బుర్రకథ: కూర్పుల మధ్య తేడాలు

→‎ఒక కళారూపము: Kdkdoskdmvjvkkdkckvkvkfodom mckfkd!c!¡c
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 21:
* రెండో వ్యక్తి. ఇతను ముఖ్య కథకుడి కుడిభుజం వైపు ఉంటాడు. అంటే - బుర్రకథ చూసేవారు ఎడమ పక్కనుంచి ఒకటి, రెండు, మూడు అని లెక్కపెడితే మొదట లెక్కకు వచ్చేది ఇతనే! ఇతను హాస్యగాడు కాదు. ఇతన్ని రాజకీయం అంటారు. అంటే - ముఖ్య కథకుడు ఎక్కువగా పాటలతో కథను చెబుతుంటే - మధ్యలో వచనం వచ్చినప్పుడల్లా సీరియస్‌ చర్చల్ని ఇతను కథకుడితో చేస్తుంటాడు. లేదా అతను వచనంతో కథ చెబుతుంటే - ఆహా ఓహో అంటూ వంత పాడుతుంటాడు. రంగుల దుస్తులతో, విభూతి రేఖలతో, చేత డప్పులతో వీరు కథకునికి పాటలోనూ, చిందులోనూ తోడుంటాడు. కథలో పట్టు నిలబెడుతుంటారు. ఏమైందని ప్రశ్నిస్తూంటాడు. ఉత్సాహాన్ని, ఊపును పంచుతుంటాడు. ప్రేక్షకుల ఆసక్తిని పెంచుతుంటాడు. మూడో వ్యక్తి హాస్యం చేసినప్పుడు అతనితో ఇతను చర్చిస్తాడు. ఆ సమయంలో కథకుడు వెనక్కి వెళ్తాడు. రాజకీయం, హాస్యం ఇద్దరూ సరదా సంగతులు చర్చించుకున్నాక- మళ్లీ మధ్యలోని కథకుడు ముందుకొచ్చి ముఖ్య కథను కొనసాగిస్తాడు. అయితే కొందరు అపోహపడే విధంగా రాజకీయం అనే ఈ వ్యక్తి - హాస్యగాడితో చర్చిస్తాడే గానీ హాస్యాన్ని పంచడం ఇతని బాధ్యత కాదు. కథ చెప్పేటప్పుడు ముఖ్య కథకుడికి అండగా ఉండి సహకరించడమే ఇతని ముఖ్య బాధ్యత.
* మూడవ వ్యక్తి హాస్యం. బుర్ర కథ మొత్తం తీక్ష్ణంగా సాగితే ఇబ్బంది కాబట్టి - అవకాశం ఉన్నప్పుడల్లా ఇతను హాస్యంగా మాట్లాడతాడు. - ప్రస్తుత నిత్య జీవితానికి సరిపడే విధంగా కబుర్లు చెబుతూ - ముఖ్య కథకి అప్పుడప్పుడు అడ్డుకట్ట వేస్తున్నట్టు అనిపిస్తుంది గానీ - అది కేవలం వినోదం కోసమే! హాస్యగాడు తన హాస్యంతో ముఖ్య కథ తాలూకు విలువని తగ్గించకూడదు. ఎక్కడైనా అలా తగ్గితే కథకుడు జోక్యం చేసుకుని - కథ తాలూకు గాంభీర్యాన్ని కోల్పోకుండా చూస్తాడు. తిరిగి కథలోకి జనాన్ని తీసుకు వెళతాడు.
* మొత్తం మీద చూస్తే - బుర్ర కథలో ముఖ్య కథకుడు గంభీరమైన కథకుడైతే, హాస్యగాడు హాస్యం చేస్తాడు. రాజకీయం చేసే వ్యక్తి చేయాల్సిన పని - సమతౌల్యం( బ్యాలెన్స్‌ ) | కథకుడికి వత్తాసు పలుకుతూ కథ తాలూకు విలువనీ గాంభీర్యాన్నీ కాపాడడం, ప్రేక్షకుల ఆసక్తిని కాపాడేందుకు హాస్యగాడితో కలిసి హాస్య చర్చలో పాలుపంచుకోవడం రెండింటినీ జాగ్రత్తగా నిర్వహిస్తాడు. అయితే ఇతను హాస్యగాడు కాదు.
 
==కథావస్తువులు==
"https://te.wikipedia.org/wiki/బుర్రకథ" నుండి వెలికితీశారు