పురూరవుడు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[Image:Urvashi-Pururavas by RRV.jpg|250px|right|thumb|ఊర్వశి మరియు పురూరవుడు, [[రాజా రవివర్మ]] చిత్రపటం.]]
'''[[పురూరవుడు]]''' చంద్రవంశానికి చెందిన ఒక రాజు. ఆయన తల్లిదండ్రులు చంద్రవంశ సంజాతుడైన [[బుధుడు]], [[మనువు]] కూతురైన ఇళ.
 
మంచి అందగాడు, పరాక్రమవంతుడు కావడంతో ఆయన కీర్తి దేవలోకానికి కూడా పాకింది. [[ఇంద్రుడు]] అవరసమైతే అప్పుడప్పుడు పురూరవుని సహాయం కోరేవాడు. ఒకసారి [[ఇంద్రుడు]] ఆయనను అమరావతికి ఆహ్వానించాడు. పురూరవుడు తిరిగి తన రాజ్యానికి వెళుతుండగా కొంతమంది అప్సరసలు వచ్చి ఊర్వశిని కేశి అనే రాక్షసుడు అపహరించారని చెబుతారు. అప్పుడు పురూరవుడు ఆ రాక్షసుని వెంబడించి ఊర్వశి ఆ చెర నుండి విడిపిస్తాడు. ఆ సమయంలో వారిరువురూ ఒకరికొకరు ఆకర్షితులవుతారు.
 
రాజ్యానికి వచ్చిన పురూరవునికి ఆమె తలపులలో మునిగిపోయి కర్తవ్యాన్ని కూడా సరిగా నిర్వర్తించలేకుంటాడు. మరో వైపు ఊర్వశి కూడా అతన్ని విడిచి ఉండలేకుండా ఉంటుంది. చివరికి ఇంద్రుని అనుమతితో అతన్ని [[పెళ్ళి|వివాహం]] చేసుకుంటుంది. ఆ వివాహానికి ఇంద్రుడు కూడా వెళ్ళి వారిని ఆశీర్వదించి, మరలా ఎప్పుడైనా సహాయం అవసరం అయితే చేయాలని పురూరవుని దగ్గర మాట తీసుకుని వస్తాడు. ఆ తరువాత తన రాజ్యాన్ని బాగా విస్తరిస్తాడు.
 
పురూరవుడికి [[ఊర్వశి]] ద్వారా ఆరు మంది సంతానం కలుగుతుంది. వారు ఆయు, అమావసు, ధిమన, విశ్వాయు, ధృధాయు, శృతాయు.
 
మరణం
ఒకసారి పురూరవుడు నైమిశారణ్యానికి వేటకి వెళతాడు. అక్కడ కొంత మంది యోగులు యజ్ఞం చేస్తూ ఉంటారు. వారు చేతిలో [[బంగారం|బంగారు]] పాత్రలు ఉంటాయి. పురూరవుడు ఆ బంగారు పాత్రల్ని చూసి అవి క్షత్రియుల, వైశ్యుల చేతిలోనే ఉండాలనీ సాధువుల చేతిలో అలాంటివి అంతగా బాగుండవని అంటాడు. ఆ మాటలకు సాధువులు నొచ్చుకుంటారు. అంతే కాకుండా సాధువులకు బంగారంపై[[బంగారం]]<nowiki/>పై ఆశ ఎందుకనీ ఆ పాత్రల్ని లాక్కోవడానికి ప్రయత్నిస్తాడు. దాంతో ఆ సాధవులకు కోపం వచ్చి మండుతున్న కట్టెలను వారిపై విసిరేస్తారు. ఊహించని ఈ పరిణామం నుండి తేరుకునే లోపే పురూరవుడు అతని సేవకులు మరణిస్తారు.
<ref>History of Ancient India, Chapter 18 by J.P.Mittal</ref>
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/పురూరవుడు" నుండి వెలికితీశారు