భాగవతం - ఒకటవ స్కంధము: కూర్పుల మధ్య తేడాలు

చి బాటు చేసిన మార్పు: ఆంగ్ల నేంస్పేసు పేర్లు తెలుగులోకి మార్పు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
తరువాత ఈ భాగవతాన్ని ఎలా ప్రచారములోనికి తెచ్చినారో వివరింపబడినది. [[మహాభారతము]] ముగియడము, పరిక్షిత్తు మినహా అందరూ పరమ పదము చేరుకోవడము,[[ భీష్ము]]ని నిర్యాణము, [[శ్రీ కృష్ణ భగవానుని]] [[ద్వారకా]] ప్రయాణము, [[ద్వారక]] లో వారు ప్రవేశించడము, [[పరిక్షిత్తు]] జననము,[[ దృతరాష్ట్రుడు]] అడవులకి వెళ్ళడము, శ్రీ కృష్ణ నిర్యాణము,[[ పాండవులు]] రాజ్యాన్ని వదిలి వెళ్ళడము,[[ పరిక్షిత్తు ]]మరియు [[కలి]] సంవాదము, [[పరిక్షిత్తు]] [[కలి పురుషుడుని ]] దండించడము, దయచూపడము, [[పరిక్షిత్తు]] కి బ్రాహ్మణ బాలుడు శాపాన్ని ఒసగడము, [[శుకదేవ మహర్షి]] ఆగమనము,[[ పరిక్షిత్తు]] వారిని ప్రశ్నలు అడగటము అనే వివరములు ఈ ప్రధమ స్కంధములో గలవు.

[[ప్రధమ స్కందము ]]

#ప్రార్థన
{| class="wikitable"

! ప. సం.
! వృత్తము పేరు
! పద్య పాఠము

| 1
| శార్ధూలము
| శ్రీ కైవల్యపదంబుఁ జేరుటకునై చింతించెదన్, లోకర
క్షైకారంభకు, భక్తపాలన కళాసంరంభకున్, దానవో
ద్రేక స్తంభకుఁ గేళి లోలవిలసద్దృగ్జాల సంభూత నా
నా కంజాత భవాండ కుంభకు మహా నందాంగనా డింభకున్.

| 2
| ఉత్పలమాల
| వాలిన భక్తి మ్రొక్కెద నవారిత తాండవ కేళికిన్ దయా
శాలికి శూలికిన్ శిఖరిజా ముఖ పద్మ మయూఖ మాలికిన్
బాల శశాంక మౌళికిఁ గపాలికి మన్మధ గర్వ పర్వతో
న్మూలికి నారదాది ముని ముఖ్య మనస్సరసీరుహాలికిన్.

| 3
| ఉత్పలమాల
| ఆతత సేవఁ జేసెద సమస్త చరాచర భూత సృష్టి వి
జ్ఞాతకు భారతీ హృదయ సౌఖ్య విధాతకు వేద రాశి ని
ర్ణేతకు దేవతా నికర నేతకుఁ గల్మష జేతకున్ నత
త్రాతకు ధాతకున్ నిఖిల తాపస లోక శుభ ప్రదాతకున్.

|4
| వచనము
|అని నిఖిల ప్రధాన దేవతా వందనంబు సేసి,

|5
|ఉత్పలమాల
|ఆదర మొప్ప మ్రొక్కిడిదు నద్రి సుతా హృదయా నురాగ సం
పాదికి దోష భేదికిఁ బ్రపన్న వినోదికి విఘ్న వల్లికా
ఛ్ఛేదికి మంజువాదికి నశేష జగజ్జన నంద వేదికిన్
మోదక ఖాదికిన్ సమద మూషక సాదికి సుప్రసాదికిన్.

|6
|ఉత్పలమాల
|క్షోణితలంబునన్ నుదురు సోఁకఁగ మ్రొక్కి నుతింతు సైకత
శ్రోణికిఁ జంచరీక చయ సుందర వేణికి రక్షితామర
శ్రేణికిఁ దోయజాతభవ చిత్త వశీకరణైక వాణికిన్
వాణికి నక్షదామ శుక వారిజ పుస్తక రమ్యపాణికిన్.

|7
|శార్ధూలము
|పుట్టం, బుట్ట శిరంబునన్ మొలవ, నంభొయాన పాత్రంబునన్
నెట్టం గల్గను, గాళిఁ గొల్వను, బురాణింపన్ దొరంకొంటి మీఁ
దెట్టే వెంటఁ జరింతుఁ దత్సరణి నా కీవమ్మ యో యమ్మ మేల్
పట్టున్ నా కగు మమ్మ నమ్మితిఁ జుమీ బ్రాహ్మి! దయాంభోనిధీ.!

|8
|ఉత్పలమాల
|శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా
హార తుషార ఫేన రజతాచల కాశ ఫణీశ కుంద మం
దార సుధా పయోధి సిత తామర సామర వాహినీ శుభా
కారత నొప్పు నిన్ను మదిఁ గానఁగ నెన్నడు గల్గు భారతీ.

|9
|ఉత్పలమాల
|అంబ, నవాంబు జోజ్వల కరాంబుజ, శారద చంద్ర చంద్రికా
డంబర చారుమూర్తి, ప్రకట స్పుట భూషణ రత్న దీపికా
చుంబిత దిగ్విభాగ, శ్రుతి సూక్తి వివక్త నిజ ప్రభావ, భా
వాంబర వీధి విశ్రుత విహారిణి, నన్ గృపఁ జూడు భారతీ.

|10
|ఉత్పలమాల
|అమ్మలఁ గన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాలఁ పె
ద్దమ్మ, సురారులమ్మ కడు పాఱడిపుచ్చి నయమ్మ, తన్ను లో
నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ, దుర్గ మా
యమ్మ, కృపాబ్ధి ఇచ్చుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్.

|11
|మత్తేభము
|హరికిం బట్టపు దేవి, పున్నెముల ప్రో, వర్ధంపుఁ బెన్నిక్క, చం
దురు తోఁ బుట్టువు, భారతీ గిరి సుతల్ తో నాడు పూఁబోడి, తా
మరలం దుండెడి ముద్దరాలు, జగముల్ మన్నించు నిల్లాలు భా
సురతన్ లేములు వాపు తల్లి సిరి యిచ్చున్ నిత్యకళ్యాణముల్.

|12
|వచనము
|అని ఇష్టదెవతలం జింతించి దినకర కుమార ప్రముఖులం దలంచి ప్రథమ కవితా విరచన విద్యా విలాసాతిరేకి వాల్మీకి నుతయించి హయగ్రీవ దనుజకర పరిమిళిత నిగమ నివహ విభాగ నిర్ణయ నిపుణతా సముల్లాసుం డగు వ్యాసునకు మ్రొక్కి, శ్రీమహాభాగవత కధా సుధారస ప్రయోగికి శుక యోగికి నమస్కరించి, మృదు మధుర వచన రచన పల్లవిత స్ధాణునకున్ బాణునకుం బ్రణమిల్లి. కతిపయ శ్లోక సమ్మోదిత సూరు మయూరు నభినందించి, మహా కావ్య కరణ కళా విలాసుం గాళిదాసుం గొనియాడి, కవి కమల విసర రవిం భారవిం బొగడి, విదళితాఘు మాఘు స్తుతియించి, యాంధ్ర కవితా గౌరవ జన మనోహరి నన్నయ సూరిం గైవారంబు సేసి, హరిహర చరణార వింద వందనాభిలాషిఁ దిక్క మనీషిన్ భూషించి, మఱియు నితర పూర్వకవి జన సంభావనంబు గావించి, వర్తమాన కవులకుం బ్రియంబు వలికి, భావికవుల బహూకరించి, యుభయ కావ్య కరణ దక్షుండనై.

{{భాగవతము స్కందములు}}