శాంతా రంగస్వామి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
 
కుడిచేతితో బ్యాటింగ్ చేసే శాంతా రంగస్వామి టెస్టులలో 32.6 సగటుతో మొత్తం 750 పరుగులు సాధించింది. ఇందులో [[న్యూజీలాండ్]] పై సాధించిన ఒక సెంచరీ కూడా ఉంది. ఆమె అత్యధిక స్కోరు 108 పరుగులు. బౌలింగ్ లో 16 వికెట్లు కూడా సాధించింది. బౌలింగ్ లో ఆమె అత్యున్నత గణాంకము 42 పరుగులకు 4 వికెట్లు. ఇది [[ఇంగ్లాండు]] పై సాధించింది.
 
వన్డే క్రికెట్‌లో 19 మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించి 15.1 సగటుతో 287 పరుగులు సాధించింది. బౌలింగ్‌లో 29.41 సగటుతో 12 వికెట్లు పడగొట్టింది. [[1982]]లో న్యూజీలాండ్ లో జర్గిన మహిళా ప్రపంచ కప్ క్రికెట్‌లో బ్యాటింగ్ మరియు బౌలింగ్ రెండింటిలోనూ ఆమె ప్రథమస్థానం పొందింది. ఇదే ప్రపంచ కప్ పోటీలలో న్యూజీలాండ్‌పై ఆమె వన్డేలలో ఏకైక అర్థ శతకం సాధించింది.
ప్రస్తుతం శామ్తా రంగస్వామి క్రికెట్ రచయిత్రిగా పనిచేస్తుంది.
 
==అవార్డులు==
ఆమె యొక్క ప్రతిభను గుర్తించి భారత ప్రభుత్వం [[1976]]లో భారత క్రీడారంగంలో అత్యున్నతమైన [[అర్జున అవార్డు]]ను ప్రధానం చేసింది.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/శాంతా_రంగస్వామి" నుండి వెలికితీశారు