భాగవతం - ఒకటవ స్కంధము: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 58:

*కృతిపతి నిర్ణయము
{| class="wikitable"

|ఉత్పలమాల
|ఇమ్మనుజేశ్వరాధముల కిచ్చి పురంబులు వాహనంబులున్
సొమ్ములుఁ గొన్ని పుచ్చుకొని, చొక్కి శరీరము బాసి, కాలుచే
సమ్మెట వ్రేటులం బడక సమ్మతితో హరి కిచ్చి చెప్పె నీ
బమ్మెర పోతరా జొకఁడు భాగవతంబు జగధ్ధితంబుగన్.
|13

|తేటగీతి
|చేతులారంగ శివునిఁ బూజింపఁడేని,
నోరునొవ్వంగ హరికీర్తి నుడువఁడేని
దయయు సత్యంబులోను గాఁ దలఁపఁ డేనిఁ,
గలుగ నేటికిఁ దల్లుల కడుపుఁ జేటు.
|14

|వచనము
|అని మఱియు మదీయ పూర్వజన్మ సహస్ర సంచిత తపః ఫలంబున శ్రీ మన్నారాయణ కథా ప్రపంచ విరచనాకుతూహలుండనై యొక్క రాకానిశాకాలంబున సోమోపరాగంబురాకఁ గని సజ్జ నానుమతంబున నభ్రంకషశుభ్ర సముత్తుంగ భంగయగు గంగ కుం జని క్రుంకులిడి వెడలి మహనీయ మంజుల పులిన తలంబున మహెశ్వర ధ్యానంబు సేయుచుఁ గించి దున్మీలుత లోచనుండనై యున్నయెడ.
|15

|సీసము
|మెఱుఁగు చెంగట నున్న మేఘంబు కైవడి
నువిద చెంగట నుండ నొప్పువాఁడు
చంద్రమండల సుధాసారంబు పోలిక
ముఖమునఁ జిఱునవ్వు మొలచువాఁడు
వల్లీయుత తమాల వసుమతీజము భంగి
బలు విల్లు మూఁపునఁ బరఁగువాఁడు
నీలనగాగ్ర సన్నిహితభానుని భంగి
ఘనకిరీటము దలఁ గల్గువాఁడు
|16

|ఆటవెలది
|పుండరీక యుగముఁ బోలు కన్నుల వాఁడు,
వెడఁద యురమువాఁడు విపులభద్ర
ముర్తి వాఁడు రాజముఖ్యుఁ డొక్కరుఁడు నా
కన్నుఁగవకు నెదురఁ గానఁబడియె.
|16.1

|వచనము
|ఏ నా రాజశేఖరునిం దేఱిచూచి భాషింప యత్నంబు సేయునెడ నతఁడు దా రామభద్రుండ మన్నమాంకితాంబుగ శ్రీ మహాభాగవతంబుఁ దెనుంగు సేయుము. నీకు భవబంధంబులు దెగు నని యాన తిచ్చి తిరోహితుండయిన సమున్మీలిత నయనుండనై వెఱఁగు పడి చిత్తంబున.
|17

|కంద
|పలికెడిది భాగవతమఁట,
పలికించెడి వాడు రామభద్రుండఁట, నేఁ
బలికిన భవహర మగు నఁట,
పలికెద వేఱొండు గాథఁ బలుకఁగ నేల.
|18

|ఆటవెలది
|భాగవతము దెలిసి పలుకుట చిత్రంబు,
శూలికైనఁ దమ్మిచూలికైన
విబుధ జనుల వలన విన్నంత కన్నంత,
దెలియ వచ్చినంత తేటపఱుతు.
|19

|కంద
|కొందఱకుఁ దెనుఁగు గుణమగుఁ,
గొందఱకును సంస్కృతంబు గుణమగు రెండుం
గొందఱికి గుణములగు నే,
నందఱి మెప్పింతుఁ గృతుల నయ్యైయెడలన్.
|20

|మత్తేభము
|ఒనరన్ నన్నయ తిక్కనాదికవు లీ యుర్విం బురణావళుల్
తెనుఁగుం జేయుచు మత్పురాకృత శుభాధిక్యంబు దానెట్టిదో
తెనుగుం జేయరు మున్ను భాగవతమున్ దీనిన్ దెనింగించి నా
జననంబున్ సఫలంబుఁ చెసెదఁ బునర్జన్మంబు లేకుండఁగన్.
|21

|మత్తేభము
|లలితస్కంధము, కృష్ణమూలము, శుకాలపాభిరామంబు, మం
జులతా శోభితమున్, సువర్ణ సుమనస్సుజ్ఞేయమున్, సుందరో
జ్వల వృత్తంబు మహా ఫలంబు విమల వ్యాసాల వాలంబునై
వెలయున్ భాగవతాఖ్య కల్పతరు వుర్విన్ సద్విజ శ్రేయమై.
|22

|వచనము
|ఇట్లు భాసిల్లెడు శ్రీమహాభాగవతపురాణ పారిజాతపాదప సమాశ్రయంబున, హరి కరుణావిశేషంబునను, గృతార్ధత్వంబు సిధించెనని బుధ్ధి నెఱింగి లేచి మరలి కొన్ని దినంబులకు నేకశిలానగరంబునకుం జనుదెంచి యందు గురు వృధ్ధ బుధ బంధు జనానుజ్ఞాతుండనై.
|23

*|గ్రంథ కర్త వంశ వర్ణనము
{{భాగవతము స్కందములు}}