మహమ్మద్ ఖదీర్ బాబు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎మన్ చాహే గీత్: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: వుంది. → ఉంది. using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 37:
|signature =
}}
'''[[మహమ్మద్ ఖదీర్ బాబు]] '''<ref>[http://www.beditor.com/telugu-stories/411-khadir-babu-books ఖదీర్ బాబు - రచనలు - సంక్షిప్తంగా]</ref>'''' ఒక [[తెలుగు కథా రచయిత]]
==రచయిత పరిచయం:==
ఖదీర్ బాబు సొంత ఊరు[[కావలి]], [[నెల్లూరు జిల్లా]]. ప్రస్తుతం [[హైదరాబాద్]] వాస్తవ్యులు. [[ఆంధ్రజ్యోతి]]లో చాలా కాలం డెస్క్ లో పనిచేసి, [[సాక్షి (దినపత్రిక)|సాక్షి]] ప్రారంభించినప్పటినుండి సీనియర్ న్యూస్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. నూతన తరం [[తెలుగు]] కథకులలో ఖదీర్ బాబు ది ప్రత్యేకమైన స్థానం.
 
''అవార్డు :'' 2013 మే 18...ప్రసిద్ధ కథకుడు [[మధురాంతకం రాజారామ్]] స్మృతికి నివాళిగా ఏటా ఇస్తున్న ‘కథాకోకిల’ అవార్డులు, 2012 కి, ‘కథాకోకిల’ అవార్డు మహమ్మద్ ఖదీర్ బాబుకి [[హోసూరు]]లో కథకుల సదస్సులో ప్రదానం చేశారు.
 
''బ్రిటీష్ కౌన్సిల్ ఫెలోషిప్ : '' జూన్ 2013..ప్రపంచంలోని[[ప్రపంచము|ప్రపంచం]]<nowiki/>లోని వివిధ భాషల సాహిత్యాన్ని ఇంగ్లీషులో అనువదించడానికి ప్రతి ఏటా బ్రిటీష్ కౌన్సిల్ అందించే ప్రతిష్ఠాత్మక 'చార్లెస్ వాల్లెస్ ఫెలోషిప్ ' కు మహమ్మద్ కథలు ఎంపికయ్యాయి.ఈ ఫెలోషిప్ [[హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ]] గెస్ట్ ప్యాకల్టీగా పనిచేస్తున్న నాగా మనోహర్ రెడ్డి ఈ కథలను [[అనువాదం]] చేయడానికి పొందారు. మన దేశంలో [[బెంగాలీ]], [[మళయాళ]], హిందీ, తమిళ సాహిత్యాలకు లభించినా తెలుగుకు దక్కడం మాత్రంమళయాళిత్రం ఇదే తొలిసారి.
 
==రచనలు:==
పంక్తి 74:
ముందొక పిట్ట కథ.
పూర్ణయ్యని బావగాఢంటారు అందరు.
బావగాడు లేకపోతే సరదాలేదు, సంబరమూ లేదు. పెళ్ళిగాని, పేరంటంగాని వంట హంగంతా బావగాడే. వంటవాళ్లని కూర్చోనిచ్చేవాడు కాదు. నించోనిచ్చేవాడు కాదు. పరుగులు పెట్టించేవాడు. ఇక తినేవాళ్లకి భోజనం మీద తప్ప వేరే ధ్యాస రానిచ్చేవాడు కాదు. ఒకసారి వన సంతర్పణ పెట్టుకున్నారు. జనం అంతా మామిడితోపులో చేరారు. చాపలు పరిచి పిచ్చాపాటి మాట్లాడుకునేవారు కొందరు. పేకాటలో మునిగినవారు మరికొందరు. గాడిపొయ్యి తవ్వించాడో లేదో బావగాడు జనం మధ్యకు పరుగెత్తుకొచ్చాడు. ‘అందరూ వినండర్రా’ అని పెద్దగా గావుకేక పెట్టి మాటలు మానిపించాడు. పేకాట మూయించాడు. ‘వంటకాలు ఇలా తయారు చేయిస్తున్నాను’ అంటూ లిస్టు చదివాడు. ‘వంకాయ మెంతికారం పెట్టిన [[కూర]], [[అరటికాయ వేపుడు|అరటికాయ]] నిమ్మకాయ పిండిన కూర, పెసరపప్పుతో చుక్కకూర, వాక్కాయ కొబ్బరి పచ్చడి, పొట్లకాయ పెరుగుపచ్చడి, అల్లం ధనియాల చారు, మసాలా పప్పుచారు, అయ్యా జీడిపప్పు పచ్చకర్పూరాలతో పాయసం, మామిడికోరుతో పులిహోర, గుమ్మడి [[వడియాలు]], వూర మిరపకాయలు. అందరికీ సమ్మతమేనా?’ అని అరిచాడు. సమ్మతమేమిటి నా మొహం – అప్పటికప్పుడు అందరి నోళ్లలో నీరూరించి, ఇంకా వంటలు కాకముందే [[భోజనం]] మీద అందరికీ [[మమకారం]] పెంచాడు. [[జిహ్వ గ్రసని నాడి|జిహ్వ]] గిలగిల్లాడుతుండగా అందరి కడుపుల్లో ఆకలి అగ్నిలా లేచింది. అక్కడితో ఆగాడా? ఊహూ. లేత వంకాయలు కోయించుకు తెచ్చి ప్రదర్శనకు పెట్టాడు. ‘చుక్కకూర‘[[చుక్క కూర|చుక్కకూర]] కందిపప్పుతో కంటే పెసరపప్పుతో మహ చక్కగా మేళవిస్తుంది’ అని జ్ఞాపకం చేశాడు. [[పులిహోర]] తిరగమోత వెయ్యగానే ఆ ఘుమఘుమలకే జనానికి శరీరమంతా ఆకలే అయ్యేలా చేశాడు. అందర్నీ బంతులుగా కూచోపెట్టి కొసరికొసరి వడ్డించి తినిపించాడు….
 
మహమ్మద్‌ ఖదీర్‌బాబున్నాడే, అచ్చం బావగాడే బావగాడు.ఒక కథల సంతర్పణ మొదలుపెట్టాడు. రోజుకో కథ అన్నాడు. ‘ఓసంతేకదా, భారతి కాలం నుంచీ ఇలాంటివి ఎన్నో చూశాం’ అని జనాలు ఎవరి గోలలో వాళ్లు పడ్డారు. కొందరు పిచ్చాపాటీ కబుర్లు, కొందరు పేకాటలు, మరికొందరు రాష్ట్ర విభజన రాజకీయాలు. వారం రోజులు తిరిగేసరికల్లా కథల్ని కొత్తకొత్తగా ఖదీర్‌బాబు వండుతున్న కమ్మని వాసన అందరికీ చేరింది. ఇక వేరే చర్చలు ఆగిపోయాయి. సంతర్పణలో బావగాడు చూపెట్టిన వంకాయల మీదే మాటలు నడిచినట్టు ఎక్కడికక్కడ కథల మీదే మాటలు మొదలయ్యాలు.
‘అసలెలా ఎంచుకుంటున్నాడంటావ్‌?’
‘ఏది వరస?’
‘ఏమైనా ఖదీర్‌ [[కథలు]] చెప్పటంలో సిద్దహస్తుడు’
‘ఇంతకీ రేపెవరిదో? ఏ కథ వస్తుందో?’
జనంలో కథల పట్ల ఆకలి నిలువెత్తయి, తాడి ప్రమాణమయింది. నూరు రోజులు, నూరుగురు కథకులు, నూరు కథలు.
పంక్తి 91:
నెల్లూరి కేశవస్వామి ‘యుగాంతం’ అయిపోయిందా, ఇప్పటికీ జరుగుతున్న కథా?
 
ఒక్కమాటలో చెప్పాలంటే వందరోజుల పాటు రోజుకో జీవితపు రుచి. అందుకున్నవాళ్లకి అందుకున్నంత. తెలుగు ప్రజలకు ఖదీరు వడ్డించిన మృష్టాన్న భోజనం. టీవీ సీరియళ్లు తప్ప మరో లోకమెరుగని ఇల్లాళ్లెందరో ఈ కథలున్న పుస్తకాలెక్కడ దొరుకుతాయోనని ఆరా తీశారు. ఇంగ్లిష్‌ మీడియంలో చదువుకుని హైదరాబాదులో ఉద్యోగమే పరమావధిగా బతుకుతున్న కుర్రకారంతా తెలుగు కథలింత బావుంటాయా – మరి మాకెవరూ చెప్పలేదేం అనుకున్నారు. సప్త సముద్రాలు దాటి అక్కడెక్కడో ప్రవాస జీవితం గడుపుతున్నవారంతా తెలుగు కథల [[పుస్తకాలు]] కావాలని ఇక్కడికి ఫోన్లూ మెయిళ్లూ కొట్టేరు. ‘రావిశాస్త్రి పోయాక తెలుగు కథలు చదవడం మానేశానండీ’ అని స్పష్టంగా చెప్పిన నడివయసు జనాలంతా మళ్లీ తెలుగు కథ మీద ఇష్టం పెంచుకున్నారు. ‘నా కథ ఎప్పుడు వస్తుందో’ అని రచయితలు ఎదురుచూశారు. తమ కథ వచ్చిన రోజు పాఠకుల ఫోన్లు వెల్లువైపోతుంటే తట్టుకోలేక సంతోషంతో మనసు నిండిపోయి అది కంట నీరుగా ఒలికిపోతుంటే చిరునవ్వుతో స్వీకరించినవారున్నారు.
 
పోతే ఒకటే తేడా. బావగాడు వండించి వడ్డించిన తీరుకు జనాలంతే సుష్ఠుగా తిని ఆకుల ముందునుంచి లేవడం కూడా కష్టమైపోయింది, ఖదీరు కథలు చెప్పి ప్రచురించిన జోరు జనాల మీద ఎపిటైజర్లా పనిచేసింది. వాళ్ల ఆకలి సగం తీరి, మరి సగం తీరకుండా ఉండిపోయింది. వంద కథల తర్వాత దినపత్రికలో ఆ ఫీచర్‌ మరిక రాదంటే వాళ్లకి పిచ్చకోపమొచ్చింది. అలాగని కథల భోజనం ముందు నుంచి లేవలేరు. ‘‘ఏం తెలుగులో ఉన్నవి ఈ నూరు కథలేనా? ఈ నూరుగురు కథకులేనా? మరో వంద చెప్పలేవూ?’’ అని నిలదీశారు. రచయితలకూ కోపమొచ్చింది. ‘‘ఏం తెలుగులో కథలంటే అవేనా? మరో యాభయ్యో వందో వేస్తే నాదీ ఆ జాబితాలో నిలబడకపోదునా?’’ అని చాటుమాటుగా విసుక్కున్నారు. అమరావతి కథల్లో బావగాడి సంతర్పణకీ, ఖదీరుబాబు సంతర్పణకీ ఇదిగో ఇదొక్కటే తేడా.
పంక్తి 97:
దాన్ని ఖదీరుబాబు ఊహించాడు. అనుభవించాడు. అందుకే వినయంగా ‘‘కొండను అద్దంలో చూపిస్తున్నా’’నని చెప్పేశాడు. ‘‘వందేళ్లలో వచ్చిన వంద సుప్రసిద్ధ కథలను ఏరి, వాటిని క్లుప్తంగా తిప్పి చెప్పిన ప్రయత్నం ఇది. కథను చదివే, కథ మొతాన్ని చదివే, కథను వెతుక్కుని చదివే వీలు లేని అడావిడి రోజుల్లో నూరేళ్ల తెలుగు కథా సాహిత్యాన్ని అలుపు లేకుండా ముగించడానికి వీలుగా చేసిన ప్రయత్నం ఇది. తెలుగు కథకు ఒక కథకుడు ప్రకటించిన కృతజ్ఞత’’ అని చెప్పుకున్నాడు.ఈ వందమంది కథలను నేను ఎంతో సంతోషంగా రాశాను. ఎంతో పరవశిస్తూ రాశాను. ప్రతి కథలోని సంస్కారాన్ని ఎంతగానో స్వీకరిస్తూ రాశాను. ప్రతి రచయితా వదిలివెళ్లిన కథాస్థలిని ఎంతో కుతూహలంతో రీవిజిట్‌ చేశాను. ఇది నాకు పండగ. నిజంగా నేను అనుభవించిన పండగ’’ అని చెప్పిన ఖదీర్‌ మాటల్లో ప్రతి అక్షరమూ సత్యమేననిపిస్తుంది ఈ పుస్తకం చదివాక.
 
మా ఊరి అమ్మవారి గర్భగుడిలో నూనె దీపాల మసక వెలుతురే తప్ప కరెంటు దీపాలుండవు. అందుకని అమ్మ ముఖం స్పష్టంగా కనిపించడానికి పూజారి కర్పూర హారతినెత్తి అమ్మ విగ్రహం చుట్టూ తిప్పుతాడు. ఆ వెలుగులో జగద్ధాత్రి చిరునవ్వునూ, కరుణాదృష్టినీ, మెరిసే ముక్కెరనూ, కుంకుమబొట్టునూ, మంగళసూత్రాలనూ, తల్లిపాదాలనూ దర్శిస్తాం. మనసు నిండిపోతుంది. ఖదీరుబాబు మా ఊరి పూజారిలాగా[[పూజారి]]<nowiki/>లాగా అనిపించాడు నాకు. ఆయన ఎత్తిన కర్పూర హారతిలో తెలుగు కథా దేవత స్వరూపమంతా స్థూలంగా కనిపిస్తోంది. ఆమె పాదాల దగ్గర అతను పెట్టిన దేవగన్నేరు పువ్విది.
ఖదీరు నూరేళ్లుండాలి, తెలుగు కథ వెయ్యేళ్లకీ వెలగాలి.
 
పంక్తి 156:
ఈ భాగ్యం నాది కాదు, ఈ భోగమూ నాది కాదు.
ఇది బాల్యానిది.
[[బాల్యం]] ఎవరు రాసినా, ఎప్పుడు రాసినా ఆ భాగ్యమూ, భోగమూ వాళ్ళకీ దక్కుతాయని గుండెల మీద చేతులు వేసుకుని చెప్పగలను.
- మహమ్మద్ ఖదీర్ బాబు
 
===బాలీవుడ్ క్లాసిక్స్===
 
1970-80 మధ్యకాలంలో హిందీలో[[హిందీ భాష|హిందీ]]<nowiki/>లో వచ్చిన సినిమాల కథనాలు, వాటి తెరవెనుక కథలు, నిర్మాణంలో ఎదురైన సాధక బాధకాలు, ఉత్తమ చిత్రాలుగా ప్రజల గుండెల్లో నిలవడానికి గల కారణాల విశ్లేషణలతో... 50 బాలీవుడ్ ఉత్తమ చిత్రాలను పరిచయం చేస్తూ సాక్షి ఫ్యామిలీలో మహమ్మద్ ఖదీర్ బాబు రాసిన వ్యాసాల సంకలనం ‘బాలీవుడ్ క్లాసిక్స్’.
 
60వ దశకం నుండి 80 వ దశకం వరకూ హిందీ చిత్రసీమ నుండి వచ్చిన కొన్ని కళాత్మక చిత్రాలకు సంబంధించి రచయిత శ్రీ ఖదీర్‌బాబు, వారం వారం ఒక ప్రముఖ దినపత్రికలో రాసిన 50వ్యాసాలను `బాలీవుడ్ క్లాసిక్స్` పేరుతో సంకలనంగా ప్రచురించటం జరిగింది. సినీ ప్రేమికులు ఆ చిత్రాలలో కొన్నిటిని చూసివున్నా, రచయిత విశ్లేషణా చాతుర్యం వల్లే చదువుతున్నంత సేపు మళ్లీ ఒకసారి రచయిత దృక్కోణంలో ఆ సినిమా చూస్తున్నంత అనుభూతిని పొందుతారనే ఉద్దేశంతో ఈ పుస్తక పరిచయానికి పూనుకున్నాను.
పంక్తి 169:
ఈ `బాలీవుడ్ క్లాసిక్స్` విషయానికొస్తే సంబంధిత చిత్రాల కథకథనాలను విశ్లేషిస్తూనే ఆ సినిమాల నిర్మాణం వెనుకవున్న కష్టనష్టాలను కూడా రచయిత తెలియజేయడంతో ఆ సినీ జీవుల పట్ల పాఠకులకు యింకా ఆరాధనా భావం ఎక్కువవుతుంది… స్క్రిప్ట్ తప్ప, ముహూర్తాలూ, టైటిల్ సెంటిమెంటూ, క్లాప్‌సెంటిమెంట్లూ, రిలీజ్‌డేట్ సెంటిమెంట్లూ అన్నీ జాగ్రత్తగా చూసుకుని ఫ్లాప్ తీస్తున్న మనవాళ్లు కొన్ని తెలుసుకోవాలి అంటూ, `షోలే` తొలిరోజు షూటింగ్ భారీ వర్షం వల్ల అసలు జరగనేలేదనీ, మరునాడు తొలిషాట్ తీసింది వితంతువు పాత్రపైన అనీ, ఎంత పెద్ద సినిమా అయినా మొదలు ఆధారపడవలసింది అక్షరం మీదే, తయారుకావలసింది పేపర్ మీదే అని చురకలు అంటించాడు రచయిత.
 
అలాగే `బాబీ` సినిమా గురించి రాస్తూ రాజ్‌కపూర్ తనెంతో ప్రేమించి తీసిన `మేరానామ్ జోకర్`ని ప్రేక్షకులు నిరాదరిస్తే, కసితో డబ్బొచ్చే సినిమా తియ్యాలనే పంతంతో `బాబీ` తీసి [[విజయం]] సాధించాడు.. ప్రతిభ కలిగినవాళ్లు పగబడితే చాలా కష్టం.. అని చెబుతూనే… ఏ ఉత్తమ వైద్యుడూ చేతులారా రోగికి విషం యివ్వడు. అందుకే కమర్షియల్ హంగులతో `బాబీ` తీసినా అందులోనూ `రాజ్ కపూర్` తన హృదయాన్ని చూపెట్టాడంటాడు ఖదీర్‌బాబు.
 
సాదాసీదా దర్శకుడైన `బ్రిజ్` తీసిన సూపర్ హిట్ “విక్టోరియా నెం.203“ గురించి చెబుతూ `ప్రేక్షకులు మెచ్చే మిఠాయి పొట్లాన్ని ఢిల్లీ మిఠాయివాలా మాత్రమే కట్టక్కర్లేదు.. వీధి చివర రంగయ్య అయినాచాలు` అనటం రచయిత చమత్కారం. సినీ ప్రేమికుల్ని అలరించే మరెన్నో విషయాలున్నాయి ఈ పుస్తకంలో…
 
“ఇలాంటి కథ నాకు తెలుసు అని ప్రేక్షకుడు అనుకునే [[సినిమాలు]] నేను తీయను… ఇలాంటి కథ జరిగితే బాగుంటుంది అనుకునే సినిమాలనే తీస్తాను.“ అని చెప్పిన మాస్‌ మసాలా దర్శకుడు `మన్‌మోహన్ దేశయ్` తన కెరీర్‌లో కోట్లుగడించినా మాస్‌పల్స్ తెలియడానికా అన్నట్లు జీవితాంతం ముంబాయ్‌లోని మిడిల్‌క్లాస్ బస్తీలోనే నివాసమున్నాడని తెలిసినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది. తన ప్రతి సినిమాలోనూ హిందూ, ముస్లీం, క్రిస్టియన్ పాత్రలు పెట్టి వారి మధ్య బ్రదర్‌హుడ్ కోసం ప్రయత్నిచాడట.
 
తన కొడుకులా మరెవరూ పోలియో బారిన పడకూడదనే ఉద్దేశంతో తన సినిమా ద్వారా ప్రేక్షకులకు వినోధాన్ని అందిస్తూనే `పోలియో`పట్ల ఎడ్యుకేట్ చెయ్యాలని భావించి తన బిడ్డ `మ్యాకీ`నే ప్రధాన పాత్రగా చేసి `కువారా బాప్` చిత్రాన్ని తీసిన `మొహమూద్` గురించి చదువుతుంటే మనసులో ఏదో మూల కలుక్కుమంటుంది.
పంక్తి 188:
 
మూగ, చెవుడు, గుడ్డి మనుషులు వారి మనసులతోనే కమ్యూనికేషన్ ఏర్పరచుకొని తమ మధ్య స్నేహబంధాన్ని సృష్టించుకుంటుంటే అన్నీ వున్న మనం మాత్రం మన భాషని, మాటని, ఎప్పుడూ శత్రువులను తయారుచేసుకోవడానికే ఉపయోగించుకుంటున్నాం అని చర్చించే `గుల్జార్` `కోషిష్` చిత్రంపై ఖదీర్‌బాబు విశ్లేషణ అద్భుతం. ఆ మాటకొస్తే అన్ని విశ్లేషణలూ వ్యాసాలూ హృదయాన్ని తాకుతాయి. ఎందుకంటే యిందులో ప్రస్తావించిన సినిమాలన్నీ హృదయమున్న సినిమాలే కాబట్టి. అందుకే వెంటనే పుస్తకంకొని చదవండి. ఆ కళాఖండాలను వీక్షించమని మీ మనసే మిమ్మల్ని తొందరపెడుతుంది.
అన్నిటికన్నా ఈ [[పుస్తకము|పుస్తకం]] వెనుక అట్టమీద వున్న నాలుగులైన్లు ఆకర్షించాయి నన్ను అవి.. “ సినిమాకు భాష అడ్డుగోడకాదు. అడ్డుగోడల మీద సినిమా వారధి కావాలన్నది ఆలోచన. నిజానికి ప్రపంచాన్ని ఒక్కతాటిపైకి తెచ్చే గొప్ప ప్రక్రియ సినిమా“.
 
===మన్ చాహే గీత్===
పంక్తి 203:
ఈ పుస్తకంలో మొత్తం 12 కథలు (న్యూ బాంబే టైలర్స్, దావత్, జమీన్, దూద్ బఖష్, కింద నేల ఉంది, ఒక వంతు, రాత్రిపూట, ఢాఖన్, ఒక సాయంత్రం అదృష్టం, పెండెం సోడాసెంటర్, ఖాదర్ లేడు, గెట్ పబ్లిష్డ్ ) (కొన్ని కథలు సంక్షిప్తంగా)
 
ఈ కథా సంపుటం లోని మొదటి కథ న్యూ బాంబే టైలర్స్ . ఈ కథ పేరునే పుస్తకానికి పేరుగా పెట్టారు. కావలి లోని పీరుభాయి అనే కుర్రాడు బాంబే వెళ్లి అక్కడి కొత్త ఫాషన్స్ నేర్చుకుని కావలి వచ్చి అక్కడి రైల్వే రోడ్ లో బాంబే టైలర్స్ అనే పేరుతో ఒక దర్జీ దుకాణం తెరిచి అక్కడి కాలేజ్ విద్యార్థుల, పెద్ద రెడ్ల అభిమానం సంపాదించుకుంటాడు. పేరు, డబ్బు సంపాదించుకుంటున్న తరుణంలో పులిమీద పుట్రలా ఆ ఊరు చివర కొత్తగ కొన్ని రేడీమేడ్ దుస్తుల కర్మాగారాలొచ్చి స్థానిక దర్జీల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం కలుగచేస్తాయి. దర్జీలు దుకాణాలు మూసివేసి ఈ రేడీ మేడ్ ఫాక్టరీలలో కూలీలుగా చేరిపోతుంటారు. మెల్లగా ఈ ప్రభావం బాంబే టేలర్స్ పై కూడా పడి తండ్రీ కొడుకులు రేడీ మేడ్ కర్మాగారంలో కూలీలుగా చేరటానికి వెళ్లినప్పుడు, వారి పేర్లకు బదులుగా కొన్ని అంకెలుతో వారిని పిలవాల్సొస్తుంది. అంతే కాదు; ముందే కత్తిరించిన కొన్ని బట్టలు ఇచ్చి, కుట్టి తీసుకు రమ్మంటే, పీరుభాయి అది అవమానంగా భావిస్తాడు. బలుసాకైనా తిని బ్రతుకుతా కాని ఈ పని నా వల్ల కాదు అని ఉద్యోగం నిరాకరిస్తాడు. [[ప్రపంచీకరణ]] దుష్ఫలితాలను చక్కగా వివరిస్తుందీ కథ.
 
*'''జమీన్:'''
పంక్తి 209:
 
*'''ఒక సాయంత్రపు అదృష్టం:'''
ఈ కథను చెప్పటం కష్టం; ఎందుకంటే ఇందులో కథ కంటే అనుభూతి ఎక్కువ. ఆశ నిరాశల మధ్య ఊగిసలాడే కథానాయకుడు తన ఊహల్లో క్రియ కంటే ఎప్పుడూ ముందుండి, ప్రకృతి సహజమైన అనుభూతులకు దూరమవుతూ, వేదనకు లోనవుతుటాడు. అయితే ఒక [[వర్షం]] కురిసిన సాయంకాలం, పూలమ్మి అమ్మే పూలబుట్టలలోంచి వచ్చే పూల పరిమళాళలకు పరవశుడై, తన భార్యకు[[భార్య]]<nowiki/>కు అనూహ్యంగా సంతోషాన్ని కలిగించే, చిన్న చిన్న ఆశ్చర్యాలు కలిగించి ఆమెను సంతోషపెడ్తాడు. రేపు లేదన్నట్లుగా, ఆ సాయంత్రం వారిరువురిదే అన్నట్లుగా, ఆ రాత్రి అనుభవిస్తారు. మరుసటి రోజు ఎప్పటిలా తెల్లవారింది. కథానాయకుడిలో ఆశావాదం పెల్లుబికింది. అయినా రేపు మిధ్య, ఈ రోజే నిజం అన్నట్లుగా తన కర్తవ్యానికుపక్రమిస్తాడు.
 
*'''గెట్‌ పబ్లిష్‌డ్‌ :'''
పంక్తి 216:
“గెట్‌ పబ్లిష్‌డ్‌’లో (షకీల్‌ కాకుండా) మూడు పాత్రలు. ఒకటి ఏడేళ్ల ముష్టాక్‌. వాడు మసీదు దగ్గరికొచ్చేవారి చెప్పుల్ని భద్రపరిచి తిరిగి ఇచ్చేసే “”పని’’లో వున్నవాడు. “ముష్టాక్‌ నల్ల బంగారం. నల్ల ముత్యం. వాస్తవానికి వాణ్ణొక నల్లటి ముతకరబ్బరు బంతి అనాలి. చూడటానికి ముద్దుగా వుంటాడు. పట్టుకోవడానికి కండగా వుంటాడు’. “వాడి కళ్లల్లో కరెంటు ఉంటుంది. వొంట్లో తూనీగ ఎగురుతూ ఉంటుంది...’ వాడికి అమ్మా నాన్నా ప్రాణం. వారికి వీడు ఇంటిదీపం, కంటి వెలుగు. రెగ్యులర్‌గా మసీదుకు వచ్చీపోయే షకీల్‌కి -వీడొక ప్లెజంట్‌ స్మార్ట్‌ బాయ్‌. ముష్టాక్‌ తల్లి -ఫాతిమా -రెండోపాత్ర. “నేరేడు చెట్టు నీడలో, చుట్టూ చెప్పులు పెట్టుకుని, నల్లటి గువ్వలాగా...’ “ఆమె గొంతే ఆమె ఆకారం. ఆమె మాటే ఆమె వునికి...’ ఫాతిమా ఒక విలక్షణమైన ముస్లిం స్త్రీ. “మసీదులోని తెల్లటి గోడల మధ్య నల్లటి చారికలా కనిపిస్తూ ఉంటుందామె’ అంటాడు కథకుడు. ఇదీ వర్ణనాశిల్పం అంటే. పులుముడుకాదు. ఏకపదవాక్యంతో గుండె మీద ఆర్తినీ, అంత: కరణనీ గీరగలగాలి కథకుడు! ఆ తర్వాత ఆమె చుడీబజార్‌లో యాచిస్తూనూ కనిపిస్తూ ఉంటుందిట! ఇక, ఈమె భర్త- నయాబ్‌-మూడోపాత్ర. అతను అత్తర్‌ నయాబ్‌-పేరుకు. ఇతని కథ కొంచెం పెద్దదే. ఆటో డ్రైవర్‌గా, సెవెన్‌సీటర్‌ డ్రైవర్‌గా చేశాడు. ఏదీ అచ్చిరాలేదు. సంపాదనలేదు.
 
ప్రపంచంలో అక్కడక్కడా, అక్కడా ఇక్కడా -ఉగ్రవాదదాడులు, ఎవరు ఎవర్ని “టార్గెట్‌’ చేస్తారో, ఎందుకు చేస్తారో తెలీదు. విసిరిన పంజాదెబ్బకు ఎందరో మృతులు, ఎందరో క్షతగాత్రులు. అయితే పంజావిసిరిందెవరు? తెలీదు. అదో పెద్ద యక్షప్రశ్న. హైదరాబాద్‌లోనూ[[హైదరాబాదు|హైదరాబాద్‌]]<nowiki/>లోనూ దుర్ఘటనలు. ఒక దురదృష్టకరరాత్రి.. బాగా పొద్దుపోయిన తర్వాత అన్నం ముందు కూర్చున్న నయాబ్‌ని లాగి, కొట్టి, ఫాతిమానీ నెట్టేసి గాయపరచి, ముష్టాక్‌కీ నాలుగు తగలనిచ్చి -నయాబ్‌ని “వాళ్లు’ లాక్కుపోయారు. ఆ తర్వాత జరగాల్సినదంతా జరిగింది. అదొక “ట్రీట్‌మెంట్‌ కథ’. ఇక్కడ ఫాతిమాని ఎవరు ఊరడించగలరు? ముష్టాక్‌ వొళ్లు తెలీని జ్వరంలో కాలిపోతున్నాడు. షకీల్‌ లాంటివాళ్లు అదీ ఇదీ చేద్దామని ముందుకొస్తే ఆమె తరస్కరిస్తుంది. ఉన్న వాళ్లిద్దరూ జీవచ్ఛవాలైనారు. దిగులు బండలయ్యారు. ఆ “ట్రామా’ అక్షరాలకి ఒదుగుతుందా!? చివరికి పదహారు రోజుల తర్వాత నయాబ్‌ని ఎవరో ఇంటి ముందు పడేసి పోయారు. కావడమే “మూలుగు’ వచ్చింది. బతికి వుండీ ఎందుకూ పనికిరాని ఒక మూటవచ్చింది. మీకూ నాకూ -నయాబ్‌ పరిస్థితిని అర్థం చేసుకోవటానికి -చాలా “బతుకు’ చిత్రాలు దోహదం చేస్తాయి. కళ్లకు కడతాయి. “మళ్లీ నవంబర్‌ 26 వచ్చింది’! ఆ తర్వాత వాళ్లు ఏమయ్యారో తెలీదు! అవును. ఇదే కథ! [[ముగ్గురు]] అమాయకుల ఛిద్రజీవన విషాదకావ్యం!
 
నయాబ్‌ [[కుటుంబము|కుటుంబం]] పడిన హింస. అనుభవించిన బాధ. జరిగిన హాని. ఎవరు బాధ్యుల? ఎవరు జవాబుదారీ వహిస్తారు? ఇవీ షకీల్‌ అడగయే అడుగుతున్న ప్రశ్నలు. సభ్యసమాజం జవాబీయవలసిన ప్రశ్నలు. “ఈ దేశంలో కొందరు ఐడెంటీ చూపలేరు. అలాగని ఐడెంటిటీలేని వారుగా కూడా బతకలేరు. అందుకనే ఒక్కోసారి వాళ్ల ఐడెంటీయే వాళ్లకు ప్రమాదం తెచ్చిపెడుతూ వుంటుంది’! ఇదీ “గెట్‌ పబ్లిష్‌డ్‌’ కథానికకు ఇతివృత్త కేంద్రకం.
 
== సూచికలు==
"https://te.wikipedia.org/wiki/మహమ్మద్_ఖదీర్_బాబు" నుండి వెలికితీశారు