"భారత జాతీయపతాకం" కూర్పుల మధ్య తేడాలు

(vectorize (GlobalReplace v0.6.5))
(vectorize (GlobalReplace v0.6.5))
20వ శతాబ్దం ప్రారంభంలో [[స్వాతంత్ర్యోద్యమం]] బాగా ఊపందుకున్నప్పుడు జాతీయోద్యమ స్ఫూర్తిని, లక్ష్యాలను ప్రతిబింబించే జాతీయపతాకం అవసరమైంది. [[1904]]లో [[వివేకానందుడు|వివేకానందుడి]] శిష్యురాలైన [[ఐర్లండు|ఐరిష్]] వనిత [[సోదరి నివేదిత]] భారతదేశపు మొట్టమొదటి పతాకాన్ని రూపొందించింది. ఇది పసుపు, ఎరుపు రంగుల్లో ఉన్న జెండా. జెండా మధ్యభాగంలో [[వజ్రాయుధం]], [[తెల్ల తామర]] గుర్తులున్నాయి. "(భారత) మాతకు వందనం" అనే అర్థం వచ్చే బెంగాలీ మాటలు "বন্দে মাতরম (వందేమాతరం)" ఆ జెండా మీదున్నాయి. ఎరుపు స్వాతంత్ర్య పోరాటానికి, పసుపు విజయానికి, తెల్లతామర స్వచ్ఛతకు చిహ్నాలు.
 
[[దస్త్రం:India1907FlagFlag of India 1907 (Nationalists Flag).pngsvg|thumb|220px|1907 లో మేడం భికాజీ కామా ఎగరేసిన జండా]]
మొట్టమొదటి త్రివర్ణపతాకం [[1905]]లో జరిగిన [[బెంగాల్ విభజన]]ను వ్యతిరేకిస్తూ జరిగిన ఒక నిరసన ప్రదర్శనలో [[1906]] [[ఆగష్టు 7]] న [[కలకత్తా]]లోని పార్శీబగాన్ స్క్వేర్లో [[శచీంద్ర ప్రసాద్ బోస్]] చే ఆవిష్కరించబడింది. ఈ పతాకాన్ని "[[కలకత్తా పతాకం]]" అంటారు. ఈ పతాకంలో సమాన వెడల్పుతో అడ్డంగా మూడు పట్టీలున్నాయి: పైన నారింజ రంగు, మధ్యలో పసుపుపచ్చ, క్రింద ఆకుపచ్చ. పైపట్టీ మీద సగం విచ్చుకున్న ఎనిమిది తామరపూలు, క్రింది పట్టీ మీద నెలవంక, మధ్యలో దేవనాగరి లిపిలో "వందేమాతరం" అనే అక్షరాలున్నాయి.
 
29

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2170779" నుండి వెలికితీశారు