జ్ఞానశ్రీమిత్ర: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
 
==తాత్విక చింతన==
[[జ్ఞానశ్రీమిత్ర]] జ్ఞానమీమాంస (epistemology) సాధనాల (ప్రమాణం) పై ప్రత్యేక కృషి చేసాడు. అందులోను దిజ్ఞాగునిచే వివరించబడిన అపోహ (exclusion) సిద్ధాంతం గురించి, అది తత్వశాస్త్రానికి ఏ విధంగా సంబందిస్తుందన్న విషయాలపై దృష్టి సారించాడు.
తన 'అపోహప్రకరణ' ("Monograph on Exclusion") గ్రంధంలో అపోహ సిద్ధాంతానికి జ్ఞానమీమాంసకు మధ్య గల సంబందాన్ని విశిదీకరించడంతో పాటు [[బౌద్ధ మతము|బౌద్ధ]] న్యాయంపై [[హిందూమతము|హిందూ]] న్యాయ విమర్శకుల దాడిని తిప్పికొడుతూ తన సిద్ధాంతాన్ని సమర్ధించుకొన్నాడు.<ref>McCrea; Patil, 2010, p. 20.</ref>
అదేవిధంగా జ్ఞానశ్రీమిత్ర యోగాచార సిద్ధాంతాన్ని సమర్ధించాడు. అతని దృష్టిలో ఈ సర్వ జగత్తు విజ్ఞానం (consciousness) తోనే నిండి వుంది.<ref>McCrea; Patil, 2010, p. 21.</ref> [[విజ్ఞానం]] లేదా [[చిత్తము|చిత్తం]] ఒక్కటే సత్యం.
 
వ్యాప్తికారిక అనే గ్రంధంలో పొగ మరియు అగ్ని వంటి విభిన్నమైన రెండు ఆస్తిత్వాల మధ్య గల తార్కిక సంబంధాలను ఇతను విశిదీకరించాడు. ఈ అంశంలో జ్ఞానశ్రీమిత్ర వైఖిరిని రచయిత హోస్ట్ లాసిక్ (Horst Lasic) వివరిస్తూ “జ్ఞానశ్రీమిత్రకు సంబంధించినంత వరకు, విభిన్న ఆస్తిత్వాల మధ్య గల అనుమాన-నిశ్చయ సంబందం 'కార్యాకారణ సంబందం' (effect-cause relation) అయివుండాలి మరియు అటువంటి సంబంధాలను కేవలం ఒక నిర్దిష్ట క్రమలో వచ్చే ప్రత్యక్షం (perception), అనుపలబ్ది (Non apprehension) ల ద్వారానే గుర్తించడం సాధ్యమవుతుంది." అని పేర్కొంటాడు."<ref>Horst Lasic, Review of: ''Parimal G. Patil; Jñānaśrīmitra's Vyāpticarcā: Sanskrittext, Übersetzung, Analyse''</ref>
"https://te.wikipedia.org/wiki/జ్ఞానశ్రీమిత్ర" నుండి వెలికితీశారు