విజయలక్ష్మి పండిట్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 44:
మోతీలాల్ నెహ్రూ దంపతులకు విజయలక్ష్మీ పండిత్ క్రీ.శ. [[1900]] సం. [[ఆగష్టు 18]] వ తేదీన జన్మించారు. [[జవహర్‍లాల్ నెహ్రూ]] ఈమె సోదరుడు. [[నెహ్రూ]] కన్నా పండిట్ పదకొండు సంవత్సరాలు చిన్నది.
 
జవహర్‍లాల్ నెహ్రూ, విజయలాక్ష్మీ పండిట్ ల తల్లి స్వరూపరాణి నెహ్రూ. చిన్నతనంలో విజయలక్ష్మీ పండిట్ స్వరూపకుమారిగా పిలువబదుతుండేది. జవహర్‍ నెహ్రూ తండ్రి [[మోతీలాల్ నెహ్రూ]] వకీలుగా మంచి పేరు ప్రఖ్యాతులతో పాటు బాగా ధనం కూడా సంపాదించిన వ్యక్తి. మోతీలాల్ కుటుంబం చాలా సంపన్న మైన కుటుంబం కావటంతో అందమైన, అధునాతనమైన భవనంలో నివసించేవారు. ఈ భవనమే ([[ఆనంద భవన్]]) గా పిలువబడేది. భవనానికి తగిన తోట, టెన్నీసు కోర్టు, చుట్టూ చిన్నచిన్న ఔట్ హౌస్ లు, ఈదేందుకు స్విమ్మింగ్ పూల్ మొదలైన నాగరిక యేర్పాట్లతో దాస దాసీ జనాలతో మహారాజ కుటుంబంలాగా ఉండేది. వీరి కుటుంబం ఆనంద భవన్ [[అలహా బాద్అలహాబాద్]] లో ఉండేది.
 
మోతీలాల్ ను చిన్నతనం నుంచీ, విదేశీ నాగరికత, వారి ఆచార వ్యవహారాలంటే మక్కువ. ఇంట్లో పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పేందుకు, వారిని సక్రమంగా పెంచేందుకు ఆంగ్లేయ వనితలే ఉండేవారు. అందువల్లనే మోతీలాల్ పిల్లలైన జవహర్ లాల్, విజయలక్ష్మీ పండిత్ ఆమె సోదరి కృష్ణలను కూడా చిన్నతనం నుంచీ పాశ్చాత్యుల నాగరికత అలవాటై పోయింది.
"https://te.wikipedia.org/wiki/విజయలక్ష్మి_పండిట్" నుండి వెలికితీశారు