జె.బి.కృపలానీ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 23:
కృపలానీ తన రాజకీయ శేషజీవితమంతా ప్రతిపక్షములోనే గడిపాడు. 1938 నుండి ఈయన భార్య అయిన [[సుచేతా కృపలానీ]], కాంగ్రేసు పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి కేంద్ర మంత్రివర్గములో అనేక మార్లు మంత్రిపదవులతో సహా అనేక ఉన్నత పదవులు పొందింది. ఈమె దేశములోనే మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రిగా ఉత్తర ప్రదేశ్ లో ప్రమాణస్వీకారం చేసింది. కృపలానీ దంపతులు పార్లమెంటులో తరచూ ఒకర్నొకరు ఢీకొనేవారు.
 
అయితే కృపలానీ దంపతులిద్దరూ [[హిందూ వివాహ చట్టము]]లోని చాలా భాగాలు, ప్రత్యేకంగా "వివాహ హక్కుల పునరుద్ధరణ"<ref>http://www.netlawman.co.in/acts/hindu-marriage-act-1955.php?pageContentID=77</ref> అనే వివాదాస్పద క్లాజు యొక్క అనావశ్యకతపై మాత్రం ఏకగ్రీవంగా అంగీకరించారు. చట్టములోని ఈ క్లాజు వలన విడాకులు పొందడానికి విఫలప్రయత్నం చేసిన భాగస్వామి తన వైవాహిక సంబంధాలను, హక్కులను తిరిగి విడాకుల దావా వేయక ముందున్న యధాస్థితికి చేర్చమని కోర్టును కోరవచ్చు. ఇది దారుణమని తలచిన కృపలానీ అత్యంత చిరస్మరణీయమైన ప్రసంగం చేస్తూ "ఈ వెసలుబాటు is physically undesirable, నైతికంగా అనభిలషణీయం and aesthetically జుగుప్సాకరమైనది." అంటూ తన వ్యతిరేకతను వ్యక్తపరిచాడు.{{Fact|date=February 2007}}<ref>http://www.ourkarnataka.com/Articles/law/conjugalrights.htm</ref>
 
కృపలానీ పత్రికారంగముపై పార్లమెంటు యొక్క ప్రత్యేకార్హత విషయంలో ఆందోళన చెందాడు. నెహ్రూ హయాములో "ఒక పార్లమెంటు సభ్యుని పరువు ప్రతిష్టలకు భంగము కలిగించినందుకు" గాను [[లోక్ సభ]] బ్లిట్జ్ వారపత్రిక ప్రధాన సంపాదకుడైన రూసీ కరాంజియాను పిలిపించి మందలించింది. కరాంజియా నెహ్రూకు సన్నిహితుడైనప్పటికీ, కృపలానీ ఈ విషయంలో కరాంజియాను సమర్ధించాడు.
"https://te.wikipedia.org/wiki/జె.బి.కృపలానీ" నుండి వెలికితీశారు