జి. వి. సుబ్రహ్మణ్యం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 21:
}}
 
'''[[ఆచార్య జి.వి.సుబ్రహ్మణ్యం]]''' ( [[సెప్టెంబర్ 10]], [[1935]] - [[ఆగష్టు 15]], [[2006]]) <ref>http://www.prabhanews.com/specialstories/article-391396</ref> సంగీత సాహిత్య నృత్య రంగాల్లో కృషిచేసిన బహుముఖప్రజ్ఞాశాలి. సాహితీరంగంలో విమర్శకునిగా చెరగని ముద్ర వేశారు.
 
== వ్యక్తిగత జీవితం ==
[[ప్రకాశం జిల్లా]] [[ఆదిపూడి]] గ్రామంలో శ్రీ గూడ రాఘవయ్య, సరస్వతమ్మలకు [[1935]], [[సెప్టెంబర్]] 10 న జన్మించారు. రాఘవయ్య సంగీతంలో లోతైన పరిజ్ఞానం ఉన్నవాడు. ఆయన తల్లిదండ్రులు దానధర్మాలు చేసి దాతలుగా పేరుపొందారు. [[మేనమామ]] శనగల రామదాసు కుమార్తె, సంగీత విద్వాంసురాలు సుశీలను [[1950]] [[మే 18]]న వివాహం చేసుకున్నాడు. పేదరికం వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ చదువు కొనసాగించిన సుబ్రహ్మణ్యం ఉన్నత విద్యాభ్యాసం కొనసాగించి తద్వారా ఉన్నతోద్యోగాలను పొందాడు. ఆయన [[ఆగస్టు 15]], [[2006]]లో మరణించాడు.
 
== విద్యాభ్యాసం, వృత్తి ==
జి.వి.సుబ్రహ్మణ్యం [[పర్చూరు]] గ్రామంలో [[పాఠశాల]] విద్యను అభ్యసించారు. [[నిజాం కళాశాల]]లో డిగ్రీ పూర్తిచేశారు. డిగ్రీలో ఉండగానే [[బిరుదు వెంకటశేషయ్య]] వద్ద అలంకారశాస్త్ర విషయాలను అభ్యసించారు. [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]] లోనే ఎంఫిల్ చదివిన జి.వి.సుబ్రహ్మణ్యం విశ్వవిద్యాలయంలోనే సర్వప్రథమునిగా నిలిచాడు. విశ్వవిద్యాలయంలో సర్వప్రథమునిగా నిలిచినవారికి ఉద్యోగం కల్పించాలని [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]] ప్రవేశపెట్టిన పథకంలో భాగంగా వరంగల్లో తెలుగు ఉపన్యాసకునిగా ఉద్యోగజీవితాన్ని ప్రారంభించాడు. [[1975]] నుంచి [[1995]] వరకు హైదరాబాదు కేంద్ర విశ్వవిద్యాలయంలో తెలుగు రీడర్ గా, ఆచార్యునిగా, [[1995]] నుంచి [[1998]] వరకు అతిథి ఆచార్యునిగా, 1998 నుంచి [[2000]] వరకు యు.జి.సి.ఎమిరటస్ స్కాలర్ గా పనిచేశారు.<ref>జి.వి.సుబ్రహ్మణ్యం జీవిత సంగ్రహం:గంగిశెట్టి లక్ష్మీనారాయణ:జి.వి.సుబ్రహ్మణ్యం అధికారిక వెబ్సైట్</ref> [[1979]]లో '''ప్రథమాంధ్ర మహాపురాణము - ప్రబంధ కథామూలము''' అంశంపై పరిశోధన చేసి [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]] నుంచి డాక్టరేట్ పట్టా పొందాడు.
 
== సాహిత్య రంగం ==
"https://te.wikipedia.org/wiki/జి._వి._సుబ్రహ్మణ్యం" నుండి వెలికితీశారు