ఎఱ్రాప్రగడ: కూర్పుల మధ్య తేడాలు

చి 2405:204:600F:4849:0:0:AFC:B8B1 (చర్చ) చేసిన మార్పులను ChaduvariAWB యొక్క చి...
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:ErraapragaDa.jpg|right|200px|ఎర్రాప్రగడ]]
[[దస్త్రం:ErrapragaDa text.jpg|right|200px|ఎర్రాప్రగడ]]
'''[[తెలుగు సాహిత్యం - ఎఱ్ఱన యుగము|ఎఱ్ఱాప్రగడ]]''' [[మహాభారతము]]లో [[నన్నయ్య]] అసంపూర్ణముగా వదిలిన పర్వాన్ని([[అరణ్య పర్వము]]) పూర్తి చేసాడు. [[నన్నయ్య]] భారతాన్ని చదివి ఇతని భారతంలోని భాగం చదివితే ఇది నన్నయ్యే వ్రాసినాడా అనిపిస్తుంది, అలాగే [[తిక్కన్న]] భారతము చదివి ఎఱ్ఱాప్రగడ వ్రాసిన భారత భాగము చదివితే ఎఱ్ఱాప్రగడ భాగము కూడా తిక్కన్నే వ్రాసినాడా అనిపిస్తుంది.
 
సంస్కృతంలో రాసిన మహాభారతాన్ని తెలుగులోకి అనువాదం 11 నుంచి 14 శతాబ్దాల మధ్య జరిగింది. ఎఱ్ఱాప్రగడ [[14వ శతాబ్దము]]లో రెడ్డి వంశమును స్థాపించిన [[ప్రోలయ వేమారెడ్డి]] ఆస్థానములో ఆస్థాన కవిగా ఉండేవాడు. ఎర్రయ్యను ఎల్లాప్రగడ, ఎర్రన అనే పేర్లతో కూడా వ్యవహరిస్తారు. ఈయనకు "ప్రబంధ పరమేశ్వరుడు" అని బిరుదు ఉంది.
పంక్తి 7:
== వంశము ==
[[దస్త్రం:Portrait of Errana.JPG|thumbnail|ఎఱ్ఱన చిత్రపటం]]
ఎర్రన తన నృసింహపురాణంలో చేసిన వంశవర్ణననుబట్టి అతని వివరాలు తెలుస్తున్నాయి. ఎఱ్ఱాప్రగడ పాకనాడు సీమ (ప్రస్తుత [[ప్రకాశం]] జిల్లాలోని [[కందుకూరు]] సమీపంలోని [[గుడ్లూరు]] గ్రామములో జన్మించాడు. ఈయన ప్రస్తుత [[గుంటూరు]] జిల్లా [[వేమూరు]] మండలములోని [[చదలవాడ(వేమూరు మండలం)|చదలవాడ]] గ్రామములో నివసించాడు. వీరు "శ్రీవత్స" గోత్రము "అపస్తంబు" శాఖకు చెందిన బాహ్మణుడు. అతని తండ్రి సూరన, తల్లి పొత్తమ్మ (పోతమాంబ). ఎఱ్రన్నకు అతని తాత గారి నామధేయమయిన ఎఱపోతన నామకరణం చేశారు అతని తల్లిదండ్రులు. ఎఱ్ఱాప్రగడ మామ్మ పేరు పేర్రమ్మ (పేరమాంబ, ప్రేంకమాంబ). ఎఱ్ఱాప్రగడ ముత్తాత బొల్లన (ఆతని భార్య పోలమ్మ లేదా ప్రోలమాంబ). ఎఱ్ఱాప్రగడ కుటుంబ ఆరాధ్య దైవం [[శివుడు]]. గురువు గారి పేరు శ్రీశంకర స్వామి. ఎఱ్రన్న [[కుటుంబము|కుటుంబ]] ఆరాధ్య దైవం శివుడైనా [[విష్ణువు]]ని కూడా పూజించేవాడు.
 
== జీవితం ==
పంక్తి 18:
ఎర్రనకు రెండు బిరుదులున్నాయి (1) శంభుదాసుడు (2) ప్రబంధ పరమేశ్వరుడు. మొదటి బిరుదు అతని ఆధ్యాత్మిక ప్రవృత్తినీ, రెండవ బిరుదు అతని సాహిత్య విశిష్టతనూ తెలుపుతాయి.
 
'శంభుదాసుడు'గా తాను ప్రశస్తుడవుతాడని తన తాతగారు కలలో కనిపించి ఆశీర్వదించారని నృసింహపురాణం పీఠికలో ఎర్రన వ్రాసుకొన్నాడు. అతని బిరుదు శంభుదాసుడు అయినప్పటికీ అతడు గ్రహించినవన్నీ విష్ణుకథలే. ఈ విధంగా ఎర్రన హరిహరాద్వైతమును జీవితంలోనూ[[జీవితం]]<nowiki/>లోనూ, రచనలలోనూ కూడా పాటించాడని తెలుస్తుంది.
 
 
పంక్తి 29:
[[దస్త్రం:HarivaMsamu.JPG|thumb|left|ఎఱ్రాప్రగడ విరచితంబైన హరివంశం గ్రంథము]]
 
ప్రోలయ వేముని కోరికపై ఎర్రన ముందుగా రామాయణాన్ని రచించాడు. కాని అది ఇప్పుడు దొరకడంలేదు. ఎర్రన వంశంవాడైన చదలవాడ మల్లన, ఎర్రన రచనల గురించి వ్రాస్తూ "వల్మీకభవు వచోవైఖరి రామాయణంబు నాంధ్ర ప్రబంధంబు జేసె" అని చెప్పాడు. అనగా ఇది వాల్మీకి రామయణానికి ఆంధ్రీకరణమేననీ, అదీ ఒక ఉద్గ్రంధమైన ప్రబంధమనీ తెలుస్తుంది. అయితే హుళక్కి భాస్కరాదులు వ్రాసి, సాహిణి సూరనకంకితమిచ్చిన [[భాస్కర [[రామాయణము]]<nowiki/>లోని కొన్ని ఘట్టాలు పాఠాంతరాలుగా చాలాపద్యాలు కనిపిస్తున్నాయి.ఈ పద్యాలు ఎర్రాప్రగడవే కావచ్చునని పండితుల ఊహ. అలాంటి 46 పద్యాలను ఎంతో శ్రమతో సేకరించి [[వేటూరి ప్రభాకరశాస్త్రి]] [[భారతి పత్రిక]]లో "ఎర్రాప్రగడ రామాయణం" అనే శీర్షికతో ప్రకటించాడు. yes
 
--[[ప్రత్యేక:చేర్పులు/61.3.55.156|61.3.55.156]] 06:05, 4 జూన్ 2015 (UTC)=== హరివంశము ===
పంక్తి 55:
== రచనాశైలి, విశేషాలు ==
 
[[సాహిత్య అకాడమీ]] ముద్రించిన అరణ్య పర్వము ముగింపులో ఆ భాగం సంపాదకులు డా. పాటిబండ్ల మాధవశర్మ ఇలా వ్రాశాడు -
 
:తననాటి కవీశ్వరులచే ప్రబంధ పరమేశ్వరుడని కొనియాడబడిన ఎఱ్ఱన, నన్నయభట్ట తిక్కనకవినాథులకెక్కిన భక్తి పెంపున అరణ్యపర్వ శేషమును పూరించి, గంగాయమునలవంటి ఆ మహనీయుల కవితా నదీమతల్లుల నడుమ సరస్వతీనదివంటి తన కవితను అంతర్వాహినిగా చేసి ఆంధ్రమహాభారతమునకు కవితా త్రివేణీసంగమ పవిత్రతను సమకూర్చెను. ఎఱ్ఱన ఎంత సౌమ్యమతియో ఆయన కవిత అంత సౌందర్యవతి. విఖ్యాతమాధుర్యమనోహరముగా ఆయన రచించిన అరణ్యపర్వశేషము ప్రతిపద్యరమణీయమైన పుణ్యకథాప్రబంధ మండలి. దానియందములు సవిస్తరముగా వర్ణించుటకు ఈ పీఠిక చాలదు. నాకు శక్తియు చాలదు.
పంక్తి 61:
తెలుగు వైతాళికులు ప్రచురణాక్రమంలో ఎర్రాప్రగడ పుస్తకాన్ని రచించిన ఆచార్య వి. రామచంద్ర తన రచన ముగింపులో ఇలా వ్రాశాడు.
 
: ఎర్రన శివపదాబ్జ సంతతాధ్యయన సంసక్తచిత్తుడు. పూజిత [[ధూర్జటి]] చరణాంబుజుడు. అతని బిరుదం శంభుదాసుడే అయినా గ్రహించిన కథలన్నీ విష్ణుకథలే. అతడు తాత్వికుడు. అతని జీవితమే హరిహరాద్వైతానికొక వ్యాఖ్యానం. ఆయన మహాపండితుడు. గురుభక్తి తత్పరుడు. వినయోదయ సంభరితుడు. ... సరళ హృదయుడు. సరళ సుందరమైన శైలే ఆయనకెక్కువ ఇష్టం. ఒక ప్రభువు కొలువులో ఆస్థానకవిగా ఉన్నా మహర్షివలె జీవితాన్ని గడపగలిగిన ధన్యుడాయన.
 
== రచనలనుండి ఉదాహరణలు ==
"https://te.wikipedia.org/wiki/ఎఱ్రాప్రగడ" నుండి వెలికితీశారు