గొల్ల వారు(యాదవులు)(గోకులము): కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 80:
==మందెచ్చుల వారు==
 
వెనుకబడిన తరగతులలో దాదాపు 22 కులాలకు యాచకవృత్తి కావడం గమనార్హం. కాగా బీసీ కులాలలో మరికొన్ని కులాలు ప్రత్యేకించి కొన్ని కులాలను మాత్రమే యాచిస్తాయి. ఇటువంటివాటిలో యాదవులను యాచించే కులస్తులు మందెచ్చులవాళ్లు. మందెచ్చులవారిని బొమ్మలాటవాళ్ళు, పొదపొత్తులవాళ్ళు, పొదరులు, పొగడపొత్తర్లు అని కూడా పిలుస్తారు [8]. గొల్ల, కురుమల(kurumagolla) దగ్గర మాత్రమే యాచి స్తారు.[9] యాచనలోనూ కులతత్వం వీరి తరతరాల ఆచారం. గ్రామా లకు వెళ్లినా యాదవ వాడలలోనే నివ సిస్తారు. మందెచ్చుల వాండ్లు తెలంగాణ ప్రాంతంలోని ప్రధానంగా నల్గొండ, వరం గల్‌, మెదక్‌ జిల్లాలలో ఎక్కువగా కనిపిస్తారు.మందెచ్చుల వారిలో పురుషుడు యాదవ చరిత్ర పొగుడుతూ రాగయుక్తంగా పాటలు పాడతాడు.అతని వెనక అతని భార్య తాళం వేస్తూ వంత పాడుతుంది.పాటలో గల వేగం కట్టిపడేస్తుంది.యాదవ కులానికి చెందిన వారు చనిపోతే అక్కడ మందెచ్చు లవాండ్లు హాజరవుతారు. ఇక్కొక తెగ కాటికాపరి శవాన్ని శ్మశానానికి తీసుకువెళ్లే సమయంలో పాడెకు ముందు భాగంలో నడుస్తూ కొమ్ము బూర ఊదుతూ,ఇంకొక తెగ గంగిరెద్దులవారు డోలువాయిస్తూ నడుస్తారు. ఆ తర్వాత మందెచ్చులవాళ్లు ఆ ఇంటి యాదవ పెద్దల కథలు ప్రత్యేక తీరులో చెపుతారు . కథానాయకుడు ఒక చేత కట్టె పట్టుకుని, మరో చేత్తో చిడతలు వాయిస్తూ, కాళగజ్జెల చప్పుడు చేస్తూ, సహచరునితో ముందు నిలుచుంటాడు. అతని వెనక ఇద్ద రు వంతలు పాడేవారు, ముందు వరస వారితో వెనుక వరసవారు పోటీపడుతూ కథ నడుపు తారు.గంగ రాజు కథ, పెద్దిరాజు కథ, కాటమ రాజుకథ ఇలా యాదవ పెద్దల కథలు చెప్పి అక్కడివారిని ఆనందపరుస్తారు. కథ పూర్తయ్యాక ఆ వాడలో ఉన్న ప్రజలు కొంత ధనం ఇస్తారు. ఇంతకు ముందు గొఱ్ఱెలను మేకలను సంభావనగా ఇచ్చేవారు.
 
==కాటమరాజు కథ దిద్దుబాటు==