"భృగు మహర్షి" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
చి
==భృగు మహర్షి==
'''[[భృగు మహర్షి]]''' [[బ్రహ్మ]] మానస పుత్రుడైన ప్రజాపతి మరియు [[సప్తర్షులు|సప్తర్షులలో]] ఒకరు.<ref>[http://www.sacred-texts.com/hin/m02/m02011.htm Narada said..] [[Mahabharata|The Mahabharata]] translated by [[Kisari Mohan Ganguli]] (1883 -1896), Book 2: Sabha Parva: Lokapala Sabhakhayana Parva, section:XI. '''p. 25''' And Daksha, Prachetas, Pulaha, Marichi, the master Kasyapa, Bhrigu, Atri, and Vasistha and Gautama, and also Angiras, and Pulastya, Kraut, Prahlada, and Kardama, '''these Prajapatis''', and Angirasa of the Atharvan Veda, the Valikhilyas, the Marichipas; Intelligence, Space, Knowledge, Air, Heat, Water, Earth, Sound, Touch, Form, Taste, Scent; Nature, and the Modes (of Nature), and the elemental and prime causes of the world,--all stay in that mansion beside the lord Brahma. And Agastya of great energy, and Markandeya, of great ascetic power, and Jamadagni and Bharadwaja, and Samvarta, and Chyavana, and exalted Durvasa, and the virtuous Rishyasringa, the illustrious 'Sanatkumara' of great ascetic merit and the preceptor in all matters affecting Yoga..."</ref> మొట్టమొదటి [[జ్యోతిషం|జ్యోతిష]] రచయిత<ref>[http://www.experiencefestival.com/a/Bhrigu_Samhita/id/1931640 Bhrigu Samhita|భృగు సంహిత]</ref> మరియు వేదాల కాలంలో రచించిన [[భృగు సంహిత]] కర్త.<ref>[http://astrospeak.indiatimes.com/articleshow/2026323.cms What is Bhrighu Samhita ?]</ref> భృగు మహర్షి [[బ్రహ్మ]]హృదయము నుండి ఉద్భవించిన నవబ్రహ్మలలో ఒకడు. [[వాయు పురాణము|వాయు పురాణం]] ప్రకారం భృగువు మామగారైన దక్షుని[[దక్షుడు|దక్షు]]<nowiki/>ని యజ్ఞంలో పాల్గొన్నాడు.<ref>[http://www.sacred-texts.com/hin/vp/vp043.htm Vishnu Purana] SACRIFICE OF DAKSHA (From the [[Vayu Purana]].) The Vishnu Purana, translated by [[Horace Hayman Wilson]], [[1840]]. 67:6.</ref>
 
భృగు వంశావలి :
== భృగు సంహిత ==
 
భృగుమహర్షి ఒక గొప్ప హైందవ [[జ్యోతిష్య శాస్త్రము|జ్యోతిష్య శాస్త్ర]] [[పితామహుడు]] మరియు ఇతని మొదటి జ్యోతిష్య శాస్త్ర గ్రంథం భృగుసంహిత దానికొక తర్కాణం. ఈ గ్రంథంలో సృష్టిలోని దాదాపు అన్ని రకాల జీవుల గురించి వ్రాయబడ్డాయి. అనగా దాదాపు 50 లక్షల ప్రాణుల జాతకాలు పొందుపర్చబడ్డాయి. ఒక పరిసశీలన ప్రకారం ఇప్పుడు కేవలం 01 శాతం జీవులు మాత్రమే మిగిలి ఉన్నాయని అంటున్నారు. భృగుమహర్షి ఒక గొప్ప ధర్మశాస్త్రప్రవక్తగా [[కాత్యాయనుడు]] పేర్కొన్నాడు.
 
== త్రిమూర్తులు:ఎవరు గొప్ప? ==
ఒకనాడు సరస్వతి నదీ తీరమున మహర్షులకు సత్క్రతువులు ఆచరించిన పిమ్మట మాటల సందర్భములో త్రిమూర్తులలో ఎవరు గొప్ప అనే సంశయము వచ్చింది. [[త్రిమూర్తులు|త్రిమూర్తుల]] గుణగణములు, ప్రాశస్త్యములు పరిశీలించిన పిదప, మహర్షులందరు భృగువు మహర్షి కంటే గొప్ప మహాత్ముడు లేడు అని నిర్ణయించుకొని, ఈ సంశయ విషయము నిర్ధారణ చేసుకునేందుకు భృగువుకు తెలియ జేస్తారు. మహర్షుల నిజ [[దైవము]] ఎవరో తెలుసుకునేందుకు బ్రహ్మ, శంకరుడు మరియు విష్ణువు దగ్గరకు వెళ్లడము, అక్కడ విష్ణువు ద్వారా తన అహంకారము పరాభవముతో నశించడము, ముకుందుడు నుండి ఆనందం పొందడము, భక్తి పారవశ్యముతో తిరిగి భూలోకమున సరస్వతి నదీ తీరమునకు చేరుకుంటాడు.<ref>[http://www.cliffsnotes.com/WileyCDA/LitNote/Mythology-Summaries-and-Commentaries-for-Indian-Mythology-Bhrigu-and-the-Three-Gods.id-83,pageNum-20.html Bhrigu and the Three Gods] Summaries and Commentaries for Indian Mythology.</ref>. మహర్షులకు పుండరీకాక్షుడు/[[విష్ణువు]] ఒక్కడే దైవమని తెలియజేస్తాడు.
 
==భగవద్గీత భృగు ప్రస్తావన==
 
1. భృగువు బ్రహ్మమానసపుత్రులలో ఒకఁడు. కొందఱు వరుణుని యజ్ఞమందలి అగ్నినుండి ఇతఁడు పుట్టినట్లు చెప్పుదురు. ఇతని పుత్రుఁడు కవి. పౌత్రుడు అసురులకు గురువు అయిన [[శుక్రాచార్యులు]]. ఇదికాక ఇతనికి ఖ్యాతివలన ధాత, [[విధాత]] అని ఇరువురు కొడుకులు కలిగిరి. అందు ధాతకు మృకండుఁడు, విధాతకు ప్రాణుఁడును జన్మించిరి. ప్రాణుని కొడుకు [[వేదశిరుఁడు]]. వేదశిరుని కొడుకు ఉశేనస్సు. మృకండుని కొడుకు మార్కండేయుఁడు. ఇతని మీసములను దక్షయాగమున వీరభద్రుఁడు పెఱికివేసినట్లు పురాణముల వలన తెలియవచ్చుచున్నది.
2. భృగువు ఒక మహర్షి. ఇతఁడు భాగీరథీ దక్షిణతీరమున మహాపద్మము అనియెడు పురమునందు ఉండెను. ఇతఁడు ఒకప్పుడు అగ్నిహోత్రము చేయుటకు తన భార్య పులోమను అగ్నులను ఏర్పఱపుము అని ఆజ్ఞాపించి తాను [[స్నానము]] చేయుటకై నదికిపోయెను. అప్పుడు [[పులోముడు]] అను దానవుఁడు ఒకఁడు అచ్చటికి వచ్చి అగ్నిదేవునివలన ఆమె ఇతని భార్య అని ఎఱిఁగి ఆమెను ఎత్తుకొనిపోవ యత్నింపఁగా వెఱపుచేత పూర్ణ గర్భిణి అయిన అమె తత్తఱపడునపుడు [[గర్భము]] భేదిల్లి గర్భస్రావము అయ్యెను. ఆస్రావమైన పిండము [[చ్యవనుడు]] అనఁబరఁగిన ఋషి అయి తన కోపపు చూపు చేతనే ఆరక్కసుని భస్మము చేసెను. ఇది అంతయు భృగుమహర్షి ఎఱిఁగి అగ్నిమీఁద అలిగి అతనిని సర్వభక్షకుఁడవు కమ్ము అని శపియించెను. అట్లైనను బ్రహ్మ అగ్ని యొక్క శుచిత్వమునకు లోపము కాకుండునట్లు అనుగ్రహించెను.<ref>http://www.andhrabharati.com/dictionary/#</ref>
 
== మూలాలు ==
1,90,625

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2182789" నుండి వెలికితీశారు