పరీక్షిత్తు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ని → ని , పరిక్ష → పరీక్ష (2), ప్రార్ధించె → ప్రార్థించె, using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[File:Sage Sukdeva and King Parikshit.png|thumb|ముని సుదేవునితో పరీక్షిత్తు]]
'''[[పరీక్షిత్తు]]''' ([[సంస్కృతం]]: परिक्षित्, [[IAST]]: Parikṣit, with the alternative form: परीक्षित्, [[IAST]]: Parīkṣit) పాండవుల తరువాత [[భారతదేశము|భారతదేశాన్ని]] పరిపాలించిన మహారాజు. ఇతను [[అర్జునుడు|అర్జునుడి]] మనవడు, [[అభిమన్యుడు|అభిమన్యుని]] కుమారుడు. ఇతని తల్లి [[ఉత్తర]]. తల్లి గర్భంలో ఉన్నప్పుడే [[అశ్వత్థామ]] ఇతనిపై బ్రహ్మ శిరోనామకాస్త్రము ప్రయోగించెను. దాని మూలంగా కలిగిన బాధనోర్వలేక ఉత్తర శ్రీకృష్ణుని ప్రార్థించెను. ఆతని కరుణ వలన బాధ నివారణమై శిశువుగా ఉన్న పరీక్షిత్తు బ్రతికెను. ఇతడు [[ఉత్తరుడు|ఉత్తరుని]] కూతురు ఇరావతిని [[పెళ్ళి|వివాహము]] చేసుకొనెను. ఇతని కుమారుడు [[జనమేజయుడు]].
 
==వృత్తాంతము==
పంక్తి 6:
 
ఇతని కాలములోనే కలిపురుషుడు వస్తే అతనిని ఓడిస్తాడు.
[[ధర్మరాజు]] అనంతరం పరీక్షిత్తునకు పాండు రాజ్యానికి పట్టాభిషేకం చేసెను. పరీక్షిత్తు 60 సంవత్సరాలు రాజ్యపాలన చేసెను. ఒకనాడు వేటకై అడవికి పోగా మృగమును తరుముచూ ఒక ముని ఆశ్రమము చేరెను. మృగమేమైనదని అడుగగా సమాధిలోనున్న ముని సమాధానం చెప్పలేదు. కోపించిన పరీక్షిత్తు అక్కడనున్న పాము శవాన్ని ముని మెడలో వేసి వెళ్ళిపోయాడు. ముని కుమారుడు [[శృంగి]] తన తండ్రి మెడలో సర్పమును వేసినవాడు ఏడు రోజులలో [[తక్షకుడు|తక్షకుని]] చేత మృతి చెందుతాడని శపిస్తాడు. పరీక్షిత్తు తాను చేసిన నేరమునకు చింతించి సర్పములకు దుర్గమమైన చోట [[మేడ]] నిర్మించుకొని భద్రముగ ఉంటూ ప్రాయోపవిష్ఠుడై [[శుకుడు|శుకుని]] వలన పుణ్యకథలను వినుచుండెను. శాప ప్రభావం వలన ఏడవ రోజు బ్రాహ్మణవేషధారులైన [[సర్పము]]లు వచ్చి [[నిమ్మ]] పండ్లు కానుకిచ్చిరి. అందుండి వెలువడిన [[తక్షకుడు]] పరీక్షిత్తును కరచి అతనిని సంహరించెను. ఆ వారం రోజులలో విన్నదే [[మహాభాగవతము]].
 
ఇతని కుమారుడు [[సర్పయాగం]] చేసిన [[జనమేజయుడు]].
"https://te.wikipedia.org/wiki/పరీక్షిత్తు" నుండి వెలికితీశారు