అమృతలూరు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 127:
#దగ్గరలోని రైలు స్టేషన్లు: [[తెనాలి]], [[పొన్నూరు]], [[రేపల్లె]].
==గ్రామములోని విద్యాసౌకర్యాలు==
#తురుమెళ్ళ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల.(ప్రస్తుతం లేదు).
#జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల.
#ఒకప్పటి సంస్కృత పాఠశాల....ఆరోజులలో ఇప్పటి వోలె ఇంగ్లీషు చదువులు అందఱకు అందుపాటులో ఉండెడివి కావు. జిల్లాలలో ఏరెండు మూడు చోట్లనో ఉన్నత పాఠశాలలుండుటయు, ఆచదువులకు బోవయునన్న వ్యయప్రయాసలు మిన్నగా ఉండుటయు కద్దు. ఇంచుమించు ఏబది యేండ్ల కు ( ఈ వ్యాస రచన 1964 సంవత్సరాన) మున్నే అమృతలూరు లో సంస్కృత పాఠశాలను నెలకొల్పిరి. ఆచదువులు అందఱకు దక్కవనియు, కొందరే వానిని జదువు కొందురనియు, అది పవిత్రమైన దైవ భాషయనియు, అది చదివిన వారికి సత్ప్రవర్తనమలవడుననియు, ఆభాష భారత జాతి నాగరికతకు మూలమనియు, భారతీయులలో ఆసేతుహిమాచలము అనేకత్వములో ఏకత్వమును గూర్చునది సంస్కృతమే అనియు, ఈదేశములో ప్రసిద్ధియున్నది. ఆదృష్టిలో తెలుగుదేశములో అమృతలూరు పౌరులు ఈపాఠశాలను స్థాపించి మంచి పని చేసిరనియే అభిజ్ఞులు మెచ్చుకొందురు.  నాలుగు కాసులు వెచ్చించి పాఠశాలను స్థాపించిరే కాని పాఠములు చెప్పువారెవ్వరు? అది యొక ‘సమస్య’ అయ్యెను. దేశములో ఈ పాఠములు చెప్పగలవారు లేరని కాదు, ఆచెప్ప నేర్చిన వారిని సత్కరించి ఆహ్వానించి పాఠశాలలో ప్రవేశపెట్టిన కొన్ని నాళ్ళకే ఏదో వంకతో వారు నట్టేట పుట్టి ముంచెడి వారు. ‘అబ్రాహ్మణుల’కు సంస్కృత విద్య చదువుటలో అర్హత ఉన్నదా? అని ప్రతి పండితునకు సందేహమే పుట్టెడిది. ఒక వేళ - ఆమాట పైకి చెప్పలేక, జీతనాతములమీద మమతచే ఎవ్వరో ఒకరు వచ్చి ఈకొలువులో కుదిరినప్పుడు ఊరిలోని ‘వాతావరణము’ కొంత కస్సుబుస్సు మని ఆపండితుని సాగనంపినదాక నిదురపోవని పరిస్థితి దాపరించెను.  ఆగ్రామంలో ‘రైతుపెద్ద’ ఒకరు ఈపరిస్థితిని గమనించి పాఠశాలా నిర్వహణమునకై నడుము కట్టెను. ఆయన పేరు శ్రీ పరుచూరు వెంకయ్య చౌదరి. ‘దేవుడు వెంకయ్య’ అని ఆయన గూర్చి వాడుక వున్నది. ఆయన మంచి వ్యవహార దక్షుడు, లోకజ్ఞుడును. ఆయన ముల్లు గఱ్ఱ మీద మొగము పూనిక చేసి దూరముగా నిలిచి వినుచున్నాడని తెలిసినపుడు, పౌరాణికుడు ఉన్న తెలివి పోయి పప్పులోకాలు వేయుట కద్దు. ఆయనకు సంస్కృతమన్నను, ఆయుర్వేదము మున్నగు ప్రాచీన విద్యలన్నను ఎంతో అభిమానము. ఆయభిమానము మూలముననే ఆయన పాఠశాలమీద కన్నువైచి రాయలసీమ నుండి విద్వాంసునొకని దీసికొని వచ్చి పాటశాలలో ప్రవేశపెట్టెను. గ్రాసవాసము లేర్పఱచినగాని ఈపండితులు నాలుగు కాలాలు నిలువరని పూర్వానుభవము వలన గుర్తించి ఆయనకొక ఇల్లు కట్టి యిచ్చెను. ఇంటిల్లపాదికి తగిన గ్రాసమిచ్చెడి పొలము కొంత ఆయన పేరబెట్టెను. ఆరైతు బ్రతికి యున్నంత వఱకు ఆపండితుని వలన ఆపాఠశాల చక్కగా సాగెను. ఆయిన పోయిన వెంటనే ఆపండితుడు ఆగ్రాసవాసములను చేతిలో బెట్టుకొని అనుభవించుచు ఆగ్రామము విడిచి పట్టణములో మకాము పెట్టి ఇంగ్లీషు బడిలో తిఛాఆయ్యెను. ఆయన పుణ్యమా యని పాఠశాలావిద్యార్ధులు పంచకావ్యముల దాక చదవ గలిగిరి. కాని అక్కడనే ఉన్నది అసలు సమస్య. ‘కౌముది’ ప్రారంభింపవలె. అది వ్యాకరణ శాస్త్రము గదా! శాస్త్రము జోలికి ఈపిల్లలు రారాదు గదా! రైతు పెద్ద పోయిన వెంటనే ఈసమస్య ఈతీరుగ దీర్చుకొని ఆపండితుడు తనపని తాను జూచుకొనెను.  ఈఘట్టములో కొన్నాళ్ళకు ఆయూరి వారి అదృష్టవశమున దాక్షిణాత్యులయిన పండితులొకరు పాఠశాలకు దక్కిరి. ఆయన అప్పుడే మైలాపూరు సంస్కృత కళాశాలలో ‘మీమాంస శిరోమణి’ లో ఉత్తీర్ణులయి అధ్యాపక వృత్తికి సిద్ధముగా ఉండిరి. ఆయన పేరు కంబంపాటి స్వామినాధ శాస్త్రి గారు. వారి పూర్వులు దక్షినాదికి వలసపోయిన తెలుగువారు. ఆయన అమృతలూరు పాఠశాలలో అడుగు వెట్టిన వెంటనే ఊరిలో ‘బ్రాహ్మణ్యము’ చేయగలిగినంత అలజడి జేసిపెట్టిరి. దానికా శాస్త్రివర్యులు అదరక బెదరక స్తిమితముగా నిలిచిపోయి చిరకాలము పాఠశాలను జక్కగా పెంచి ఎందఱనో శిష్యులను సిద్ధము చేసెను. ఆయన పెట్టిన బిక్ష వలననే సత్యనారాయణ చౌదరి వంటి విద్యార్ధులు ఎందఱెందరో రెక్కలు వచ్చి విద్యాగంధము రవ్వంతైన మూచూడగలిగిరి. ఆ బ్రాహ్మణ్యులు ఈప్రాంతము వారికి గావించిన అత్యంత సహకారమును మనస్సులో భావించుకొని సత్యనారాయణ చౌదరి తాను సంస్కృతములో వ్రాసిన ‘శకుంతలా’ గ్రంధమును ఆయన గారి కంకితమిచ్చి ఋణములో రవ్వంతైన దీర్చుకోగలిగితినని సంబరపడును.  సంయుక్తాంధ్ర మద్రాసు రాష్ట్రములో పళ్లెటూళ్లలో ఉన్న సంస్కృత పాఠశాలలో అమృతలూరు పాఠశాలకు మంచి పేరు ప్రతిష్ఠలున్నవి. అర్ధ శతాబ్దికి పైగా ఆప్రాంతము వారెందరో పంచకావ్యముల దాక అందే చదివి పేరుగడించిరి. ‘బాపూజి’ ఉద్యముల వంటి అనేక మహోద్యములకు సైతము పరోక్షముగా ఆ పాఠశాల అనుబంధము కలిగియుండెడిదని చెప్పవచ్చును. ఆడుపిల్లలతో సైతము సంస్కృతవిద్య అంతో ఇంతో లభించినదన్న ప్రఖ్యాతి ఆరోజులలో అమృతలూరు గ్రామమునకే దక్కినది. 
#మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల.
 
==గ్రామంలో మౌలిక సదుపాయాలు==
===ప్రాథమిక ఆరోగ్య కేంద్రం===
"https://te.wikipedia.org/wiki/అమృతలూరు" నుండి వెలికితీశారు