నోబెల్ బహుమతి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 54:
[[అర్థశాస్త్రం]]లో నోబెల్‌ బహుమతిని అందుకున్న వారిలో [[భారతదేశం]]లోనే కాదు, [[ఆసియా ఖండం]]లోనే ఏకైక వ్యక్తి ప్రొఫెసర్‌ [[అమర్త్యసేన్|అమర్త్యసేన్‌]]. మొత్తం ప్రపంచ దేశాలు, [[అర్థశాస్త్రం]] మీద నూతన దృష్టిసారించడానికి కారణం అయిన వ్యక్తి [[అమర్త్యసేన్|అమర్త్యసేన్‌]]. [[పశ్చిమ బెంగాల్‌]] రాష్ట్రంలోని శాంతినికేతన్‌లో పుట్టిన [[అమర్త్యసేన్|అమర్త్యసేన్‌]]కు పేరు పెట్టింది [[రవీంద్రనాథ్ టాగూర్|రవీంద్రనాథ్‌ టాగూర్‌]]. [[అమర్త్యసేన్|అమర్త్యసేన్‌]] ప్రపంచ [[ఆర్థిక శాస్త్రము|ఆర్థికశాస్త్రం]]లో దారిద్య్రం, కరువులకు అన్వ యించేటట్లుగా నైతిక, తాత్త్విక అసమానతలు వివరించాడు. ఆయన బహుముఖ ప్రజ్ఞకు [[1998]]లో ఆయనను [[ఆర్థిక శాస్త్రం]]లో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన నోబెల్‌ బహుమతి వరించింది. అదే సంవత్సరం భారతదేశపు అత్యంత ప్రతిష్ఠాత్మక ‘[[భారతరత్న]]’ బిరుదు ఇవ్వబడింది. ఇప్పటివరకు [[అర్థశాస్త్రం]]లో నోబెల్‌ బహుమతి పొందిన ఏకైక మేధావి.
 
==7. విద్యాధర్‌ సూరజ్‌ నయిపాల్‌, (Vidyadhar Suraj Naipaul) - (2001)==
 
[[విద్యాధర్ సూరజ్ ప్రసాద్ నైపాల్|విద్యాధర్‌ సూరజ్‌ నయిపాల్‌]] పూర్వీకుల రీత్యా భారత సంతతికి చెందినవాడు. ఆయన తాతలనాడే వెస్టిండీస్‌లోని [[ట్రినిడాడ్|ట్రినిడాడ్‌]] దీవికి వ్యవసాయక్షేత్రాలలో కూలీలుగా పనిచేయటానికి వెళ్ళారు. ఆయనకు [[బ్రిటన్‌|గ్రేట్‌ బ్రిటన్‌]] పౌరునిగా పరిగణనతో నోబెల్‌ బహుమతి ఇవ్వబడింది. కానీ, ఆయన పూర్వీకులు భారతీయ సంతతికి చెందిన వారు కావడం వలన మనం ప్రస్తావించడం జరుగుతుంది. మనోగోచారమైన, అర్థవంతమైన నిశితమైన పరిశీలనను తన రచనలలో ఏకం చేయ గలిగిన ప్రజ్ఞ, అణచివేయబడిన చరిత్రల ఉనికిని వాటితో ప్రతిఫలింపచేసినందుకు గాను [[సాహిత్యం]]లో వి.ఎస్‌.నయిపాల్‌కు నోబెల్‌ పురస్కారం లభ్యమైంది.
"https://te.wikipedia.org/wiki/నోబెల్_బహుమతి" నుండి వెలికితీశారు