"గిఫెన్ వస్తువులు" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
ఆర్థిక శాస్త్రములో '''గిఫెన్ వస్తువులు''' (Giffen good) అనగా తక్కువస్థాయి వస్తువులు. వీటి ధర పెరిగిననూ [[ఆదాయ ప్రభావం]] మరియు [[ధర ప్రభావం]] వల్ల కొనుగోలు కూడా పెరుగుతుంది. గిఫెన్ వస్తువులకు ఆధారము చూపడానికి పరిమిత అవకాశం ఉన్ననూ [[ఆర్థిక శాస్త్రము|ఆర్థిక]] నమూనా ప్రకారం ఇటువంటి వస్తువుల ఉనికి ఉందని చెప్పవచ్చు. రాబర్ట్ గిఫెన్ (Sir Robert Giffen) పేరు మీదుగా ఈ వస్తువులకు గిఫెన్ వస్తువులు అని పేరు పెట్టబడిననూ ప్రముఖ ఆర్థిక వేత్త [[ఆల్‌ఫ్రెడ్ మార్షల్]] యొక్క [[ప్రిన్సిపుల్ ఆఫ్ ఎకనామిక్స్]] గ్రంథంలో గిఫెన్ గురించి పేర్కొనినందుకే ఈ పదం ప్రసిద్ధిచెందింది.
 
అన్ని వస్తు ఉత్పత్తులకు [[ధర డిమాండ్ వ్యాకోచత్వం]] రుణాత్మకంగా ఉంటుంది. అనగా ధరకు మరియు డిమాండుకు విలోమనిష్పత్తి ఉటుంది. ధర పెరిగితే డిమాండు తగ్గడం, ధర తగ్గితే డిమాండు పెర్గడం జర్గుతుంది. గిఫెన్ వస్తువులు దీనికి మినహాయింపు. ఈ వస్తువులకు ధర డిమాండు వ్యాకోచత్వం ఒకటి కంటే ఎక్కువ. ధర పెరిగిననూ ఈ వస్తువుల డిమాండు కూడా పెరుగుతుంది మరియు ధర తగ్గితే డిమాండు కూడా తగ్గుతుంది. నిజమైన గిఫెన్ వస్తువులకు డిమాండు పరిమాణంలో మార్పులు రావడానికి ధర ఒక్కటే ఏకైక కారణం. [[వెబ్లెన్ వస్తువులు|వెబ్లెన్ వస్తువుల]]వలె వినియోగంతో సంబంధం ఉండదు.
 
ఆర్థికవేత్త ఆల్ఫ్రెడ్ మార్షల్ ఇచ్చిన సామ్ప్రదాయిక ఉదాహరన ప్రకారం చెప్పాలంటే ఈ వస్తువులకు డిమాండ్ పేదరికం వల్ల ఏర్పడుతుమ్ది. ధరలు పెరగడంతో పేదవారు ఎక్కువ నాణ్యత గల వస్తువులను కొనుగోలు శక్తి ఉండదు కాబట్టి ఆ వస్తువుల వాడకాన్ని తగ్గించి తక్కువస్థాయి వస్తువులనే అధికంగా కొనుగోలు చేస్తారు. కాబట్టి ధర పెర్గినప్పుడు ఈ వస్తువుల డిమాండ్ పెర్గుతుంది.
 
[[1895]]లో ఆల్ఫ్రెడ్ మార్షల్ రచించిన "ప్రిన్సిపుల్స్ ఆఫ్ ఎకనామిక్స్" గ్రంథంలో ఈ విధంగా తెలిపినాడు -
:: గిఫెన్ తెలిపినట్లు
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/217640" నుండి వెలికితీశారు