నాట్య శాస్త్రం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 3:
 
== ప్రమాణము ==
నాట్యవిద్యను అనుసరించి వెలువడిన అఖిల గ్రంథాలకూ ఇది ప్రమాణము. ఈమహాగ్రంథంలో నాట్యము ప్రధానంగా నిర్వచింపబడటంవలన నాట్యశాస్త్రమనే పేరు సార్థకమౌతున్నది.అయినప్పటికీ నాట్యాంగముగా ఉండే అనేకవిషయాలు నిరూపింపబడినవి. కావ్య విద్యాప్రమేయమిందులో కూర్పబడింది. చందోవిచిత తాళమృదంగవిధానాలు ఇందులో నిరూపితములయినవి. ఇంకా [[కామశాస్త్రం]] కూడా అవసరమైనంత వరకూ గోచరించపబడింది. నాయికానయిక స్వభావాలు, కామతంత్రమును అనుసరించినవారి ప్రవృత్తి భేదాలు చక్కగా తెలుపబడినవి. మనోవిజ్ఞానాకి కావలిసిన అనేక రహస్యాలు అక్కడక్కడా గోచరించబడినవి. కాని ఇన్నీ నాట్యానికి అంగములుగానే వర్ణింపబడివని. నాట్యశాస్త్ర పరిమితి 36 అధ్యాయాలు. అలంకార నిబంధకులంతా ప్రత్యభిజ్ఞా సంప్రదాయవాదులు. వీరినే సంప్రదాయ వాదులని, స్పందవాదులని అందురు. వీరికి సంబంధించిన కొన్ని అంసములు ఈ శాస్త్రములో చెప్పబడినవి. [[అభినవగుప్తడు|అభినవ గుప్తడు|అభినవగుప్త]] ఈ గ్రంథానికి [[వ్యాఖ్యాత]]. ఈ గ్రంథంలో మొత్తంమ్మీద 5536 శ్లోకాలున్నాయి. ఇందులో సామాన్యంగా అన్నీ [[అనుష్టుప్]] వృత్తాలు. అక్కడక్కడా భిన్న వృత్తాలున్నాయి. ఉదాహరణలు భిన్న వృత్తాలలోనే కూర్పబడినవి. ఈ శ్లోకాలు కాక అక్కడక్కడ కొంత [[గద్య పద్యం]] ములు కూడా ఉన్నాయి. మొదట్లో భరత గ్రంథం సూత్రాత్మక గద్య రూపంగా ఉండేదనీ, తరువాతికాలంలో ప్రకృత రూపం పొందినదని అందురు.
 
గ్రంథంలో అక్కడక్కడ "ఆత్రైతే అనువంశ్యికాః శ్లోకా భవంతి" అన్ని కొన్ని శ్లోకాలను భరతుడు వ్రాసినాడు.అవి సంప్రదాయ గతములై ఉండవచ్చు. అంతకుపూర్వం ఏదైనా నాట్యనిబంధనం ఉండిఐనా తీరాలి.ఆయా సంప్రదాయాలకు సంబధించిన శ్లోకాలై ఉండవచ్చును. ఆ గ్రంథాలు ఇప్పుడు అలభ్యం. ఉండినచో ఎంత బాగుండేదో మరి!
"https://te.wikipedia.org/wiki/నాట్య_శాస్త్రం" నుండి వెలికితీశారు