భాగవతం - ఒకటవ స్కంధము: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 163:
|33

*కథా ప్రారంభము
{| class="wikitable"

|సీసము
|విశ్వ జన్మ స్థితి విలయంబు లెవ్వని
వలన నేర్పడు ననువర్తమున
వ్యావర్తనమునఁ గార్యములం దభిజ్ఞుఁడై
తాన రాజగుచుఁ జిత్తమునఁ జేసి
వేదంబు లజునకు విదితముల్ గావించె
నెవ్వఁడు బుధులు మోహింతు రెవ్వ
నికి నెండమావుల నీటఁ గాచాదుల
నన్యోన్యబుధ్ధి దా నడరునట్లు
|34

|ఆటవెలది
|త్రిగుణసృష్టి యెందు దీపించి సత్యము
భంగిఁ దోఁచు స్వప్రభానిరస్త
కుహకుఁ డెవ్వఁ డతనిఁ గోరి చింతించెద,
ననఘు సత్యుఁ బరుని ననుదినంబు.
|34.1

|వచనము
|ఇట్లు "సత్యం పరం ధీమహి" యను గాయత్రీ ప్రారంభమున గాయత్రీ నామ బ్రహ్మస్వరూపంబై మత్స్యపురాణంబులోన గాయత్రి నధికరించి ధర్మవిస్తరంబును వృత్రాసుర వధంబును నెందుఁ జెప్పంబడు నదియ భాగవతం బని పలుకుటం జేసి యీ పురాణంబు శ్రీ మహాభాగవతంబున నొప్పుచుండు.
|35

|సీసము
|శ్రీమంతమై మునిశ్రేష్ఠ కృతంబైన
భాగవతంబు సద్భక్తితోడ
వినఁగోరువారల విములచిత్తంబులఁ
జెచ్చెర నీశుండు చిక్కుఁ గాక,
యితర శాస్త్రంబుల నీశండు చిక్కునె
మంచివారలకు నిర్మత్సరులకు
గపట నిర్ముక్తులై కాంక్ష సేయక యును
దగిలి యుండుట మహాతత్వబుధ్ధిఁ
|36

|తేటగీతి
|పరఁగ నాధ్యాత్మికాది తాపత్రయంబు
నడఁచి పరమార్ధభూతమై యఖిల సుఖద
మై సమస్తంబుఁ గాకయు నయ్యు నుండు
వస్తు వెఱుఁగంగఁ దగు భాగవతమునందు.
|36.1

|ఆటవెలది
|వేదకల్పవృక్షవిగళితమై శుక
ముఖసుధాద్రావమున మొనసియున్న
భాగవతపురాణ ఫలరసాస్వాదన
పదవిఁ గనుడు రసిక భావవిదులు.
|37

|కంద
|పుణ్యంబై మునివల్లభ
గణ్యంబై కుసుమ ఫల నికాయోత్థిత సా
ద్గుణ్యమయి నైమిశాఖ్యా
రణ్యంబు నుతింపఁ దగు నరణ్యంబుల లోన్.
|38

{{భాగవతము స్కందములు}}