"రోణంకి అప్పలస్వామి" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
చి
చి
}}
 
'''[[రోణంకి అప్పలస్వామి]]''' ([[సెప్టెంబరు 15]], [[1909]] - [[మార్చి]], [[1987]]) బహుముఖ ప్రజ్ఞాశాలి. కాన్వెంట్ బాటను పట్టిన నేటి తరానికి ఆయనెవరో తెలియక పోయినా, ముంజేతిలో చేతికర్ర వేలాడ దీసి, బెట్టిన దొర టోపీ పెట్టుకొని ..[[టెక్కలి]]ని అంతర్జాతీయ సాహితీ ప్రపంచానికి పరిచయం చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి. అరసం తొలితరం ప్రముఖులు, రాష్ట్రశాఖ అధ్యక్షవర్గ సభ్యులుగా కూడా ఉన్నారు. [[ఆంగ్ల భాష|ఇంగ్లీషు]], [[ఫ్రెంచి భాష|ఫ్రెంచ్‌]], [[స్పానిష్ భాష|స్పానిష్‌]], [[గ్రీక్ భాష|గ్రీక్]], హిబ్రూ[[హీబ్రూ భాష|హీబ్రూ]], ఇటాలియన్‌ మొదలైన ఆరు యురోపియన్‌ భాషలలో నిష్ణాతులు. [[శ్రీశ్రీ]], [[ఆరుద్ర]] లకు తొలి రోజుల్లో స్ఫూర్తినిచ్చినవారు. అల్లసానిపెద్దన[[అల్లసాని పెద్దన]], [[భట్టుమూర్తి]], [[క్షేత్రయ్య]] మొదలు శ్రీశ్రీ, నారాయణబాబు, చావలి బంగారమ్మ, [[చాసో]] మొదలైనవారి కవితల్ని ఆంగ్లీకరించి దేశ, విదేశీ భాషా పత్రికల్లో ప్రచురించారు.
 
==జీవిత విశేషాలు==
అప్పలస్వామిగారు శ్రికాకుళం[[శ్రీకాకుళం జిల్లా]] [[టెక్కలి]] సమీపంలోని ఇజ్జవరం అనే గ్రామంలో [[1909]] [[సెప్టెంబరు 15]] న జన్మించారు. తండ్రి రోణంకి నారాయణ్, తల్లి రోణంకి చిట్టెమ్మ . తండ్రి పెట్టిన పాఠశాలలో ప్రాథమిక విద్య ముగించుకుని, [[విజయనగరం]], [[కాశీ|కాశీ హిందూ విశ్వవిద్యా]]<nowiki/>ల యాల్లో చదువుకుని ఎం.ఏ. (ఇంగ్లీషు) పట్టభద్రులయ్యారు. [[విజయనగరం]] మహారాజు కళాశాలలో సుమారు 30ఏళ్ళు ఉద్యోగం చేసి - ఇంగ్లీషు శాఖాధిపతిగా 1969లో రిటైరయ్యారు. మరొక రెండేళ్ళు - ఆంధ్ర విశ్వవిద్యాల యంలో ఎమెరిషస్‌ ప్రొఫెసర్‌గా పనిచేశారు. తరువాత టెక్కలిలో స్వగృహం నిర్మించుకుని స్థిరపడ్డారు. [[1987]], మార్చిలో మరణించారు.
 
==పత్రికల్లో వ్యాసాలు==
అభ్యుదయ, అవగాహన, [[ఆంధ్రజ్యోతి]], [[ఆంధ్రపత్రిక]], [[భారతి (మాస పత్రిక)|భారతి]], [[ఆంధ్రప్రదేశ్ (పత్రిక)|ఆంధ్రప్రదేశ్‌]], కళాకేళి, ప్రజారధం, [[సృజన]] మొదలగు పత్రికలలోనూ అనేక ప్రత్యేక సంచికల్లోనూ వ్యాసాలు ప్రచురించారు. సమాచారశాఖ వారికోసం కోడి రామమూర్తిపై చిన్న పుస్తకం రచించారు. కేంద్ర సాహిత్య అకాడమి కోసం మాకియ వెల్లీ ''ప్రిన్స్‌''ను - నేరుగా ఇటాలియన్‌ భాషనుండి తెలుగు చేశారు. మానేపల్లి, చిత్రభాను, మోహనప్రసాద్‌, [[చాగంటి తులసి]] - మొ||వారి పుస్తకాలకు ముందుమాటలు రాశారు. ఆరుద్ర తన తొలి కావ్యం -'త్వమేవాహం'నూ మానేపల్లి తన తొలి కవితా సంపుటి 'వెలిగించే దీపాలు'ను గురువుగారికి అంకితం ఇచ్చారు. 1980ల్లో ఆధునిక కవితా పితామహుడు గురజాడ అనీ, [[శ్రీశ్రీ]] తానే పితామహుడిననడం తగదని - జరిగిన వాదోపవాదాలకు గట్టి సమాధానం చెప్పారు. [[విశాఖపట్నం]] [[ఆకాశవాణి]] నుండి [[తెలుగు]], [[ఆంగ్ల భాష|ఇంగ్లీషు]]<nowiki/>లలో పలు ప్రసంగాలు చేశారు. [[రావూరి భరద్వాజ]]<nowiki/>గారు - ప్రత్యేకంగా ఆయన చేత [[హైదరాబాదు|హైదరాబాద్‌]] ఆకాశవాణి కేంద్రాలనుండి ప్రసంగాలు చేయించారు.
 
టెక్కలి వారి స్వగృహంలో వివిధ యురోపి[[ఐరోపా యన్‌సమాఖ్య|యూరోపియన్‌]] భాషలకు చెందిన అరుదైన గ్రంథాలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. వాటిని విశాఖనగర పౌర గ్రంథాలయానికి తరలించాలన్న ప్రయత్నాలు ఇంకా ఫలించలేదు. ఆయన రచనలు ఎన్నడూ జాగ్రత్త చేయలేదు. పోయినన్ని పోగా మిగిలిన [[తెలుగు]], [[ఆంగ్ల భాష|ఇంగ్లీషు]] రచనల్ని పుస్తకంగా తీసుకువచ్చే ప్రయత్నాలు మొదలయ్యాయి. వారి ఇంగ్లీషు కవితలు లోగడ - సాంగ్స్‌ అండ్‌ లిరిక్స (1935), ది నావ్‌ అండ్‌ అదర్‌ పోయమ్స్‌ (1985) పేర పుస్తక రూపంలో వచ్చాయి.
 
==మూలాలు==
1,91,156

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2181120" నుండి వెలికితీశారు