నాగకేసరి నూనె: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 22:
 
===పూలు-పళ్ళు===
పూలు పుష్పించు కాలం చెట్లు పెరిగే ప్రాంతాన్ని బట్టి మారును. పూలు పూయడం ఫిబ్రవరి-మార్చినెలలలో మొదలై ఏప్రిల్-మే నెలల వరకు కొనసాగును. ఫలదీకరణ తరువాత పళ్లగా మారుటకు రెండు-మూడు మాసాలు పట్టును. పూలు తెల్లగా, తియ్యటి, కమ్మని వాసన కల్గి 7.5-10 సెం.మీ వ్యాసంతో కొమ్మల చివర ఒంటిగా కాని, లేదా జతగా కాని పుష్పించును.పూలను [[కడుపునొప్పి]], ఆయసంఆయాసం వంటి వాటి నివారణ మందులలో వినియోగుస్తారు. ఎండబెట్టిన పూలను/పూలలోని భాగాలను ఆయుర్వేద మందులతయారిలో ఉపయోగిస్తారు.
కాయలు పళ్ళగా మారడం చెట్లు పెరుగుప్రదేశాన్నిపెరుగు ప్రదేశాన్ని బట్టి మారును. బెంగాల్ లో జూలైనెల మధ్యనుండి సెప్టెంబరు వరకు, అస్సాంలో మే-జులైలో, వ్యానడ్ (కేరళ) లో డెసెంబరు-జనువరిలో, ట్రావెన్‍కూర్ (కేరళ) లోఅక్టొబరు-మార్చి నెలలలో పళ్ళు వచ్చును. పళ్లు ఎర్రగా, దీర్ఘ అండాకారంగా, గుండ్రంగా వుండును.3" (అంగుళాలు) వ్యాసం కల్గివుండును. ఒక్కో పండు 50-60 గ్రాములు వుండును. పెలుసైన గట్టి పెంకును కలిగి వుండును.ఒక పండులో 2-3 గింజలుందును. పై పెంకులో పీచు (Fibre) భాగం 50% వరకుండును. గింజలో విత్తనం (kernel)35% వరకుండును. గింజ పెంకులోపలి విత్తనం పసుపు రంగులో గుండ్రంగా వుండును <ref name="seed"/>.
 
===నూనెను తీయుట===
"https://te.wikipedia.org/wiki/నాగకేసరి_నూనె" నుండి వెలికితీశారు