ఉమర్ ఆలీషా: కూర్పుల మధ్య తేడాలు

చి →‎జీవిత విశేషాలు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఆగష్టు 9, 2005 → 2005 ఆగష్టు 9, ఆగష్టు → ఆగస్ట using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''[[ఉమర్ ఆలీ షా]]''' (1885 - 1945) సూఫీ వేదాంత వేత్త, [[తెలుగు]] సాహితీ వేత్త, సంఘ సంస్కర్త, గ్రాంధికవాది. కవిరాజు డాక్టర్‌ ఉమర్‌ అలీషా మాతృభాష [[తెలుగు]] కాదు. తెలుగులో అద్భుత సాహిత్య సంపదలను సృష్టించి మహాకవిగా ఆయన ఖ్యాతిగాంచారు. ఆయన ఆధ్యాత్మిక పీఠాధిపతి అయినప్పటికీ కేవలం ఆధ్యాత్మిక తత్వానికే కట్టుబడకుండా సామాజానికి రుగ్మతల విూద కలాన్ని కొరడాలా ఝళిపించారు. స్వాతంత్య్ర సమరయోధునిగా [[జాతీయోద్యమం]]లో పాల్గొన్నారు. భారత శాసనసభలో ప్రజాప్రతినిధిగా బాధ్యతలు నిర్వహించారు. అభ్యుదయ రచయితగా, ప్రగతి నిర్దేశకునిగా, మహోన్నత వక్తగా, మానవతావాద ప్రవక్తగా బహుముఖ ప్రజ్ఞావంతుడిగా ఖ్యాతి గడించారు. అజ్ఞానం, [[మూఢ నమ్మకాలు|మూఢనమ్మకాలు]], మత మౌడ్యం, పేదరికం, బానిసత్వం, అవిద్య లాంటి సాంఘిక రుగ్మతలతో కొట్టుమిట్టాడుతున్న సమాజాన్ని సంస్కరించేందుకు అనన్యసామాన్యమైన కృషి సాగించి ధన్యులైన [[తెలుగు]] గడ్డకు చెందిన [[కవులు]], రచయితలలో ఉమర్‌ అలీషా గారిది ప్రత్యేక స్థానం. బహుముఖ లక్ష్య సాధన కోసం శరపరంపరగా సాహిత్య సంపద సృష్టించి తెలుగు సాహిత్య చరిత్ర పుటలలో ప్రత్యేక స్థానం పొందిన తెలుగు గడ్డకు చెందిన ముస్లిం కవులలో ఆచార్య ఉమర్‌ అలీషా అగ్రగణ్యులు.మౌల్వీ ఉమర్‌ అలీషా పూర్వీకులు శతాబ్దాల క్రితం [[పర్షియా]] (ఇరాన్‌) నుండి [[ఢిల్లీ]] వచ్చి, అటునుండి [[హైదరాబాదు‌హైదరాబాదు|హైదరాబాద్]] చేరి, చివరకు [[పిఠాపురం]]లో స్థిరపడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా ఉమర్‌ అలీషా ఈ పద్యంలో వివరించారు.
<poem>
... ... ... మహా ప్రభాత
పంక్తి 7:
</poem>
==జీవిత విశేషాలు==
ఉమర్‌ అలీషా పూర్వీకులంతా, వేదాంత పండితులుగా, తత్త్వవేత్తలుగా, కవులుగా[[కవులు]]<nowiki/>గా, గురువులుగా సుప్రసిద్ధులు. గురు-శిష్య సాంప్రదాయ అనురక్తులైన ఉమర్‌ అలీషా పూర్వీకులు, అధ్యాత్మిక జ్ఞాన ప్రచారం కోసం 1472లో "శ్రీ విజ్ఞాన విద్యాథ్యాత్మిక పీఠం" స్థాపించారు. ఈ పీఠం ద్వారా ధార్మిక విజ్ఞాన ప్రచారం గావిస్తూ, అధ్యాత్మిక సేవకు తమ జీవితాలను అంకితం చేసారు. మౌల్వీ మొహిద్దీన్‌ బాద్షాకు అగ్రనందనుడుగా ఉమర్‌ అలీషా [[1885]] [[ఫిబ్రవరి 28]]న, [[తూర్పుగోదావరి జిల్లా]] [[పిఠాపురం]]లో జన్మించారు. తల్లి పేరు చాంద్‌బీబి. [[సాహిత్య]], [[సారస్వత]], [[ధార్మిక]] సేవా కార్యక్రమాలలో [[తల్లితండ్రులు]] నిమగ్నమైయున్న ప్రత్యేక [[వాతావరణం]] నడుమ జన్మించిన ఉమర్‌ అలీషా, పూర్వీకుల శక్తి సామర్థ్యాలను, ప్రజ్ఞాపాటవాలను చిన్ననాటనే సంతరించుకున్నారు. ఎనిమిదవ ఏటనే అశువుగా [[కవిత్వం]] చెప్పి పండితులను, గురువులను ఆశ్చర్యచకితులను చేశారు. [[పిఠాపురం]]లోని ఉన్నత పాఠశాలలో విద్యాభ్యాసం చేసిన తరువాత ప్రముఖ సంస్కృతాంధ్ర భాషా పండితుల వద్ద ఆయన శిష్యరికం చేసారు. తండ్రి వెంట ఉంటూ అరబ్బీ, పర్షియన్‌, ఉర్దూ భాషలను నేర్చుకున్నారు. చిన్నతనంలో పలు భాషలతో పరిచయం సంపాదించిన ఉమర్‌ అలీషా 14 సంవత్సరాల వయస్సులో చంధోబద్ధంగా చక్కని తెలుగులో పద్యాలు రాయటం, ధారాళంగా కవిత్వం చెప్పటం ప్రారంభించి, తమ వంశ గురువైన శ్రీ అఖైలలీషాను స్తుతిస్తూ, '' బ్రహ్మవిద్యా విలాసం '' అను శతకాన్ని రచించారు. నూనూగు మీసాల ప్రాయంలోనే ఆయన ప్రజల చేత '' కవిగారు '' అని పిలిపించుకున్నారు.
చిన్నతనంలోనే మంచి విద్వత్తును సాధించిన ఆయన పద్యాలను ధారాళంగా అల్లగల నేర్పు సునాయాసంగా అబ్బటంతో 18వ ఏటనే నాటకాలు రాయటం ఆరంభించాడు. 1905 ప్రాంతంలో గద్య, పద్యాత్మకమైన '' మణిమాల '' నాటకాన్ని రాసారు. ఈ నాటకానికి ముందుగానే ఆయన మరో రెండు నాటకాలను రాసారు. ఈ నాటక రచనతో ఆయన పాండితీ ప్రతిభ నలుదిశలా వ్యాపించింది. ప్రముఖ ఆంగ్ల రచయిత [[షేక్స్‌స్పియర్‌]] నాటకాల స్థాయిలో [[మణిమాల]] నాటకం సాగిందని ఆనాడు పండిత ప్రముఖులు అభినందించగా, పత్రికలు బహుదా ప్రశంసించాయట.
 
ఉమర్‌ అలీషా విద్యాభ్యాసం ఉన్నత పాఠశాలతో[[పాఠశాల]]<nowiki/>తో ముగిసింది. '' డిగ్రీల చదువు '' విూద ఆయన దృష్టి సారించలేదు. ఆనాటి పండితులు సృజియించిన అపార సాహిత్య సంపద ఆయనకు ఉపాధ్యాయ వర్గమైంది. తండ్రి ఆయన మార్గదర్శకులయ్యారు. తాతలు-తండ్రులు సృష్టించిన సాహిత్యం ఆయనకు పాఠ్యగ్రంథాలయ్యాయి. ఆ గ్రంథాలు మాత్రమేకాకుండా ప్రపంచ భాషలలోని పలు అధ్యాత్మిక, సాహిత్య గ్రంథాలను అథ్యయనం చేశారు. సాహిత్య ప్రక్రియాల విూద గట్టిపట్టు సంపాదించారు.
 
పండితుడిగా ప్రసిద్ధి చెందిన ఉమర్‌ అలీషా సరే అంటే చాలు తమ సంస్థానాలలో ఉన్నత ఉద్యోగాలను కల్పించగలమని పలుప్రాంతాల సంస్థానాల నుండి ఆహ్వానాలు వచ్చినా ఆయన కాదన్నారు. ధనార్జన విూద ఏమాత్రం ఆసక్తిలేని ఉమర్‌ అలీషా తన గడప తొక్కిన ఆహ్వానాలను తిరస్కరించారు. [[భాషా శాస్త్రం|భాషా]] సేవ, సారస్వత సేవ, [[వేదాంతము|వేదాంత]] సేవలో గడపాలని, సమాజ సేవ చేయాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఆ దిశగా ఉపక్రమించిన ఉమర్‌ అలీషా అతికొద్ది కాలంలోనే, అసమాన ప్రతిభను చూపుతూ పలు సాహితీ ప్రక్రియలలో అపూర్వమైన సారస్వత సంపదను సృష్టించారు.
ఈ విషయాలను ఆయన స్వయంగా ఒక పద్యంలో సృష్టీకరించారు.
 
పంక్తి 33:
ఉమర్‌ అలీషా ఏ సాహితీ ప్రక్రియలో ఎటువంటి రచన చేసినా, ఆ రచనలతో అటు పండితుల ప్రశంసలతోపాటుగా ఇటు ప్రజల అభిమానాన్ని మెండుగా అందుకున్నారు. ఆయన అందించిన ప్రతి రచన ద్వారా ఏదోక సామాజిక-ఆధ్యాత్మిక ప్రయోజనాన్ని ఆశించి, ఆ లక్ష్యసాధనా దృష్టితో, ఆ దిశగా సాగింది. జాతీయ భావం, సమానత్వం, సర్వమానవ సౌభ్రాతృత్వం, సర్వమత సమభావనలతో పాటుగా సామాజిక రుగ్మతలకు వ్యతిరేకంగా, మహిళాభ్యుదయాన్ని, ప్రజా చైతన్యాన్ని కాంక్షిస్తూ ఆయన రచనలు చేసారు.
==సంఘ సంస్కర్తగా...==
[[బాల్యవివాహాలు|బాల్య వివాహాలు]], [[సతీసహగమనం|సతీ సహగమనం]], [[కన్యాశుల్కం]], [[వరకట్నం]] లాంటి దురాచారాలను తునుమాడాలన్నారు. స్త్రీ విద్యను ప్రోత్సహించారు. స్త్రీ విద్యకోసం, స్త్రీ గౌరవం కోసం [[స్త్రీలు]] స్వయంగా పాటుపడాలని తన గ్రంథాలలోని పాత్రల చేత, తన అభిమతాన్ని చాలా బలంగా చెప్పించారు. ప్రధానంగా ఆయన ప్రతి రచనలో స్త్రీ పక్షపాత వైఖరి కన్పిస్తుంది. సమాజంలో ఆయన ఆశించిన మార్పులను తన రచనలలోని పాత్రల ద్వారా చాలాబాగా వ్యక్తం చేశారు. ఆయన రాసిన '' కళ '' అను నాటకంలో కుటుంబ జీవితంలో మహిళలు ఎదుర్కొంటున్న కష్టాలను-నష్టాలను వివరంగా పేర్కొన్నారు. గృహ బాధ్యతలను మోసే ఇల్లాలి కంటే మంచి నెచ్చలి ఎవరుంటారంటూ, భార్యను స్నేహితురాలిగా గౌరవించాలని పురుషులను ఆదేశించారు. ''ఈశ్వర తత్త్వము నామె హృదయంతరబునన్‌ పరిణితమైన ప్రేమయును పాఠము లోపల చేర్చుకొమ్ము! గురువునేల కొల్పెదవు!'' అంటారు. భార్య నుండి ప్రేమ తత్వమును, ఈశ్వర తత్త్వమును నేర్చుకో, భార్య కంటే గురువు మరెవ్వరూ లభించరని హితవు పురుషులకు హితవు చెబుతారు. స్త్రీ స్వాతంత్య్రం గురించి మాట్లాతూ, లింగభేదంతో పని లేకుండా అర్హతలు, యోగ్యతను బట్టి స్వతంత్రం ఇవ్వాలంటారు. సమాజంలోని ప్రతి మహిళ విద్యసభ్యసించాలని వాంఛించారు. ఆనాడు స్త్రీ విద్య మీద విధించబడియన్న ఆంక్షలు ఆయనలో క్రోధాన్ని పెంచాయి. [[స్త్రీ]] విద్యను వ్యతిరేకించేవాళ్ళ విూద అక్షర రూపంలో ఆగ్రహాన్ని వ్యక్తుం చేస్తూ, '' తరుణీ వివేకమన్‌ జదవ ధర్మము జ్ఞానముతత్వ దీక్షలన్‌-గురువుల చెంగటన్‌ బడయ గోరిన వారల మాన్పువారునూ-సూకరులై పుట్టు చుంద్రు..'' అని శపించారు. స్త్రీ విద్య మాన్పించేవారు, అమెను చదువుకోనివ్వనివారు సుకరాలై పుడతారని అత్యంత తీవ్ర పదజాలంతో శపించటం ఆనాడు సాహసమే, అయినా ఉమర్‌అలీషా ఏమాత్రం ననెనుకాడలేదు.
 
మన వివాహ వ్యవస్థ సంసారిక జీవనంలో పడతులు పడుచున్న బాధల గాథలను గమనించిన ఆయన '' [[అనసూయ]] '' అను నాటకంలో ఆ విషయాలను ప్రస్తావించారు. ఈ నాటకంలో దేవతాలోకం నుండి భూలోకం విచ్చేసిన '' [[నర్మద]] '' అను పాత్ర భూలోకంలో స్త్రీలు పడుతున్న వెతలను వివరిస్తాడు. భర్తకు సేవలు చేయడం ద్వారా మాత్రమే భార్యకు స్వర్గం ప్రాప్తిస్తుందన్న ప్రచారాన్ని ఖండిస్తూ, '' యీ.. ప్రపంచక మహా మాయా సంపారమున నొక పురుషవ్యక్తికి దాసియో సేవ సలుపకున్న సతికి స్వర్గము లేదట! ఆహా!..'', అంటూ మహిళల పరిస్థితికి నర్మద పాత్ర ద్వారా ఆగ్రహం వ్యక్తం చేస్తారు. స్త్రీ అబలకాదు సబలని, యాచన ద్వారా వచ్చే స్వర్గం తనకు అక్కరలేదని ప్రకటిస్తూ.''... నేను సర్వతంత్ర స్వతంత్రను గానా, నా యంతరాత్మ మహా తపశ్శక్తిచే మార్తాండ మండలమువల తేజో విరాజితమై ప్రదీపించుట లేదా! నేను మహా వీరాధివీరులవలె స్వర్గ ద్వారము బ్రద్దలు చేసికొని వెళ్ళలేనా ? సరే! ఇంక నాకు యాచింపగ వచ్చెడు తుచ్చ స్వర్గము నా కాలి గోరునకైనా వలదు..'', అని ఆత్మవిశ్వాసంతో నర్మద చేత ప్రకటింపచేస్తారు. స్త్రీ పురుషుల మద్యన గల అంతరాల పట్ల ఆగ్రహించిన నర్మద మరింత ముందుకు వెళ్లి, ''.. నా అంతట నేను శుచినై, నాయంతట నేను పరిశుద్ధనై, నాయంతటనేనే స్వర్గము, నా మోక్షము నేనే కట్టుకుని నేనే యానందించెదను...నాకీ యుపాథియక్కరలేదు. నాకీ మృత రూపకమైన స్త్రీత్వమక్కర లేదని '' విప్లవాత్మక ధోరణిని ప్రదర్శిస్తుంది. భూలోకంలో అయినవాళ్ళు, ఆస్తిపాస్తులు లేకపోతే అటువంటి యువతుల వివాహాలు కావడం గగనమేనంటూ, '' తల్లిదండ్రులు లేని తమ్ములులేని యనాధనయ్యనాకు నాధుడెట్లు వచ్చు, సొమ్ములియ్య వచ్చిన వారికే పెండ్లిగాని నాకు పెండ్లి యగునే '', అంటూ వరకట్న దురాచార పర్యవసానాన్ని ఉమర్‌ అలీషా నర్మద పాత్రచేత చెప్పిస్తారు. దుష్టుడైన పతిదేవుని సేవెంత కష్టమో వివరిస్తూ, ''... తపముసేయుట కంటె నుపవాసములకంటె, ..పేదరికము కంటె, బిక్షమెత్తుటకంటె, బండిలాగుటకంటె బానిస పనికంటే, కూలిసేయుట కంటె నాలగాచుటకంటె-గాంతుని సేవ కరినతరము.. '' అటువంటి భార్యభర్తల సంబంధాన్ని నర్మద ద్వారా ఆయన వ్యతిరేకిస్తారు. ఆనాడు అత్తింట ఆడపడుచులు పడుతున్న వెతలను గమనించి, అటువంటి అత్తవారింట [[కాపురం]] చేయటం పడతులకు ఎంత కష్టమో, నర్మద పాత్ర చేత ఈ విధంగా చెప్పిస్తారు.
 
ఈ విధంగా 80 సంవత్సరాల క్రితం అప్పటి సమాజ రీతి-రివాజులకు, ఆలోచనలకు వ్యతిరేకంగా స్త్రీజన పక్షం వహిస్తు ఉదాత్త భావాలను ఉమర్‌ అలీషా ప్రకటించటం విశేషం. స్త్రీ జన సముదాయాల కడగండ్లను వివరించి, విమర్శించిన ఉమర్‌ అలీషా అంతటితో ఊరు కోలేదు. ఆయన రాసిన '' విచిత్ర బిల్హణీయం '' నాటకంలో బాల్య వివాహాలను, [[కన్యాశుల్కం]] లాంటి దురాచారాలను ఖండిస్తూ, ఆనాటి విపత్కర పరిస్థితుల నుండి స్త్రీలే విముక్తి పొందడానికి తీసుకోవాల్సిన చర్యలకు ఈ నాటకంలోని, యామిని పూర్ణ తిలక, బిల్హణీయుడు అను పాత్రల చేత సూచించారు. కన్యాశుల్కానికి బలైన సత్యవతి అను పాత్ర తన వృత్తాంతాన్ని సహాధ్యాయిని యామిని పూర్ణ తిలకతో చెబుతూ, ''..నడువన్‌ బాదములైన లేని మగనిన్‌ నాల్గేండ్ల ప్రాయంబున ముడివైచెన్‌ జనకుండు నకటకటా...ననీ బడుగన్‌ చేరి సుఖించుటెట్లు? ...కాసుల కాసజేసి కనుగానని వృద్ధుని నాకు తండ్రియే చేసెను [[పెళ్ళి|పెండ్లి]], [[బంధువులు]] చెప్పరొవద్దని పెండ్లి పెద్దలీ మోసం మెఱుంగరో, జనని పోరదో నా కురివెట్టి గొంతుకన్‌ గోసిరి..'' అంటూ ఈ పరిస్థితులలో తాను భూమిలో కలసి పోవటం కంటే, ఈ సమస్యకు పరిష్కారం లేదని సత్యవతి ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఈ వృత్తాంతం విన్న యామినీ పూర్ణతిలక, ఈ సమస్యలకు పరిష్కారం స్త్రీలు చైతన్యవంతులు కావటమే మార్గం తప్ప భూమి తల్లి వడిలో చేరటం ఎంత మాత్రం కాదంటుంది. స్త్రీ లోకాన్ని చైతన్య వంతులను చేయాలంటే, స్త్రీలలో అక్షరాస్యత పెంచాలని, ఆ తరువాత లోకజ్ఞానం కోసం గ్రంథాలు, వార్తా పత్రికలు, చదవాలని సూచిస్తుంది. సామాన్య స్త్రీలకు కూడా చదువుకునే అవకాశాలను కల్పించాలని ఆమె ప్రయత్నిస్తుంది. ''.. మననారీ లోకం బున విద్య యొక్కటి కడు కొఱంతగానున్నది. అందేచేతనే యిన్ని దురాగతములు తటస్థించినవి ...'' అని ఆమె ప్రకటిస్తుంది. ఈ నాటకంలోని మరో పాత్ర బిల్హణుడు పలు స్త్రీ జనసంక్షేమ కార్యక్రమాలను చేపడతాడు. ''... స్త్రీ విద్యలేని దేశమునకు క్షేమము రానేరాడు..'' అంటూ ి స్త్రీ విద్యకు అత్యంత ప్రాధాన్యతనిస్తాడు. స్త్రీ విద్యావ్యాప్తి కోసం మహిళా విద్యాలయాలు, అనాథ శరణాలయాలు ప్రారంభించి మహిళాభ్యుదయానికి కృషి యామిని పూర్ణతిలక, బిల్హణీయుడు చేపడతారు. ఈ దిశగా ఆ స్త్రీ జన బాంధవులు తమ కాలం కంటే చాలా ముందుగా ఆలోచిస్తారు. ఆరాధనాలయాల కంటే బాలికా పాఠశాలలు అవసరమంటారు. సత్రముల కంటే అనాథ శరణాలయాలు కావాలంటారు. వనాలు తటకాల కంటే మహిళలకు సర్వ విద్యలు గరిపె కళాశాలను స్థాపించాలని ఆ పాత్రల ద్వారా ఉమర్‌ అలీషా ఆనాటి సమస్యలకు ఆచరణాత్మక పరిష్కారాన్ని సూచిస్తారు.
 
బాల్య వివాహాల వలన స్త్రీ జాతికి కలుగుతున్న కడగండ్లను వివరిస్తూ, ''.. కడు దరిద్రతచేత నిడుములు బడయవచ్చు బాలవైధవ్యంబు బడయరాదు - హాలాహలము ద్రావియగ్ని గూలగవచ్చు బాలుధ్యంబు పడయరాదు - దాస్య సజీవనము దగుల మొందగవచ్చు బాల వైధవ్యంబు పడయరాదు...'' అని అంటారు. అంతే కాదు ''..సహగమనమైన గావించి చావవచ్చు బాల వైధవ్య దుఖంబు పడయరాదు...'', అని ఈ రుగ్మతను నివారించ కదలి రావల్సిందిగా మాన్యులను ఆయన ప్రజలను వేడుకుంటారు. ఈ రకంగా సాగే బాల్య వివాహాల వలన చిన్న వయస్సులోనే వైధవ్యం పొందిన బాలికలలో ఆత్మస్థైర్యం కలుగ చేసేందుకు వారిని సమావేశ పర్చి సభలు సమావేశాలు ఏర్పాటు చేయాలని యామిని పూర్ణ తిలక, బిల్హణుడు పాత్రల ద్వారా నిర్మాణాత్మక ఆలోచనలు చేస్తారు కవి ఉమర్‌ అలీషా.
పంక్తి 142:
జీవితాంతం వరకు భారత శాసన సభలో ప్రజా ప్రతినిధిగా రాజకీయగా బాధ్యతలను నిర్వహిస్తూ స్వజనుల స్వేచ్ఛా-స్వాతంత్య్రాలు కోరుకుంటున్న స్వాతంత్ర్య సమరయోధుడుగానూ, ఆధ్యాత్మిక రంగాన శిష్యకోటికి ధార్మిక జ్ఞానబోధ చేయు పీఠాధిపతిగాను, బహుముఖ ప్రజ్ఞాశాలి, సాహితీవేత్తగా, వేదాంతిగా చిరస్మరణీయమైన ఖ్యాతి గడించిన డాక్టర్‌ అలీషా జీవిత పరిసమాప్తి వరకు పర్యటనలు చేసారు. సమకాలీన సాహిత్య సౌరభాలను అఘ్రాణించుటకు, శిష్యపరంపరకు అధ్యాత్మిక మార్గదర్శకం చేయుటకు ప్రతి క్షణాన్ని వినియోగించిన ఆయన అవిశ్రాంతంగా భారతదేశమంతా పర్యటించినా అలసిపోవడం ఎరుగరు. పండిత ప్రముఖులు ఆహ్వానం మేరకు పలు పర్యటనలు చివరి వరకు సాగించారు. మహా మహోపాధ్యాయులు ఉమర్‌ అలీషా ఎక్కడకు వెళ్ళినా తండోపతండాలుగా శిష్యులు ఆయన ఆధ్యాత్మిక బోధలు వినడానికి విచ్చేస్తుంటే, ఆయన సాహితీ ప్రసంగాలను వినడానికి, ఆయనతో సాహిత్య చర్చలు జరిపేందుకు సాహితీ ప్రియులు, పండిత ప్రముఖులు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా హాజరయ్యేవారు. మౌల్వీ ఉమర్‌ అలీషా రాక కోసం పండితులతో పాటుగా శిష్యులు ఎంతో ఆశగా ఎదురు చూసేవారు.
==అస్తమయం==
1945 జనవరి మాసంలో [[ఢిల్లీ]] నుండి స్వస్థలానికి విచ్చేస్తూ, శిష్యుల ఆహ్వానం మేరకు ఆచార్య ఉమర్‌ అలీషా [[పశ్చిమ గోదావరి జిల్లా]] [[నరసాపురం]] వెళ్ళారు. అక్కడ కొంతకాలం గడిపాక తిరిగి [[పిఠాపురం]] చేరుకో సంకల్పించి, ఆ ప్రయత్నంలో వుండగా [[జనవరి 23]] న మహాకవి కన్నుమూసారు.
 
==ఉమర్ అలీషా వంశీకులు==
"https://te.wikipedia.org/wiki/ఉమర్_ఆలీషా" నుండి వెలికితీశారు