అరబిందో: కూర్పుల మధ్య తేడాలు

చి →‎బాల్యము: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: విభేధా → విభేదా using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 80:
}}
 
'''అరబిందో''' ([[ఆగస్టు 15]], [[1872]]–[[డిసెంబరు 5]], [[1950]]) సుప్రసిద్ధ బెంగాలీ పండితుడు, [[కవి]], జాతీయ వాది, [[యోగి]], మరియు [[గురువు]].
==బాల్యము==
అరబిందో [[ఆగస్టు 15]], [[1872]] న [[కోల్‌కతా]]లో జన్మించాడు. ఈయన పూర్తి పేరు అరబిందో ఘోష్. అరవింద అనగా బెంగాలీలో పద్మము అని అర్థం. తల్లి స్వర్ణ లతా దేవి. తండ్రి కె.డి.ఘోష్. వైద్యుడు. ఈయన బ్రిటన్ లో ఉండి అబెర్దీన్ విశ్వ విద్యాలయంలో వైద్య విద్య నభ్యసించాడు. అరవిందుల మాతామహులు సుప్రసిద్ధ బ్రహ్మ సామాజికులయిన రాజనారాయణబోసు. వీరు సంస్కృతాంగ్ల భాషలలో మహావిద్వాంసులు. వీరు కుమార్తె శ్రీమతి స్వర్ణలతాదేవి అరవిందుల జనని. అరవిందుల జనకులు కృష్ణధనఘోష్. వీరు పూర్వులు బ్రహ్మ సమాజ విరోధులైనా వీరు మాత్రం బ్రహ్మసమాజంపట్ల అభిమానం చూపిస్తూ ఉండేవారట. కనుకనే వీరు బ్రహ్మసమాజ కన్యను వివాహం చేసుకున్నారు. ఈ వివాహానైకి మహర్షి దేవేంద్రనాధ్ ఠాకూర్ స్వయంగా పౌరోహిత్యం జరిపారట. వీరిద్దరికి 4 కుమారులు, ఒక కుమార్తె. వీరిలో మొదటి కుమారుని పేరు వినయభూషణుడు, రెండవవాడు మనోమోహనుడు, మూడవవాడు అరవిందులు, నాలగవ సరోజినిదేవి, చివరి వారు వారీంద్రుడు. ఈతడు వంగదేశంలో ప్రఖ్యాత విప్లవకారుడు. సరోజినీదేవి ఆజన్మ బ్రహ్మ చారిణి అయి ఆధ్యాత్మిక అన్వేషణా పరురాలుగా పేరుగాంచింది.
పంక్తి 86:
కృష్ణధనఘోషుకు ఆంగ్లవిద్యమీద అభిమానం ఎక్కువ. అందుచేత బాగా చిన్నతనంలో అరవిందుని డార్జిలింగు పంపించి అక్కడ సయింట్ పాల్ స్కూల్ లో చదివించారు. అయినా తృప్తి చెందక [[ఇంగ్లండు]] వెళ్ళినారు. అక్కడే వీరి చిన్న కుమారుడు వారేంద్రుడు జన్మించారు. కాని అక్కడ వీరు కుమార్తె సరోజినీదేవి ఉన్మాదవ్యాధితో బాధపడుతుండడం వల్ల అక్కడనుండి భారతదేశం తిరిగి వచ్చేరు. అరవిందులు 7 ఏండ్లు ఇంగ్లాండులో తరువాత 5 ఏండ్లు మాంచెశ్తరులో చదువుకున్నారు.ఈయన తన 18వ ఏటనే ఇ.పి.యస్ పరీక్షకు హాజరై గ్రీక్, లాటిన్ భాషలలో అత్యుత్తమ తరగతిలో ఉత్తీర్ణులయినారు.
 
కళాశాలాచార్య పదవి విడిచిన తరువాత అరవిందులు [[వందేమాతరం]] పత్రికాసంపాదకత్వం స్వీకరించారు. అంతకుపూర్వం వారపత్రికగా ప్రచురింపబడుతున్న ఈ ఆంగ్లపత్రిక అరవిందుల సంపాదకత్వంలో దినపత్రిక అయింది. ఈపత్రికమూలంగా జాతీయతత్వం వంగదేశాన్ని ఉర్రూతలూగించింది. క్రమంగా వీరి జాతీయ సందేశం భారతదేశం అంతటా అల్లుకోవడం మొదలుపెట్టింది. ఈసమయంలో ఆంగ్లప్రభుత్వం వీరిని రాజద్రోహ నేరంమీద శిక్షించాలని ప్రయత్నించింది. కాని నేరం ఋజువు కాకపోవడంవల్ల ప్రభుత్వం వీరిని ఏమీచెయ్యలేకపోయింది. అరవిందులీ సమయంలోనే 1907 డిసెంబరులో జరిగిన సూరత్కాంగ్రేస్ జాతీయపక్షనేతలుగా హాజరైనారు. అక్కడ మితవాదులకు జాతీయపక్ష నాయకులైన అరవింద ప్రభృత్యులకు మధ్య తీవ్ర విభేదాలు బయలుదేరాయి. జాతీయపక్షనేతలందరు అరవిందుల నాయకత్వంతో వేరుగా ఒక సమావేశం జరిపి దేశాభివృద్ధికరమైన మార్గం ఆదేశించారు. అటుతరువాత వీరిపై అల్లీపూరు బాంబుకేసు నడిచింది. అరవిందుల కనిష్ఠసోదరుడు వారీంద్రుడు విప్లవకారుడు కావడం వలన వీరిపై ప్రభుత్వం అపోహలు మోపారు. దీనిమూలంగా అరవిందులు జైలులో పలు కష్టాలు అనుభవించారు. ఈ ఆలీపూరు కేసులో [[చిత్తరంజనుచిత్తరంజన్ దాసుదాస్]] వీరికి న్యాయవాదిగా[[న్యాయవాది]]<nowiki/>గా పనిచేసారు.
 
==జీవిత విషయాలు==
పంక్తి 104:
అరవిందుల దర్శనంలో మాయా ప్రమేయమే లేదు. అద్వైతవాదంలో బ్రహ్మపై జగత్తు అధ్యాసితమై వివర్తంగా భాసిస్తుంది. అరవిందులు అద్వైతులు ప్రతిపాదించే నిర్గుణ పరబ్రహ్మ అధ్యాత్మికాన్వేషకుని సాధనలో ఒకమెట్టు మాత్రమే అనీ, దీనికి పైన అతిమానసిక భూమికలు క్రమక్రమంగా అనేకం ఉన్నాయని, అన్నింటికి పైన విజ్ఞాన భూమిక (Supra mental Plane) ఉన్నదనీ చెబుతున్నారు. ఆ భూమికల కన్నింటికీ దిగువ సకోఅనాలిసిస్ చెప్పే (Sub conscious) అవ్యక్త మనస్సు కూడా ఉన్నదని అంగీకరిస్తారు. ఈ రెండు భూమికలకు మధ్యన ఇంకా అనేకమైన భూమికలున్నవని ప్రతిపాదించి అరవిందులు ఆయన భూమికల గురించి సవిస్తరంగా వ్యాఖ్యానించారు. అయితే ఈ భూమికలన్నిటిలోను దివ్య చైతన్యం అంతర్గతమై ఉన్నదని, క్రమంగా ఊర్ధ్వంగా అధిరోహించినకొలది ఈ చైతన్యం స్వయంప్రకాశమాన మవుతున్నదని అరవిందుల అభిప్రాయము.
 
అరవ నవంబరు 24 న తన వద్దనున్నశిష్యులతొనిన్నటి దినముకృష్ణచైతన్యము తిరిగిభూమి ంమీద ొఅవతరించిందిఅనిబొధించిఅప్పతి ునుండిొఅవతరించిందిఅనిబొధించిఅప్పటినుండి ్మరనము వచువరకుమౌనంగనెఉండిపొయరు.ైన విషయం ఉంది. ఇంతవరకు ప్రపంచంలో పదార్ధము (Matter), ప్రాణశక్తి (Vital Force), మనస్సులు (Mind) మాత్రమే ఆవర్భవించాయని వీటితో ఆధ్యాత్మిక పరిణామం నిలిచిపోలేదని క్రమంగా మనస్సుకు పైబడిన ఉన్నత భూమికలు కూడా పృధ్వి పై అవతరించగలవని ఇదే ఆధ్యాత్మిక పరిణామంలో అంతర్ధానమని అరవిందులు ప్రవచించారు.
 
అరవిందులు తమ సిద్ధాంతాలన్నీ '''దివ్యజీవనము''' (Life Divine) అనే తాత్విక గ్రంథంలో వివరించారు.వీరురచించిన గీతవ్యాసాలు (Essays on Gita) కూడా పలుప్రాచుర్యం పొందిన [[గ్రంథము]]. వీరు వ్రాసిన కవితలు Mystic Poetry, Love and Death, Six Poems Savitri చదవవలసినవి మరియు పేరుగాంచినవి.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/అరబిందో" నుండి వెలికితీశారు