దాగుడు మూతలు (1964 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 32:
== పాటలు ==
ఆచార్య ఆత్రేయ, దాశరథి, ఆరుద్ర రాసిన రసవత్తర గీతాలకు తేనెలూరు మట్లు కట్టి, సాహిత్య సమలంకృతం చేసిన ఘనత కె.వి. మహదేవన్ ది. ఈ సినిమాలో ఒక్కో పాట ఒక్కో ఆణిముత్యం. ''గోరొంక గూటికే చేరావు చిలకా'', ''గోరొంక కెందుకో కొండంత అలక'' అనే రెండు పాటలూ దాశరథి రాసినవే. ఇష్టంలేని పెళ్ళి తప్పించడానికి ఇంట్లోంచి పారిపోయి ఎన్టీఆర్ గూటిలోకి చేరిన సరోజాదేవి ఆసరాకి భరోసా ఇస్తూ ఘంటసాల పాడేది మొదటి పాట కాగా, సరోజాదేవి మీద అలకబూని బెట్టుచేసే ఎన్టీఆర్ ని మచ్చికచేసుకోనే సందర్భంగా వచ్చేది సుశీల పాడిన రెండో పాట. ఈ రెండు పాటలూ శంకరాభరణం రాగంలోనే వున్నా, వాటి టెంపో మాత్రం భిన్నంగా వుంటుంది. ''గోరొంక గూటికే చేరావు చిలకా'' పాట టెంపో స్లోగా వుంటుంది. రాత్రివేళ సరోజాదేవికి భద్రతపై అభయమిస్తూ పాడే పాట కావడంతో మహదేవన్ ఈ పాటను స్లో టెంపోలో స్వరపరిచారు. ''గోరొంక గూటికే చేరావు చిలకా'' అన్నప్పుడు పంజరంలోకి చిలకను పంపటం, ''భయమెందుకే నీకు బంగారు మొలక'' అన్నప్పుడు ఆ పంజరం తలుపు మూయటం ఆదుర్తి చూపిన గొప్ప సింబాలిజం. రాత్రివేళ పాట కావడంతో ఎన్టీఆర్ ని కేవలం బనియను, తువ్వాలు మీద చూపడం ఆదుర్తి నేటివిటీకి ఎంత విలువ ఇస్తారో తెలుస్తుంది. ''నిలవలేని కళ్ళు నిదరపొమ్మన్నాయి'' చరణంలో సరోజాదేవి హావభావాలు వర్ణించనలవికాదు. అలాగే సరోజాదేవి పాడే పాటలో టెంపో వేగం పుంజుకుంటుంది. ''మాటేమో పొమ్మంది - మనసేమో రమ్మంది. మాటకు మనసుకు మధ్యన తగువుందీ'' ప్రయోగం అద్భుతమైతే, మరి సరోజాదేవి హావభావాలు మహాద్భుతంగా వుంటాయి. ఈ పాటలో సరోజాదేవికి బాల నటీమణులు బేబి, సుమ, లత, తార, అవంతి సహకరించారు. తెరమీద ముద్దులపై ప్రభుత్వం నిషేధం విధించిన సందర్భంగా, ముద్దులంటే కేవలం లిప్-లాకే కాదు, మనం చూసే ప్రకృతిలో, ప్రవృత్తిలో అడుగడుగునా ముద్దులు మురిపిస్తాయని చెప్తూ ఆచార్య ఆత్రేయ రాసిన ముద్దుపాట ఆ రోజుల్లో విశేషంగా ఆకట్టుకుంది. నటభైరవి రాగంలో రూపుదిద్దుకున్న ఈ పాట చివరిదాకా సరోజాదేవి ఇచ్చే లిప్ మోవ్మెంట్ ఎంత ముద్దుగా వుంటుందో చెప్పలేం. వాహినీ గార్డెన్లో చిత్రీకరించిన ఈ పాట చరణం చివర్లో ''నువ్వు నేనూ ముద్దుకు ముద్దు'' అని ఆత్రేయ రాస్తే, సెన్సారు అధికారులు ఆ ప్రయోగానికి అభ్యంతరం చెప్పి తొలగించమన్నారు. అప్పటికే పాట చిత్రీకరణ పూర్తికావడంచేత ''ముద్దుకు ముద్దు'' అనే పదాల స్థానంలో ''వూహుహు వూహు'' అని చేర్చి రీ-రికార్డింగు చేసారు. నిశితంగా పరీక్షిస్తే ఎన్టీఆర్, సరోజాదేవిల లిప్ మూవ్మెంట్ 'ముద్దుకు ముద్దు'గానే కనిపిస్తుంది. ''విరిసి విరియని పువ్వే ముద్దు'' అన్నప్పుడు ఎన్టీఆర్ చేతిలో అరవిరిసినపూల రెమ్మ వుండటం. ''నడకలలో నాట్యంచేసే నడుము చూస్తే పిడికెడు ముద్దు'' అనే ప్రయోగం వచ్చినప్పుడు సరోజాదేవి వెనక్కి నడవటం మనం గమనిస్తాం. ఆ నడకలో హొయల బ్యాక్ ప్రొజెక్షన్లో చిత్రీకరించడం ఆదుర్తి ప్రతిభకు గీటురాయి. ''పచ్చనిచేలే కంటికి ముద్దు'' అన్నప్పుడు ఎన్టీఆర్ పాలకంకి చేతిలో వూపటం కూడా పాట చిత్రీకరణలో ఆదుర్తి ఎంతశ్రద్ధ కనపరుస్తారో తెలియజేస్తుంది. ఇక ''చకచకలాడే పిరుదులు దాటే జడను చూస్తే చలాకి ముద్దు'' అనే చరణంలో సరోజాదేవి జడను ముందుకు వేసుకుంటూ నడుస్తుంటుందే కానీ, పిరుదల చకచకలు మాత్రం కనిపించనీయదు. ''ఏదైనా గుప్పెట్లో ఉంటేనే అందం'' అనే విషయాన్ని ఆదుర్తి తెలివిగా, విశేషణ పూర్వకంగా చూపించారు. ''అందలం ఎక్కాడమ్మా - అందకుండా పోయాడమ్మా'' పాట ఆత్రేయ రచన. ఈ పాటను గుమ్మడి ఎన్టీఆర్ తన మనవడని తెలుసుకున్న సందర్భంగా వచ్చే వేడుకలో సరోజాదేవి చేసే స్టేజ్ డ్యాన్స్ సీక్వెన్స్‌గా మలిచారు. పాటలో రెండో చరణం వచ్చేసరికి ఎన్టీఆర్ సరోజాదేవితో గళం కలుపుతాడు. ''ఎంతవాణ్ణి ఎంతైనా నే నీలో ఇమిడిపోతానమ్మా'' అనడంలో, కాఫీ హోటలు నడిపే ఎన్టీఆర్ ఒక్కసారి జమీందారు అయిపోతే తనని మరచిపోతాడేమోనని సంశయించే సరోజాదేవికి అభయం ఇవ్వడమే ఉద్దేశం. ఈ పాటతోబాటు ''యెంకొచ్చిందోయ్ మావ ఎదురొచ్చిందోయ్'' అనే ఆరుద్ర పాటలో సరోజాదేవి ఆహార్యం నండూరివారి ఎంకిని గుర్తుకు తెస్తుంది. ''మెల్లమెల్లమెల్లగా- ఆనువణువూ నీదెగా'' అనే టైటిట్ సాంగ్ వెస్ట్రన్ బీట్ తో యెంతో హృద్యంగా సాగుతుంది. ''నీదికానిదేది లేదు నాలో - నిజానికి నేనున్నది నీలో - ఒక్కటే మనసున్నది ఇద్దరిలో, ఆ ఒక్కటీ చిక్కె నీ గుప్పిటిలో'' అనే ఆత్రేయ ప్రయోగం ఇంకెవ్వరూ చెయ్యలేనిది. ''నేనున్నది నీలో'' అన్నప్పుడు ఇద్దరినీ నీటినీడలో పరోక్షంగా చూపించడం ఆదుర్తి ప్రతిభకు మచ్చుతునక. ఈ పాటలో ఎన్టీఆర్ పిల్లిగంతులేస్తూ యెంతో హుందాగా నటించారు. విగ్గులేని ఎన్టీఆర్ తలకట్టు ఈ సినిమాలో ఎంతో బాగుంటుంది. శంకరాభరణ రాగంలోనే స్వరపరచిన మరో ఆత్రేయ గీతం ''దేవుడనేవాడున్నాడా అని మనిషికి కలిగెను సందేహం'' విషాద సన్నివేశపు పాట. ఎన్టీఆర్ పాడే పల్లవి, చరణాలు నైట్ లైట్ డార్క్ షేడ్‌లో, ఇండోర్లో చిత్రీకరిస్తే, సరోజాదేవి పాడే చరణాలను మూన్ లైట్ బ్యాక్ డ్పాప్‌లో, పూదోటలో చిత్రీకరించారు. అలతి పదాలతో అనంతార్థాన్ని చెప్పగల ప్రజ్ఞావంతుడు ఆత్రేయ. ''తాము నవ్వుతూ నవ్విస్తారు కొందరు అందరినీ: తామేడుస్తూ ఏడ్పించుతారెందరో కొందరినీ: నేను నవ్వితే ఈలోకం చూడలేక ఏడ్చింది: నేనేడిస్తే ఈలోకం చూసి చూసి నవ్వింది'' వంటి లోతైన భావాలు స్పురించే పాటలు ఆత్రేయ కాక మరెవ్వరు రాయగలరు? ఎన్టీఆర్, ఆదుర్తిల కలయికతో వచ్చిన దాగుడుమూతలు సినిమా నూరురోజుల పండగ జరుపుకుంది. వీరిద్దరి కాంబినేషన్ లో తరవాత సంవత్సరంలో వచ్చిన 'తోడూ-నీడా' సినిమాకూడా శతదినోత్సవం చేసుకొంది. తదనంతర కాలంలో డి.బి.నారాయణ 'ప్రైవేట్ మాష్టారు', 'అన్నదమ్ములు', 'అబ్బాయిగారు-అమ్మాయిగారు' వంటి కొన్ని నిర్మించినా 70వ దశకం తొలి రోజుల్లోనే చిత్ర నిర్మాణం నుంచి తప్పుకున్నారు.
 
{| class="wikitable"
|-
Line 78 ⟶ 79:
|[[కె.వి.మహదేవన్]]
|[[పిఠాపురం నాగేశ్వరరావు|పిఠాపురం]], [[స్వర్ణలత (పాత)|స్వర్ణలత]]
|}
 
== మూలాలు ==