నోబెల్ బహుమతి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 51:
[[భౌతిక శాస్త్రం]]లో నోబెల్‌ బహుమతిని పొందిన భారత సంతతికి చెందిన రెండవ వ్యక్తి [[సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్|సుబ్రహ్మణ్యన్‌ చంద్రశేఖర్‌]]. [[సి.వి.రామన్|సర్‌ సి.వి.రామన్‌]] లాగానే ఈయన కూడా దక్షిణ భారత దేశానికి చెందినవాడే. ఆయన [[చికాగో విశ్వవిద్యాలయం|చికాగో విశ్వవిద్యాలయ]] పరిశోధన సభ్యులలో ఒకరిగా [[1937]]వ సంవత్సరం [[జనవరి]] నెలలో చేరాడు. అప్పటినుంచి చివరివరకూ ఆయన సుదీర్ఘకాలం పాటు అంటే 60 సంవత్సరాలకు పై ఆ విశ్వవిద్యాలయంలోనే పనిచేసారు. చంద్రశేఖర్‌ ఇరవై వరకు గౌరవ పట్టాలు పొందారు. ఇరవై ఒక్క ప్రముఖ సంస్థలలో సభ్యుడిగా ఎన్నికయ్యారు. [[1983]]లో నోబెల్‌ బహుమతితో సహా ఎన్నో అంతర్జాతీయ పురస్కారాలు పొందారు. ఆయన గౌరవ స్మృతి చిహ్నంగా [[1999]]లో [[అమెరికా]] ప్రయోగించిన ‘ఎక్స్‌రే అంతరిక్ష ఖగోళ దర్శిని’కి ‘చంద్రా’ అని పేరుపెట్టడం ఆయనకు దక్కిన అరుదైన గౌరవం.
 
==6. అమర్త్యసేన్‌, (Amartya-Sen) - (1998)==
[[అర్థశాస్త్రం]]లో నోబెల్‌ బహుమతిని అందుకున్న వారిలో [[భారతదేశం]]లోనే కాదు, [[ఆసియా ఖండం]]లోనే ఏకైక వ్యక్తి ప్రొఫెసర్‌ [[అమర్త్యసేన్|అమర్త్యసేన్‌]]. మొత్తం ప్రపంచ దేశాలు, [[అర్థశాస్త్రం]] మీద నూతన దృష్టిసారించడానికి కారణం అయిన వ్యక్తి [[అమర్త్యసేన్|అమర్త్యసేన్‌]]. [[పశ్చిమ బెంగాల్‌]] రాష్ట్రంలోని శాంతినికేతన్‌లో పుట్టిన [[అమర్త్యసేన్|అమర్త్యసేన్‌]]కు పేరు పెట్టింది [[రవీంద్రనాథ్ టాగూర్|రవీంద్రనాథ్‌ టాగూర్‌]]. [[అమర్త్యసేన్|అమర్త్యసేన్‌]] ప్రపంచ [[ఆర్థిక శాస్త్రము|ఆర్థికశాస్త్రం]]లో దారిద్య్రం, కరువులకు అన్వ యించేటట్లుగా నైతిక, తాత్త్విక అసమానతలు వివరించాడు. ఆయన బహుముఖ ప్రజ్ఞకు [[1998]]లో ఆయనను [[ఆర్థిక శాస్త్రం]]లో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన నోబెల్‌ బహుమతి వరించింది. అదే సంవత్సరం భారతదేశపు అత్యంత ప్రతిష్ఠాత్మక ‘[[భారతరత్న]]’ బిరుదు ఇవ్వబడింది. ఇప్పటివరకు [[అర్థశాస్త్రం]]లో నోబెల్‌ బహుమతి పొందిన ఏకైక మేధావి.
 
"https://te.wikipedia.org/wiki/నోబెల్_బహుమతి" నుండి వెలికితీశారు