గోల్కొండ: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: వుంది. → ఉంది. (9), లు నుండి → ల నుండి, దృడ → దృఢ using AWB
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 12:
[[బొమ్మ:Golkonda (4).jpg|thumb|right|300px|గోల్కొండ కోట దృశ్యము.]]
గోల్కొండ నాలుగు వేర్వేరు కోటల సముదాయం, ఒకదానిని చుట్టి మరొకటి నిర్మించబడ్డాయి. కోటను పెంచుటలో, పటిష్ఠపరుచటలో కుతుబ్‌షాహిలదే ప్రధాన పాత్ర. మొదటి నిజాం వశమైన కాలంలో కోట వెలుపలి భాగాన తూర్పు దిక్కున ఒక గుట్ట ఉండేది. దానిని శత్రువు ఆక్రమిస్తే తరలించుట కష్టమని భావించిన నిజాం గుట్టను కోటలోపలికి కలుపుతూ చుట్టూ గోడను నిర్మించాడు. దుర్గం చుట్టూ గుట్టలు పెట్టని కోటలవలె ఉన్నాయి. ఈ కోట 87 అర్ధ చంద్రాకారపు బురుజులతోకూడిన 10 కి.మీ. పొడవు గోడను కలిగి ఉంది; కొన్ని బురుజులలో ఇంకా ఫిరంగులను నిలిపిఉంచారు. ఇంకా 8 సింహద్వారములు, 4 ఎత్తగలిగే వంతెనలు (draw bridge), బోలెడన్ని రాచమందిరాలు, మసీదులు, గుళ్ళు, అశ్వశాలలు మొదలగునవి చాలా ఉండేవి. సింహద్వారములలో అన్నిటికంటే కిందది మరియు అన్నిటికంటే బయట ఉండే ఫతే దర్వాజా (విజయ ద్వారము) నుండే మనము గోల్కొండ కోటను చూడటానికి వెళ్తాము. ఔరంగజేబు విజయము తరువాత ఈ ద్వారము గుండానే తన సైన్యమును నడిపించాడు. ఏనుగుల రాకను ఆడ్డుకోవటానికి ఆగ్నేయము వైపున పెద్ద పెద్ద ఇనుప సువ్వలు ఏర్పాటు చేసారు. ఫతే దర్వాజా నిర్మించటానికి ధ్వనిశాస్త్రమును ఔపోసన పట్టినట్లున్నారు. గుమ్మటం కింద ఒక నిర్ణీత ప్రదేశమునందు చప్పట్లు కొడితే కిలోమీటరు ఆవల గోల్కొండలో అతి ఎత్తయిన ప్రదేశములో ఉన్న "బాలా హిస్సారు" వద్ద చాలా స్పస్టముగా వినిపిస్తుంది. ఈ విశేషమును ఒకప్పుడు ఇక్కడి నిర్వాసితులు ప్రమాదసంకేతములు తెలుపుటకు ఉపయోగించేవారు. ఇప్పుడు మాత్రం సందర్శకులకు వినోదం పంచేదిగా మిగిలిపోయింది.
 
==బారాదరి==
ఇది మూడు అంతస్తులలో నిర్మించబడిన రాజుగారి సభా మండపము. దీని నుండి ''గోషామహల్‌ బారాదరి హైదరాబాదు'' భూమార్గము కూడా ఉంది. దీని పై అంతస్తులో రాజ సింహాసనము ఉంది. దీని నుండి 30 మైళ్ళ విస్తీర్ణములో అతి సుందరము, శోభాయమానముగా కన్పిస్తుంది. ఇది సముద్ర మట్టమునకు 400 అడుగుల నుండి 2000 అడుగులుంటుంది. దీని నుండి తూర్పుగా కుతుబ్‌షా వంశపు శిథిలమైన భవనములు, లంగర్‌హౌజ్‌ చెరువు, హైదరాబాద్‌ నగరమున ముఖ్య కట్టడమైన చార్‌మినార్‌, మక్కా మసీదు, ఉస్మానియా వైద్యశాల చూడొచ్చు. తూర్పు-దక్షిణ మూలగా మీర్‌ ఆలమ్‌ చెరువు, ఫలక్‌నుమా భవనము, దక్షిణముగా మకై దర్వాజా, హిమయత్‌నగర్‌, దీనికి దక్షిణమున పడమర మూలగా తారామతి, ప్రేమామతి భవనములు, ఉస్మాన్‌ సాగర్‌ చెరువు (గండిపేట) పడమరగా ఉన్నాయి. తూర్పు - ఉత్తర మూలగా హుసేన్‌ సాగర్‌ చెరువు, సికింద్రాబాదు నగరము, ఉస్మానియా యూనివర్సిటీని చూడవచ్చు. ఉత్తర-పడమర మూలగా కుతుబ్‌షా రాజుల గోపురములు పెట్లాబురుజు చూడొచ్చు. ఉత్తరముగా గోల్కొండ కోట పట్టణము, హకీం పేట, బేగంపేట విమానాశ్రయాన్ని చూడొచ్చు.
"https://te.wikipedia.org/wiki/గోల్కొండ" నుండి వెలికితీశారు