గాడిచర్ల హరిసర్వోత్తమ రావు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 17:
}}
 
ఆంధ్రులలో మొట్టమొదటి రాజకీయ ఖైదీగా పేరుపొందిన '''[[గాడిచర్ల హరిసర్వోత్తమ రావు]]''' ([[సెప్టెంబర్ 14]], [[1883]] - [[ఫిబ్రవరి 29]], [[1960]]) స్వాతంత్ర్య సమర యోధుడిగా, పత్రికా రచయితగా, సాహితీకారుడిగా, గ్రంథాలయోద్యమ నాయకుడిగా ఆయన [[తెలుగు]] జాతికి బహుముఖ సేవలు అందించాడు. ఆంగ్ల పదం ఎడిటర్ (Editor) కు సంపాదకుడు అనే తెలుగు పదాన్ని ప్రవేశపెట్టిన వ్యక్తి.
 
==జీవిత విశేషాలు==
[[1883]] [[సెప్టెంబర్ 14]] న [[కర్నూలు]]లో భాగీరథీ బాయి, వెంకటరావు దంపతులకు గాడిచర్ల హరిసర్వోత్తమ రావు జన్మించాడు <ref name=janamaddi>{{cite book |last=జానమద్ది |first=హనుమచ్ఛాస్త్రి |authorlink= |coauthors= |editor= |others= |title=సుప్రసిద్ధుల జీవిత విశేషాలు |origdate= |origyear=1994 |origmonth= |url= https://te.wikisource.org/wiki/%E0%B0%B8%E0%B1%81%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BF%E0%B0%A6%E0%B1%8D%E0%B0%A7%E0%B1%81%E0%B0%B2_%E0%B0%9C%E0%B1%80%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A4_%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B6%E0%B1%87%E0%B0%B7%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81|format= |accessdate=2013-03-11 |accessyear= |accessmonth= |edition= |series= |date= |year= |month= |publisher=[[విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్]] |location= |language=తెలుగు |isbn= 81-7098-108-5 |oclc= |doi= |id= |pages= |chapter=గాడిచర్ల హరిసర్వోత్తమరావు |chapterurl=https://te.wikisource.org/wiki/%E0%B0%B8%E0%B1%81%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BF%E0%B0%A6%E0%B1%8D%E0%B0%A7%E0%B1%81%E0%B0%B2_%E0%B0%9C%E0%B1%80%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A4_%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B6%E0%B1%87%E0%B0%B7%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81/%E0%B0%97%E0%B0%BE%E0%B0%A1%E0%B0%BF%E0%B0%9A%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B2_%E0%B0%B9%E0%B0%B0%E0%B0%BF%E0%B0%B8%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B5%E0%B1%8B%E0%B0%A4%E0%B1%8D%E0%B0%A4%E0%B0%AE%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B5%E0%B1%81 |quote= }}</ref>. వారి పూర్వీకులు [[వైఎస్ఆర్ జిల్లా]] [[సింహాద్రిపురం]] గ్రామానికి చెందినవారు. వారిది పేద కుటుంబం. [[కర్నూలు]], [[గుత్తి]], [[నంద్యాల]]లో ప్రాథమిక, ఉన్నత విద్య చదివాడు. ఇంకా చదువుకునే ఆర్థికస్తోమత లేకున్నప్పటికీ, ప్రతిభా పారితోషికాల సహాయంతో [[1906]]లో [[చెన్నై|మద్రాసు]] లో ఎం.ఏ డిగ్రీ పూర్తి చేసాడు. తరువాత [[రాజమండ్రి]]లో ఉపాధ్యాయ శిక్షణ పొందుతుండగా, [[1907]]లో స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రవేశించాడు. [[రాజమండ్రి]]లో [[బిపిన్ చంద్ర పాల్]] చేసిన ఉపన్యాస స్ఫూర్తితో విద్యార్థులంతా ''[[వందేమాతరం]]'' బ్యాడ్జిలు ధరించి తరగతికి వెళ్ళారు. వీరికి నాయకుడైన సర్వోత్తమ రావును [[కళాశాల]] నుండి బహిష్కరించడమే కాక, ఆయనకు ఎక్కడా ఉద్యోగమివ్వరాదని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.
 
ఆ తరువాత ఆయన పత్రికా రంగంలోకి అడుగు పెట్టాడు. '''స్వరాజ్య''' అనే [[తెలుగు]] పత్రికను ప్రారంభించి, [[బ్రిటిషు]] పాలనపై విమర్శలు ప్రచురించేవాడు. [[1908]]లో తిరునెల్వేలిలో[[తిరునెల్వేలి]]<nowiki/>లో పోలీసు కాల్పుల్లో ముగ్గురు మరణించినపుడు ''క్రూరమైన విదేశీ పులి'' (Cruel Foreign Tiger) అనే పేరుతో ఆయన రాసిన సంపాదకీయంపై ప్రభుత్వం కోపించి, ఆయనకు మూడేళ్ళ ఖైదు విధించింది. ఆ విధంగా ఆయన ఆంధ్రులలో ప్రప్రథమ రాజకీయ ఖైదీ అయ్యాడు.<ref name="ap online histroy">{{cite web|title=Modern Period|url=http://www.aponline.gov.in/quick%20links/hist-cult/history_modern.html|website=AP Online|accessdate=1 March 2015}}</ref> వెల్లూరు జైలులో, బందిపోట్లు, గజదొంగలూ ఉండే గదిలో ఆయనను బంధించి, అమానుషంగా వ్యవహరించింది, బ్రిటిషు ప్రభుత్వం. జైలు నుండి విడుదల అయ్యాక కూడా ఆయనపై ప్రభుత్వ నిఘా ఉండేది. ప్రజలు ఆయనతో మాట్లాడటానికి కూడా భయపడేవారు.
 
[[1914]]లో [[బాల గంగాధర తిలక్]] యొక్క [[హోం రూల్ లీగ్]]కు [[ఆంధ్ర రాష్ట్ర]] కార్యదర్శిగా విస్తృతంగా ప్రచారం చేసాడు. [[1924]]లో [[కాకినాడ]]లో జరిగిన కాంగ్రెసు సభల సమయంలో '''హిందూస్థానీ సేవా దళ్''' ఏర్పాటులో ఆయన ప్రముఖపాత్ర వహించాడు. [[1927]]లో కాంగ్రెసు అభ్యర్థిగా [[నంద్యాల]] నియోజక వర్గం నుండి మద్రాసు కౌన్సిల్ కు ఎన్నికయ్యాడు. ఆంధ్ర విశ్వవిద్యాలయ [[సెనేట్]] సభ్యునిగా కూడా పనిచేసాడు.
పంక్తి 32:
==రచనా వ్యాసంగం==
[[దస్త్రం:Gadicharla Hari Sarvottama Rao.jpg|thumbnail|గాడిచర్ల హరిసర్వోత్తమ రావు చిత్రపటం]]
పత్రికా రచయితగా[[రచయిత]]<nowiki/>గా, సంపాదకుడిగా, పుస్తక రచయితగా ఆయన చేసిన కృషి బృహత్తరమైనది. తెలుగుతో పాటు [[ఇంగ్లీషు]], [[తమిళం]], మరాఠీ మొదలైన భాషలు కూడా ఆయబకు వచ్చేవి. ఎం.ఏ చదివే రోజుల్లోనే మొదలైన ఆయన సాహితీ వ్యాసంగం, జీవితాంతం కొనసాగింది. ఎన్నో కొత్త పదాలు సృష్టించాడు. ఆయన సాహిత్య కృషిలో కొన్ని విశేషాలు:
* ప్రముఖ దినపత్రిక [[ఆంధ్ర పత్రిక]]కు ఆయన తొలి సంపాదకుడు. [[1916]] నుండి [[1918]] వరకు ఆయన సంపాదకుడుగా ఉన్నాడు.
* [[ది నేషనలిస్ట్]], [[మాతృసేవ]], [[ఎడల్ట్ ఎడ్యుకేషన్ రివ్యూ]], [[కౌముది]], [[ఆంధ్రవార్త]] అనే పత్రికలకు కూడా సంపాదకత్వం నిర్వహించాడు.
పంక్తి 45:
==విశిష్టతలు==
తన సాహిత్య కృషిలో భాగంగా హరి సర్వోత్తమ రావు కొత్త పదాలను సృష్టించాడు. మచ్చుకు కొన్ని:
* '''[[రాయలసీమ]] ''' కు ఆ పేరు పెట్టింది ఆయనే <ref name=janamaddi/>. [[1928]]లో [[కర్నూలు]] జిల్లా [[నంద్యాల]]లో జరిగిన ఆంధ్ర మహాసభలో ఆయన ఈ పేరు పెట్టాడు. అప్పటి వరకు దీనిని '''[[దత్తమండలం]]''' (Ceded) అని పిలిచేవారు.
* '''రాయలసీమ ''' పేరును మొదట సూచించింది [[చిలుకూరి నారాయణరావు]]{{fact}}. నాడు జరిగిన సభలో గాడిచర్ల, చిలుకూరు నారాయణ రావు చేసిన సూచనను ప్రతిపాదించారు. అప్పటికే '''రాయలసీమ ''' పదం పరివ్యాప్తి చెంది ఉండడంతో సభ అందుకు ఏకగ్రీవ ఆమోదం తెలిపింది.
* ''సంపాదకుడు'', ''భావకవిత్వం'' అనే పదాలను పరిచయం చేసింది కూడా ఆయనే.
* ఎం.ఏ డిగ్రీ పొందిన ఆంధ్రులలో ఆయన రెండవవాడు.