మేడికొండూరు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 129:
==గ్రామ ప్రముఖులు==
===[[ఎమ్మెస్కే ప్రసాద్‌]]===
మేడికొండూరు ఆణిముత్యం బీసీసీఐ ఎంపిక కమిటీ అధ్యక్షునిగా [[ఎమ్మెస్కే ప్రసాద్‌]] గుంటూరుకు మరోమారు ఖ్యాతి ఈనాడు-అమరావతి భారత క్రికెట్‌ జట్టు ఎంపిక కమిటీ అధ్యక్షునిగా మేడికొండూరుకు చెందిన మన్నవ శ్రీకాంత్‌ కృష్ణప్రసాద్‌(ఎమ్మెస్కే ప్రసాద్‌)ను బుధవారం బీసీసీఐ నియమించింది. దీంతో జిల్లా మరోమారు ఖ్యాతిని ఆర్జించింది. సాధారణ కుటుంబంలో జన్మించిన ఎమ్మెస్కే ప్రసాద్‌ చిన్నతనం నుంచి క్రికెట్‌పై మక్కువతో మొక్కవోని దీక్షతో శ్రమించి ఆటలో ప్రావీణ్యం సాధించి అత్యున్నతమైన ఎంపిక కమిటీ చైర్మన్‌ స్థాయికి ఎదిగారు. 12 సంవత్సరాలు వచ్చేసరికి రాష్ట్రస్థాయిలో అండర్‌ -12 జట్టుకు ఎంపికై న్యూట్రిన్‌ సూపర్‌స్టార్‌ టోర్నీలో పాల్గొన్నారు. అప్పటినుంచి క్రమం తప్పకుండా రాష్ట్రం తరపున క్రికెట్‌ జట్టులో ఉన్నారు. వికెట్‌ కీపింగ్‌పై దృష్టిసారించి ప్రతిభ కనబరచడంతో జాతీయజట్టుకి ఎంపికై అంతర్జాతీయస్థాయిలో ఆడారు. ఎక్కడున్నా... ఏస్థాయిలో ఆడినా క్రికెట్‌ను ఆస్వాదించడం ఆయన నైజం. ఈనేపథ్యంలోనే 33ఏళ్ల వయసులో 2008లో రిటైర్‌మెంట్‌ ప్రకటించారు. క్రికెట్‌పై అంతులేని ప్రేమను ఏర్పరచుకున్న ప్రసాద్‌ రిటైర్‌మెంట్‌తో ఆగిపోకుండా ఆంధ్రా క్రికెట్‌ ఆసోసియేషన్‌కు సేవలు అందిస్తూ వచ్చారు. అతని సేవలను గుర్తించిన బీసీసీఐ 2015లో భారత క్రికెట్‌ జట్టు ఎంపిక కమిటీలో సభ్యుడిగా ఎంపికచేసింది. క్రికెట్‌ ధ్యేయంగా భావించే ఎమెస్కే ప్రసాద్‌ భారత క్రికెట్‌ జట్టు ఎంపిక కమిటీ ఛైర్మన్‌గా బుధవారం నియమితులయ్యారు. ఆరేళ్లలో 1.20లక్షల కిలోమీటర్ల ప్రయాణం చిన్నతనం నుంచి క్రికెట్‌ను అమితంగా ప్రేమించిన ఎమ్మెస్కే ప్రసాద్‌ క్రికెట్‌లో ఆటగాడిగా రిటైర్‌మెంట్‌ ప్రకటించారే కానీ సేవలను మాత్రం కొనసాగించారు. గత ఆరేళ్ల కాలంలో దేశవ్యాప్తంగా రోడ్డుమార్గాన 1.20లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తూ యువ క్రికెటర్లను గుర్తించి వారిని వెలుగులోకి తీసుకురావడంలో కీలకపాత్ర పోషించారు. ఇందుకు తల్లిదండ్రులు, భార్య ఇచ్చిన ప్రోత్సాహం మరువలేనిదని ఆయన గుర్తుచేస్తున్నారు. రాష్ట్రంలో విజయనగరం, మంగళగిరి, కడప క్రికెట్‌ ఆకాడమీలు ఏర్పాటులో కీలకపాత్ర పోషించారు. దీంతోపాటు మంగళగిరి, పేరేచర్ల, గుంటూరులోని జేకేసీ కళాశాలలో మైదానం, కృష్ణాజిల్లా మూలపాడులో[[మూలపాడు]]లో రెండు క్రికెట్‌ మైదానాలు ఏర్పాటుచేయడంలో ఎమ్మెస్కే ప్రసాద్‌ అవిరళమైన కృషిచేశారు. యువ క్రికెటర్లను గుర్తించి వారికి ప్రోత్సాహం అందించి మేటి క్రీడాకారులుగా తీర్చిదిద్దడానికి అనేక చర్యలు చేపట్టారు. ఇందుకు ఆంధ్రా, భారత్‌ క్రికెట్‌ నియంత్రణ మండలి ఎంతో సహకారం అందించిందని చెప్పారు. మేడికొండూరు నుంచి బీసీసీఐ వరకు.... భారత క్రికెట్‌ జట్టు ఎంపిక కమిటీ ఛైర్మన్‌గా ఎన్నికైన మన్నవ శ్రీకాంత్‌ కృష్ణప్రసాద్‌ గుంటూరు జిల్లా మేడికొండూరుకు చెందినవారు. స్వగ్రామంలోనే ఒకటో తరగతి వరకు చదివారు. అనంతరం గుంటూరులోని కేంద్రీయ విద్యాలయంలో రెండోతరగతి నుంచి పదవ తరగతి వరకు చదివారు. హిందూ కళాశాలలో ఇంటర్‌, డిగ్రీ విద్యను పూర్తిచేశారు. కేంద్రీయ విద్యాలయంలో చదివేటప్పుడే క్రికెట్‌కు పునాది పడింది. ఎనిమిదో ఏట నుంచి క్రికెట్‌ ఆడటం ప్రారంభించి 12వ సంవత్సరం వచ్చేసరికి రాష్ట్రస్థాయి అండర్‌-12 జట్టుకు ఎంపికయ్యారు. గుంటూరులోని బ్రహ్మానందరెడ్డి స్టేడియానికి వెళ్లి నిత్యం క్రికెట్‌ సాధన చేసేవారు. అక్కడే కోచ్‌ పూర్ణచంద్రరావు ప్రసాద్‌ ప్రతిభను గుర్తించి వికెట్‌ కీపింగ్‌లో శిక్షణ ఇచ్చారు. వికెట్‌ కీపింగ్‌పై దృష్టిసారించిన ఎమ్మెస్కే ప్రసాద్‌కు తండ్రి కృష్ణప్రసాద్‌ ప్రోత్సాహం అందించడంతో అంచెలంచెలుగా ఎదిగి జాతీయజట్టుకు ఎంపికై అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడారు. <ref>{{cite web|last1=డైలీహంట్|first1=రైటర్|url=http://m.dailyhunt.in/news/india/telugu/eenadu-epaper-eena/medikonduru+aanimutyam-newsid-58193359|website=డైలీహంట్|accessdate=23 December 2016}}</ref>
 
==గ్రామ విశేషాలు==
 
"https://te.wikipedia.org/wiki/మేడికొండూరు" నుండి వెలికితీశారు