బెంగుళూరు నాగరత్నమ్మ: కూర్పుల మధ్య తేడాలు

214 బైట్లు చేర్చారు ,  4 సంవత్సరాల క్రితం
చి
సవరణ సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
}}
 
'''[[బెంగుళూరు నాగరత్నమ్మ]]''' ([[నవంబరు 3]], [[1878]] - [[మే 19]], [[1952]]) భరత నాట్యానికి, [[కర్ణాటక సంగీతము]]నకు, అంతరించిపోతున్న భారతదేశ [[కళ]]లకు ఎనలేని సేవ చేసి అజరామరమైన కీర్తి సాధించిన మహా వనిత. ఏటికి ఎదురీది, పట్టుదలతో తాదలచిన [[కార్యము]]<nowiki/>లు సాధించి తరువాయి తరముల మహిళలకు ఆదర్శప్రాయురాలైన గొప్ప విదుషీమణి. భోగినిగా జీవితము ఆరంభించి, తరువాత రాగిణిగా మారి, పిదప విరాగిణియై, చివరకు యోగినిగా తన బ్రతుకు ముగించింది.
 
==జననము==
 
[[మైసూరు]] దగ్గరలోని [[నంజనగూడు]] ఒక చిన్న [[గ్రామము]]. అచట నాగరత్నమ్మ [[1878]] [[నవంబరు 3]] వ తేదీకి సరియైన [[బహుధాన్య]] [[కార్తీక శుద్ధ నవమి]]రోజు పుట్టలక్ష్మమ్మ అను [[దేవదాసి]]<nowiki/>కి, సుబ్బారావు అను వకీలు కు జన్మించింది. ఒకటిన్నర సంవత్సరముల పిదప సుబ్బారావు తల్లీ బిడ్డలను వదిలివేశాడు. పుట్టలక్ష్మమ్మ ఎన్నోకష్టాలకు ఓర్చి, బాధలను సహించి పట్టుదలతో కూతురుని పెంచింది.
 
==బాల్యము, విద్య==
==రంగ ప్రవేశము==
 
1892 వవరాత్రుల సమయములో [[మైసూరు]] మహారాజు కొలువులోని ఆస్థాన సంగీతకారుడు వీణ శేషణ్ణ ఇంటిలో '''నాగరత్నమ్మ ''' చేసిన [[నాట్యము]] పలువురు కళాకారులను, సంగీతవిద్వాంసులను ఆకర్షించింది. ఆమె సంగీతములోని సంప్రదాయ శుద్ధత, సాహిత్యములోని మంచి ఉచ్చారణ, కంఠములోని[[గొంతు|కంఠము]]<nowiki/>లోని మాధుర్యము, అందమైన కల్పన ఆ విద్వత్సదస్సులోని ప్రాజ్ఞులను ఆనందపరచింది. కచ్చేరి ముగిసిన పిదప ఆమె వినయవిధేయతలతో అందరికీ [[నమస్కారము]] చేసింది. అనతికాలములోనే మహారాజావారి కొలువులో సంగీత నాట్య కళాకారిణి స్థానములో కుదురుకున్నది. నాగరత్నమ్మ పేరుప్రఖ్యాతులు దశదిశలా వ్యాపించాయి. తల్లి ప్రతిన నెరవేర్చింది.
 
==దిగ్విజయములు==
 
నాగరత్నమ్మ 25వ ఏట [[గురువు]] మునిస్వామప్ప [[మరణం|మరణము]] ఆమె జీవితములో ఒక పెద్ద మలుపు. 1894 డిసెంబరులో [[మైసూరు]] నుండి [[చెన్నై|మదరాసు]] చేరి రాజరత్న ముదలియార్ అను ధనికుని ప్రాపకము సంపాదించింది. ప్రఖ్యాత సంగీతకారులు నివసించు ప్రాంతములో [[ఇల్లు]] సంపాదించి ఉండసాగింది. అచట వీణ ధనమ్మాళ్ మంచి స్నేహితురాలయ్యింది. సంగీత సాధనకు పూచి శ్రీనివాస అయ్యంగారుల ప్రోత్సాహము దొరికింది. ఆమె ఇంటిలోని కచ్చేరీలకు, భజనల కార్యక్రమములకు చాల మంది సంగీత విద్వాంసులు వచ్చేవారు. నాగరత్నమ్మ దక్షిణ భారతమంతయూ దిగ్విజయముగా పర్యటించింది. ప్రతిచోటా కళాభిమానులు నీరాజనాలిచ్చారు. [[రాజమహేంద్రవరము]]లో [[శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి]] గారు తొడగిన గండపెండేరము, [[1949]]లో గృహలక్ష్మి స్వర్ణకంకణము గ్రహించడము ఆమె ప్రతిభకు తార్కాణములు.
 
==త్యాగరాజ సేవ==
 
నాగరత్నమ్మకు ఒక కూతురుండేది. చిన్నవయసులోనే చనిపోయింది. పిల్లలపై మమకారముతో ఒక పిల్లను పెంచుకున్నది. ఆస్తిపై కన్నేసిన పిల్ల తల్లిదండ్రులు నాగరత్నమ్మకు పాలలో [[విషం|విషము]] కలిపి ఇప్పిస్తారు. భయపడిన చిన్నపిల్ల పాలగ్లాసును జారవిడిచి నిజము చెప్పేస్తుంది. ఈ విషయము నాగరత్నమ్మ మనసును కలచివేసి ఐహికవిషయాలపై విరక్తిని కలుగచేసింది. శేషజీవితము త్యాగరాజస్వామి వారి సేవలో గడపాలని నిశ్ఛయించింది. తిరువయ్యారుకి మకాము మార్చింది. [[కావేరి నది|కావేరీ నది]] ఒడ్డున త్యాగరాజస్వామి వారి [[సమాధి]] శిధిలావస్థలో ఉన్నది. ఆ స్థలాన్ని దాని చుట్టు ఉన్న ప్రదేశాన్ని తంజావూరు రాజుల ద్వారా, రెవిన్యూ అధికారుల ద్వారా తన వశము చేసికొని పరిశుభ్రము చేయించి, [[గుడి]], [[గోడలు]] కట్టించింది. [[చెన్నై|మదరాసు]] ఇంటిని అమ్మి రాత్రనక పగలనక వ్యయప్రయాసల కోర్చి [[దేవాలయం|దేవాలయ]] నిర్మాణాన్ని ముగించింది. అక్టోబర్ 27, 1921లో పునాదిరాయిని నాటగా, జనవరి 7, 1925న గుడి కుంభాభిషేకము జరిగింది. స్థలాభావము వలన ఇంకా నేల కొని ఒక మంటపము, [[పాకశాల]] 1938లో నిర్మించింది. ఈ నిర్మాణములతో ఆమె సంపద, ఆభరణాలు హరించుకుపోయాయి. 1946లో త్యాగయ్య చిత్ర నిర్మాణసందర్భములో [[చిత్తూరు నాగయ్య]] గారు నాగరత్నమ్మను కలిశారు. ఆమె సలహాపై నాగయ్య గారు త్యాగరాజనిలయం అనే సత్రాన్ని కట్టించారు.
 
==సంగీత సేవ==
 
==సాహిత్య సేవ==
నాగరత్నమ్మ మాతృభాష [[కన్నడ భాష|కన్నడము]] అయిననూ [[సంస్కృతము]], [[తెలుగు]]<nowiki/>ము, [[తమిళ భాష|తమిళ]] భాషలలో ప్రావీణ్యమును గడించింది. [[తిరుపతి వేంకటకవులు]] రచించిన శ్రవణానందము అనే పుస్తకములో [[ముద్దు పళని]] విరచితమగు [[రాధికా సాంత్వనము]] గురించి చదివి ఆ పుస్తకమును కొని చదువగా అందులో చాల తప్పులున్నాయని గ్రహించింది. వ్రాతప్రతులకు ముద్రిత ప్రతులకు చాల తేడాలున్నాయి. వ్రాతప్రతులన్నీ సంపాదించి 1911లో వావిళ్ళవారిచే పరిష్కృత పుస్తకము ప్రచురింపచేసింది. పుస్తకములో బూతు పద్యాలున్నాయని బ్రిటీష్ ప్రభుత్వము అభియోగము చేసింది. ప్రసిద్ధులైన కవులు, పండితులు, న్యాయవాదులు వావిళ్ళ వారి తరఫున అర్జీ పెట్టుకొన్నారు. అయినా [[బ్రిటిషు|బ్రిటిష్]] ప్రభుత్వము పట్టు విడవలేదు. వావిళ్ళ దుకాణాలపై దాడి 1927లో జరిగింది. భారతదేశానికి [[స్వాతంత్ర్యము]] వచ్చిన తరువాత టంగుటూరు[[టంగుటూరి ప్రకాశం|టంగుటూరి ప్రకాశం పంతులు]] గారి హయాములో బహిష్కారము తొలగించబడింది. ఆ సమయానికి నాగరత్నమ్మ తిరువైయ్యూరులో ఒక యోగినిగా మారింది.
ఈమె రచించిన గ్రంథములు కొన్ని: 1. శ్రీ త్యాగరాజ అష్టోత్తర శతనామావళి (సంస్కృతం),2. మద్యపానం (తెలుగు సంభాషణం), 3. దేవదాసీ ప్రబోధ చంద్రోదయం (తెలుగు), 4. పంచీకరణ భౌతిక వివేక విలక్కం(తమిళం)
 
1,96,531

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2181016" నుండి వెలికితీశారు