరాబాదు రాష్ట్ర [[ముఖ్యమంత్రి]], [[బూర్గుల రామకృష్ణారావు]], [[ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు|ఆంధ్ర రాష్ట్ర]] [[గవర్నర్]] [[సి.ఎం.త్రివేది]] ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. నిర్మాణ సమయములో రాజా గారు యాభైరెండు లక్షల రూపాయిలు మాచింగ్ గ్రాంటుగా ఇచ్చారు. డ్యాము నిర్మాణం [[1969]]లో పూర్తయింది. క్రెస్టు గేట్లను అమర్చే పని [[1974]]లో పూర్తయింది.
"https://te.wikipedia.org/wiki/నాగార్జునసాగర్" నుండి వెలికితీశారు