నాగార్జునుడు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
[[దస్త్రం:Aacaaryanaagaarjuna.jpg | thumb|right|అమరావతిలో ఆచార్య నాగార్జునుని సమకాలీన విగ్రహం]]
'''[[ఆచార్య నాగార్జునుడు]]''' (క్రీ. శ. 150-250) ప్రసిద్ధి గాంచిన బౌద్ధ ధర్మ తాత్వికుడు. [[కనిష్క]] చక్రవర్తి సమకాలికుడైన [[అశ్వఘోషుడు]] [[మహాయాన]] బౌద్ధ మతాన్ని ప్రవచించాడు. అందలి [[మాధ్యమిక సూత్రము]]లను నాగార్జునుడు రచించాడు. ఈ మాధ్యమిక తత్వము [[చైనా]] దేశానికి మూడు గ్రంథములు (సున్ లున్) గా వ్యాప్తి చెందింది. ఆచార్య నాగార్జునుడు మహాయానం విశేష వ్యాప్తి చెందటానికి కారకుడు. ప్రజ్ఞాపారమిత సూత్రములు కూడా నాగార్జునుడే రచించాడని అంటారు. [[నలందా]] విశ్వవిద్యాలయములో బోధించాడు. జోడో షింషు అను బౌద్ధ ధర్మ విభాగమునకు ఆద్యుడు. నాగార్జునిని రెండవ బుద్ధుడని కూడా అంటారు.
 
== జీవితం ==
నాగార్జునుని జీవితము గురించి మనకు చాల తక్కువగా తెలియవచ్చింది. [[చైనా|ఛైనా]], టిబెటన్ భాషలలో నాగార్జునుని జీవిత చరిత్ర ఆతని మరణము తరువాత పలు శతాబ్దములు గడచిన పిదప వ్రాయబడింది. కొన్ని ఆధారములను బట్టి ఈతడు అంధ్ర దేశానికి చెందిన వైదీక [[బ్రాహ్మణుడు]]<ref>Buddhist Art & Antiquities of Himachal Pradesh, Omacanda Hala; Page 97</ref><ref>నాగార్జున:http://www.iep.utm.edu/n/nagarjun.htm#H1</ref>. నాగార్జునుడు బాల్యంలోనే సన్యసించి హిందూ తత్వశాస్త్రాన్ని ఆభ్యసించాడు. ఆ తర్వాత బౌద్ధమతాన్ని స్వీకరించాడు. నాగార్జునుడు విదర్భకు[[విదర్భ]]<nowiki/>కు చెందినవాడని మరియొక అభిప్రాయము. వేదశాస్త్రములలో పాండిత్యము సంపాదించి హిమాలయములలో విస్తృతముగా పర్యటించి బౌద్ధము పట్ల ఆకర్షితుడై నలందా చేరాడు. అచట ప్రఖ్యాత ఆచార్యుడు రాహులభద్ర వద్ద శిష్యరికము చేసి నలందాలోనే అచార్యునిగా పలు సంవత్సరాలు బోధించాడు. పిదప కృష్ణానదీ లోయలోని శ్రీపర్వతము చేరి స్థిరపడ్డాడు. దగ్గరలోని ధాన్యకటకములోని విశ్వవిద్యాలములో ముఖ్య అచార్యునిగా బోధలు చేశాడు<ref>నాగార్జునుడు: జీవితము, బోధలు: http://www.nagarjunainstitute.com/buddhisthim/backissues/vol1_no1/1nagarjuna.htm</ref>.
 
నాగార్జునుని అభిప్రాయము ప్రకారము బుద్ధ భగవానుడే మాధ్యమిక పద్ధతికి కారణభూతుడు<ref>Christian Lindtner, Master of Wisdom. Dharma Publishing, 1997, page 324</ref>. కలుపహణ అభిప్రాయమును బట్టి నాగార్జునుడు మొగ్గలిపుత్త తిస్స వారసుడు, మాధ్యమిక పద్ధతిలో బుద్ధుని మౌలిక బోధలను పునరుజ్జీవనము చేసిన మహనీయుడు<ref>David Kalupahana, Mulamadhyamakakarika of Nagarjuna: The Philosophy of the Middle Way; Motilal Banarsidass, 2005, pages 2-5</ref>.
పంక్తి 32:
ఆచార్య నాగర్జునుడు చెప్పిన శున్యవాదానికి మాధ్యమికవాదం అన్నపేరు ప్రశస్తిలోనికి వచ్చినా, దీనికి అద్వయవాదమని, సర్వధర్మశున్యవాదమని, ప్రతీత్య సముత్సాద వాదమని పేర్లు ఉన్నాయి.అయితే మాధ్యమికవాదం అన్నపేరు దీనికి మిగిలిపోవడానికి ఒక కారణం ఉంది.శాక్యపుత్రీయుని ఆది బౌద్ధంలో బహుతెగలు ఉన్నట్లే, ఆ అనంతరం వచ్చిన శూన్యవాదంలో కూడా తెగలు ఏర్పడ్డాయి.ఇందులో మొదటి తెగ పుద్గలశూన్యవాదం (Pluratism), ఇందులో మరిరెండు శాఖలు ఏర్పడ్డాయి. ఈ ఉపశాఖలలో అతివాదులను సర్వాస్తివాదులని, మితవాదశాఖని వాత్సీపుత్రీయులనీ అంటారు.ఆతర్వాత సర్వధర్మ శూన్యతావాదం బయలుదేరింది. ఇందులో మరలా రెండు శాఖలు.ప్రాసంగికులు;స్వాతంత్ర్యికులు అని. ఇందులో నాగార్జునాచార్యులవారు ప్రాసంగిక శాఖకు చెందినవారు.భావ్యాధి ఇతర తాత్వికులు స్వాతంత్ర్యికులు. ఈ రెండు శాఖలను కలిపి మాధ్యమిక శాఖ అంటారు. నాగార్జునుని తరువాత వేరెవ్వరూ కొంతకాలమ్ ఈ శూన్యవాదాన్ని వ్యాప్తిలోకి తేలేకపోయారు, అటుపై ఇద్దరు మహాపురుషులు గుప్తరాజుల కాలంలో అవతరించారు.ఒకడు [[అసంగుడు]], రెండవవాడు వసుబంధువు. వీరు ఈ శూన్యవాదంలో మూడవ శాఖను నెలకొల్పారు. వీరి శాఖని బాహ్యార్ధ శూన్యవాదం అంటారు ([[wikipedia:Idealism|Idealism]]) <sup>.</sup>
 
అటువంటి శూన్యవాదం గ్రంథమే ఈ విగ్రహ వ్యావర్తిని. దీనిలో 72 శ్లోకములు ఉన్నాయి. ఇందులో నాగార్జుని జీవిత చరిత్ర గురుంచి మొదటగా వ్రాయబడింది. అందు నాగార్జునుడు వేదలి గ్రామవాసులు అని వ్రాయబడింది.ఇందులో ప్రతీర్య సముత్పాదముగతి, [[కాలము]], [[ఆత్మ]], తధాగతుడు, స్వభావము, విపర్యాసము, దృష్టి, నిర్వాణము, మొదలైన ధర్మాలగురుంచి నాగార్జుని పరీక్ష, వివరణ కనబడుతుంది. ఆ పిమ్మట శున్యవాదాన్ని గురుంచి నైయాయిక, వైశేషిక, భాట్ట, అద్వైతీత్యవాదులు చెప్పిన విగ్రహ పరిశీలనం ( విగ్రహం అంటే దూషణం) జరుగుతుంది.జైనుల వలే ఇందులో నాగార్జునుడు నీతి మార్గాన్ని బౌద్ధ ధర్మంగా ప్రధానంగా వివరించారు.
 
== టిబెట్టు గ్రంధములలో నాగార్జుని చరిత్ర ==
టిబెట్టులో[[టిబెట్|టిబెట్టు]]<nowiki/>లో ఈతనని తత్త్వ వేత్తయేగాక, మంత్రవేత్త, తంత్ర వేత్త, రసాయిన వేత్తగా పరిగణిస్తారు.సువర్ణ విద్య నేర్చి, ఆర్తులైన మానవులకేగాక, మృగములకుకూడా సేవ చేయుటకు, బంగారము రెండు చేతులా దానము చేసిన దాత అని పేరు. ఆడిన మాట తప్పక తన శిరస్సునే ఇచ్చిన సత్యసంధుడు అని వీరి గ్రంధములు తెలుపుచున్నవి. వీరు కులాచార్య జ్ఞానశ్రీ అనే టిబెట్టు మఠాధిపతి <nowiki>'''</nowiki>భద్రకల్ప ద్రుమము<nowiki>'''</nowiki> అనే గ్రంధములో నాగార్జుని గురుంచి పలు విషయములు తెలియపరిచినారు. దీనిని సీనో ఇండియన్ జర్నల్ 1948 డిసెంబరులో వ్యాసం ప్రచురించబడినది. దీని ప్రకారము:
 
ఆచార్య నాగార్జునుడు దక్షిణాపధం లో ఉన్న విదర్భ దేశంలో ఒక బ్రాహ్మణవంశంలో పుట్టాడు. తండ్రి జ్ఞానదేవుడు లేక గోశాలి. 7 సం.లు రోజూ సామాన్యులకు, బ్రాహ్మణులకు, శ్రమణులకు, వందలమందికి ఆతిధ్య మిస్తుండేవాడు. ఈతని తల్లిదండ్రులు ఈతనికి శాక్యుడనే పేరు పెట్టారు. శాక్యునికి సప్తవర్షప్రాయం రాగానే, అతని అభిరుచులననుసరించి వదలి ఉండాలనే ఆలోచన భరించరానిదై ఉన్నా, విదేశములకు పంపే ప్రయత్నం చేశారు.
పంక్తి 59:
టిబెట్టు వారి భూగోళ శాస్త్రంలో ధాన్యకటకమనగా కృష్ణడెల్టా లో ఉన్నదని, దానిని ధనశ్రీలంక అని కూడా అంటారని ఉంది.
 
నాగ+అర్జునుడు అనగా నాగులకు అర్జునిని[[అర్జుని]]<nowiki/>ని వంటి వాడని నాగులకు దీపకుడంటివాడు. ఈనాగులెవరు? తక్షుడు నాగరాజు కనుక తక్షశిల దేశం నాగదేశమం అని అందురు.కాని బౌద్ధకధలలో ఆంధ్రదేశము నాగదేశంగా చెప్పబడినది. [[అమరావతి (గ్రామం)|అమరావతి]] చైత్యపురాళ్ళలో నాగుల [[విగ్రహాలు]] అనేకం ఉన్నవి.మనలో నాగులపేర్లు కనుక నాగార్జుని నాటికి మన ఆంధ్రదేశంగానే భావించవచ్చును.
 
నాగార్జునుడు విద్యను నేర్చుకొనుటకు ఎంత శ్రమించాడో, ప్రచారం చెయుటకూ అంతే శ్రమించాడు. సువర్ణ విద్యను ఒక సారా అమ్మే మామూలు స్త్రీ వద్ద నేర్చుకొన్నాడు. తంత్ర విద్యలకు దక్షిణాపధం నుండి తక్షశిలవరకూ తిరిగాడు. ఇందులో ఇతనికి స్వార్ధం లేదు. నిస్సంగి, ఇన్ని విద్యలు తెలిసినవారు ఉండరేమో కదా!అనేక గ్రంధములకు వ్యాఖ్య రచించాడు. ఘూష అనగా సింహం గర్జించినట్లు చెప్పుట.మూడుసార్లు ధర్మఘోష చేశాడు.[[సింహం]] ఎట్లా నిస్సంకోచంగా గర్జిస్తుందో అట్లా ధర్మఘోష చేయమని బుద్ధ భగవానుడు చెప్పాడు.
 
== మాధ్యమిక వాదం ==
"https://te.wikipedia.org/wiki/నాగార్జునుడు" నుండి వెలికితీశారు