"అనువాదం" కూర్పుల మధ్య తేడాలు

102 bytes added ,  3 సంవత్సరాల క్రితం
చి
సవరణ సారాంశం లేదు
చి
'''[[అనువాదం]]''' (Translation) ఒక [[భాష]] నుండి మరొక భాషలోని [[తర్జుమా]] చేయడం. దీనిని రెండు భాషలలోనూ ప్రావీణ్యం ఉండాలి. దీనికి [[నిఘంటువు]]లు బాగా ఉపకరిస్తాయి. ఇది [[సాహిత్యం]]లో ఒక భాషలో బహుళ ప్రసిద్ధిచెందిన రచనలను ఇతర భాషలలోకి అనువాదం చేయడం వలన మంచి రచనలు అందరికీ అందుబాటులోకి వస్తాయి.
==వేద వాక్య విభజన==
వైయాయికులు వేదవాక్యములను మూడు విధములుగ విభజించిరి. విధివాక్యము, అర్థవాదవాక్యము, అనువాద వాక్యములు.<ref>' విద్యర్థవాదానువాద వచనవినియోగాత్ ' - గౌతమ, 2. 1. 63</ref>. విధి యనగా విధాయక మని <ref>' విధిర్విధాయకః ' 2. 1. 64)</ref> గౌతమాచార్యులవారు న్యాయసూత్రములో జెప్పినారు. ఇట్లు చేయవలసినది యని యాజ్ఞాపించునది విధి. ' స్వారాజ్యకామో వాజపేయేన యజేత ' ( స్వర్గమును కోరువాడు వాజపేయ యఙమును జేయవలసినది ) అనునది విధివాక్యము. ఒకానొక కార్యమును[[కార్యము]]<nowiki/>ను స్తుతించి, లేక నిందించి, భయము కలిగించి, పూర్వచరిత వర్ణించి బోధించునట్టివాక్యము అర్థవాదవాక్య మనబడును. ' పాకకారీ పాపో భవతి ' ( పాపము చేయువాడు పాపుడైపోవును ) అనునది అర్థవాదము. ఇందు నాజ్ఞ స్పష్టముగా నుండదు. విధివాక్యముచే జెప్పబడినదానిని మరల జెప్పుట అనువాద మనబడును.
==అనువాద రకములు==
;అనువాదము రెండు విధములు:
దీనిమీద వాత్స్యాయను డిట్లు భాష్యము వ్రాసినాడు. " విహితమైన యథమును మరల నేల చెప్పవలె నన్న అధికారార్థము ( చెప్పబోవు విషయ మిది యని తెలియుటకు ), విహిత మైనదానిని నిందించుటకుగాని, స్తుతించుటకుగాని, విధి శేషముగ గాని చెప్పబడును. విహితార్థమునము దరువాత వచ్చినదికూడ ననువాదమగును...లోకమునందును అనువాదము కలదు. ' వండు వండు ' అని చెప్పుట కలదు. అందులకు ద్వరగ వండు మని కాని, దయచేసి వండు మని కాని (అధ్యేషణ ), తప్పక వండు మని కాని (అవధారణ) అర్థ మగుచున్నది ".
 
పైని వర్ణింపబడిన మూడువిధము లైన వాక్యములలో[[వాక్యము]]<nowiki/>లలో విధి వాక్యములే ప్రమాణములు గాని మిగిలిన రెండు విధము లైన వాక్యములును ప్రమాణములు కా వని కొందరు పూర్వపక్షము చేసెదరు.
 
==అనువాద ఎల్లలు==
అనువాదం ప్రస్తుతం బాగా పలుకుబడి పొందుతున్న ప్రక్రియ. ఇందులో ఎన్ని అవకాశాలున్నాయో అన్నీ ఎల్లలూ ఉన్నాయి.
 
అనువాదం కొత్త ప్రపంచానికి తెరవబడే సరికొత్త వాకిలి. అనువాదకు డికి కేవలం రెండు భాషల లిపులతో పరిచయమున్నంతమాత్రాన సరిపోదు. ఆయాభాషల వాడుకదారుల [[సాంస్కృతిక పునరుజ్జీవనం|సాంస్కృతిక]] జీవనంతో పరిచయముండాలి. అనువాదంలోని రకాల జోలికి వెళ్ళకుండా, అనువాదానికున్న ఎల్లల గురించి తెలుసుకోవడం ముఖ్యం. సాధారణంగా వివిధ భాషా, సంస్కృతుల ప్రజల జీవన విధానాన్ని వాటితో ఏ మాత్రం సబంధం లేని అంటే, ఏక దేశ లేదా ఏకీకృత సంస్కృతీ వివరాలు, ఆచార్య వ్యవహారాదుల్లో పూర్తిగా భిన్నమైనవి కాని భాషలమధ్య అనువాదం సులభమని. అయితే, పూర్తిగా వేరు పరిస్థితులుంటే అనువాదం కష్టమనీ, ఒక అభిప్రాయం ఉంది. అయితే, సోదర భాషలైన తెలుగు, తమిళ, మలయాళ, కన్నడాది భాషల్లో పరస్పర అనువాదంలోనూ చాలా కష్టాలున్నాయి. అందువల్లే అనువాదానికి ఎల్లలున్నాయని చెప్పవచ్చు.
== ఉదాహరణలు ==
* [[రవీంద్రనాథ్ ఠాగూర్]] బెంగాలీ భాషలో రచించిన [[గీతాంజలి]]
1,90,306

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2174495" నుండి వెలికితీశారు