జగ్గయ్యపేట: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 101:
#శ్రీ కాశీ విశ్వేశ్వరస్వామి వారి దేవస్థానము, జగ్గయ్యపేట:- ఈ దేవాలయానికి అనుమంచిపల్లి గ్రామంలో 5.55 ఎకరాల (మెట్టభూమి) మాన్యంభూమి ఉంది. [1]
#శ్రీ రంగనాయకస్వామివారి ఆలయం.
#శ్రీ సంతాన వేణుగోపాలస్వామివారి ఆలయం:- జగ్గయ్యపేట పట్టణంలోని విజయవాడ రహదారిపై ఉన్న ఈ అలయంలో, స్వామివారి ద్వితీయ వార్షిక బ్రహంత్సవాలు 2017,మార్చి-3వతేదీ శుక్రవారం నుండి 9వతేదీ గురువారం వరకు వైభవంగా నిర్వహించారు. 7వతేదీ మంగళవారంనాడు స్వామివారి కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. అనంతరం రుక్మిణీ సత్యభామా సమేత స్వామివారికి గరుడసేవ, తిరువీధి ఉత్సవం జరిగింది. 8వతేదీ బుధవారం పుష్కరిణి వద్ద, అభిషేకం, చక్రతీర్ధ ఉత్సవం, మంగళా శాసనం నిర్వహించారు 9వతేదీ గురువారంనాడు స్వామివారికి పుష్పయాగం నిర్వహించారు. ఆలయ ముఖమండపంలో పవళింపుసేవ ఏర్పాటుచేసారు. అనంతరం పల్లకీసేవ నిర్వహించారు. ఉత్సవాల ముగింపు సందర్భంగా 9 రకాల ప్రసాదాలను నివేదించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాటుచేసిన అన్నప్రసాద సమర్పణ ఘనంగా సాగినది. ఈ ఆలయంలో 2017,ఆగష్టు-25న అన్నదాన సత్రాన్ని, ప్రారంభించినారు. ఇక్కడ ప్రతి శుక్రవారం అన్నదానం నిర్వహించెదరు. [4]&[9]
#శ్రీ మహాలక్ష్మి వెండి దేవాలయం:- ఈ ఆలయంలో 2017,మార్చి-12వతేదీ ఆదివారం ఫాల్గుణ పౌర్ణమి (హోలీ పండుగ రోజు) న లక్ష్మీ జయంతి వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేకపూజలు, పుష్పయాగం, సాయంత్రం రథోత్సవం ఘనంగా నిర్వహించారు. [5]
#శ్రీ గాయత్రిమాత ఆలయం:- ఈ ఆలయం స్థానిక అయ్యప్పనగర్ లో ఉంది.
"https://te.wikipedia.org/wiki/జగ్గయ్యపేట" నుండి వెలికితీశారు