శ్రీనాథుడు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
 
== రాజాశ్రయం ==
[[శ్రీనాథుడు]] 15వ శతాబ్దమున జీవించాడు. వీరు [[కొండవీటి]] ప్రభువు సర్వజ్ఞ సింగభూపాలుని ఆస్థాన కవి. విద్యాధికారి. ఈ కాలమందు ఎందరో కవిపండితులకు రాజాశ్రయం కల్పించారు.
==ఘనత - బిరుదులు ==
[[డిండిమభట్టు]] అనే పండితుని వాగ్యుధ్ధంలో ఓడించి అతని కంచుఢక్కను పగుల గొట్టించాడు. ఈతనికి [[కవిసార్వభౌముడు|కవిసార్వభౌముడ]]ను బిరుదము ఉంది.
==రచనలు==
ఇతను ఎన్నో కావ్యాలు రచించాడు. వాటిలో కొన్ని: [[భీమ ఖండము]], [[కాశీ ఖండము]], [[మరుత్తరాట్చరిత్ర]], [[శృంగార నైషధము]] మొదలగునవి. ఈయన వ్రాసిన [[చాటువులు]] ఆంధ్రదేశమంటా బహు ప్రశస్తి పొందినాయి.
పంక్తి 149:
 
== సమకాలీకులు ==
ఈయన [[పోతన]]కు సమకాలీనుడు. పోతనకు[[బమ్మెర పోతన|పోతన]]<nowiki/>కు బంధువని, పోతన రచించిన శ్రీమదాంధ్రభాగవతాన్నిసర్వజ్ఞసింగభూపాలునికి అంకితమిప్పించడానికి ఒప్పింప చూసేడనే కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి కానీ చారిత్రాక ఆధారాలు లేని కారణంగా వాటి విశ్వసనీయత పై పలు సందేహాలు, వివాదాలు ఉన్నాయి.
 
== చరమాంకం ==
పంక్తి 158:
ఇక్కడ “వ్యక్తిత్వం” అని ఎందుకు నొక్కి చెపుతున్నానంటే, కవుల కవితాశక్తి కోసమే ఐతే వాళ్ళు రాసిన (లేదా చెప్పిన) గ్రంథాలు చదువుకోవచ్చు, అవి చాలు. అంతటితో ఆగకుండా, ఆ కవుల వ్యక్తిగత విషయాలు కూడా తెలుసుకోవాలన్న కుతూహలం పాఠకుల్లో కలిగినప్పుడు చాటు పద్యాలు ఆ అవసరాన్ని భర్తీ చేస్తాయి. (”A poem at the right moment” అన్న గ్రంథంలో వెల్చేరు నారాయణ రావు, డేవిడ్‌ షుల్మన్‌ వివిధ భారతీయ భాషల చాటువుల గురించి సాధికారిక విశ్లేషణ చేశారు.) కవితాస్వాదనా తత్పరులైన రసిక పాఠకులు తమకు అంతటి ఆనందాన్ని అందిస్తున్న కవుల వ్యక్తిగత ప్రపంచాన్ని గురించి తయారు చేసుకున్న ఊహాచిత్రాల్ని ప్రతిబింబించేవి చాటుపద్యాలు. ఇప్పుడు సినీ తారల, ఆటగాళ్ళ, ఇతర ప్రముఖుల, వ్యక్తిగత విషయాల గురించి జనసామాన్యంలో ఎంతటి కుతూహలం ఉన్నదో చెప్పనక్కరలేదు. ఒకప్పుడు కవులు కూడా ఇలాటి జాబితాలో ఉండేవారనటానికి ప్రబలసాక్ష్యాలు చాటుపద్యాలు. అలాగే, వాళ్ళని ఆరాధించిన పాఠక-శ్రోతలు ఎంతటి సాహితీభక్తులో ఉన్నతస్థాయి కవులో కూడా చూపిస్తాయి.
 
పై పుస్తకంలో[[పుస్తకము|పుస్తకం]]<nowiki/>లో చెప్పినట్లు, ఓ కవి జనబాహుళ్యంలోకి ఎంతగా చొచ్చుకుపోయాడో చెప్పటానికి కొలమానాలు చాటుపద్యాలు. ఐతే ఇక్కడ మనం కవిని, అతని రచనల్ని విడదీసి చూడాలి. ఉదాహరణకు[[ఉదాహరణ వాజ్మయము|ఉదాహరణ]]<nowiki/>కు ఒక రచనకి ఎంతో జనాదరణ దొరికినా ఆ కవికి సంబంధించిన చాటువులు ఏమీ లేకపోవచ్చు. అలాటి పరిస్థితుల్లో పాఠకుల దృష్టి ఆ కవి మీద కన్నా రచన మీదే ఉందన్నమాట. లేకపోతే, ఆ కవి వ్యక్తిగత జీవితంలో కుతూహల కారకాలైన అంశాలేవీ లేకపోవచ్చు. ఉదాహరణకు నన్నయ గారిని తీసుకుంటే, ఆయన ఎలాటివాడు?
<poem>
“… అవిరళ,
పంక్తి 201:
# గొప్ప చమత్కారి
 
ఈ పట్టిక చూస్తే శ్రీనాథుడు ఎంతటి “ఆధునికుడో” అర్థమౌతుంది. మనం ఇప్పుడు నిజమైన ఆధునికతకు లక్షణాలుగా పరిగణిస్తున్నవి అన్నీ (సంప్రదాయ వైముఖ్యత, స్వకేంద్రిత దృష్టి, reactions based on unconscious, not self-consciousness, ) వీటిలో ఉన్నాయి. ఏడు వందల ఏళ్ళ క్రితమే ఈ లక్షణాల్ని సంతరించుకున్న ఒక వ్యక్తి ఉండటాన్ని ఊహించిన, అలాటి వ్యక్తిని ఉన్నతుడిగా భావించిన, మన [[సంస్కృతి]] ఔన్నత్యం ఏమిటో ఆలోచించండి!
ఈ గుణాల్ని ఇప్పుడు ఇంకొంచెం విపులంగా, ఉదాహరణల్తో చూపుతాను.
 
==లోకసంచారం.==
శ్రీనాథుడు [[సింహాచలం]] నుండి ద్రవిడ కర్ణాట సీమల వరకు, కృష్ణాతీరపు బొడ్డుపల్లి నుండి [[శ్రీశైలం]] వరకు ఉత్తర దక్షిణాలుగా తూర్పుపడమరలుగా తిరిగాడు. [[మాచెర్ల|మాచర్ల]], [[పల్నాడు]], కారెంపూడి, [[గురజాల]] లాటి చోట్ల ఉన్నాడు. త్రిలింగాల్ని దర్శించాడు. [[కొండవీడు]], [[అద్దంకి]], మారెళ్ళ, ఇంకా ఎన్నో చిన్నా పెద్దా ప్రదేశాల్లో ఉన్నాడు. వీటికి వేరే ఉదాహరణలు ఇవ్వక్కర్లేదు. ఎన్నో మన నాలుకల మీద నానుతున్న పద్యాలే.
 
==సౌందర్యారాధన.==
పంక్తి 236:
 
==భోజనప్రీతి.==
[[పల్నాడు]], [[రేనాడు]], [[గురజాల]], [[కర్ణాటక]], [[ద్రవిడదేశం]], మరెన్నో చోట్ల సరైన భోజనం దొరక్కపోవటాన్ని గురించి ఎన్నో విధాలుగా వాపోయాడు శ్రీనాథుడు. చక్కటి కాయగూరల్తో[[కూరగాయలు|కాయగూర]]<nowiki/>ల్తో మంచి సుగంధాలు చిమ్మే వరి అన్నం [[బంగారం|బంగారు]] పళ్ళెంలో వడ్డిస్తే భోంచెయ్యటం ఆయనకు ఇష్టం. అవి దొరకనప్పుడు ఆయన బాధ ఆ దేవుడికీ తెలియాలి.
<poem>
ఫుల్ల సరోజ నేత్ర యల పూతన చన్నుల చేదు ద్రావి నా
పంక్తి 262:
 
==విలాసి==
జీవితాన్ని పరిపుష్టంగా అనుభవించిన వాడు శ్రీనాథుడు. వృద్ధాప్యంలో[[వృద్ధాప్యం]]<nowiki/>లో విధి వక్రించి విపరీత దుర్దశ ప్రాప్తించినా అప్పటివరకు రేపన్నది లేనట్లు అర్థకామాల అంచులు చూసిన వాడు. ఒకసారి తన వేలిగోరు విరిగితే దాన్ని ఉద్దేశించి ఎంత అద్భుతంగా తన జీవనశైలిని వివరించాడో చూడండి -
<poem>
నీలాలకా జాల ఫాల కస్తూరికా
పంక్తి 315:
 
==అసౌకర్యాలంటే అసహనం==
[[భోజనం|భోజన]], నిద్రా, మైథునాల్లో ఎలాటి లోపం కలిగినా భరించలేడాయన. వీటిలో భోజనం గురించి ముందే చెప్పుకున్నాం. ఇవి చూడండి -
<poem>
గొంగడి మేలు పచ్చడము కుంపటి నల్లులు కుక్కిమంచమున్‌
పంక్తి 337:
</poem>
==కులమతాతీతుడు==
ఆయన [[అందము|అందం]] ఎక్కడున్నా హర్షించాడు, కుత్సితం ఎక్కడున్నా గర్హించాడు. ఇంత విశాల దృక్పథం మరో పూర్వకవిలో కనిపించదు. ఈయన కంటికి నచ్చిన [[స్త్రీలు]] అన్ని వర్గాల వారూను - [[వ్యాపారి]], నంబి, [[కమ్మ]], [[రెడ్డి]], [[జంగము]], [[కాపు]], [[శబర]], [[ద్రావిడ]], [[బలిజ]], [[గానుల]], [[వాసర్|వాసర]], [[విప్రో|విప్ర]], [[క్షత్రియులు|క్షత్రియ]], [[శూద్ర]], నియోగి, కర్ణాట, కాసల్నాటి, [[వైష్ణవ]], [[సాతాని]], [[అగసాలె]], [[వడ్డెర]], [[కుమ్మరి]], [[చాకలి]], [[ముస్లిం]], ఇలా ఎందరెందరో. వీళ్ళలో ఎవరినీ ఎక్కువగానూ మరెవర్నీ తక్కువగానూ చూడడు. ఆయన దృష్టిలో సౌందర్యమే ప్రధానం, మిగిలినవన్నీ అనవసర విషయాలు. ఉదాహరణకు ఈ పద్యాలు చూడండి -
<poem>
గిట గిట నగు నెన్నడుములు
పంక్తి 419:
పద్యశిల్పం ఏమిటో సోదాహరణంగా చూపే పద్యం ఇది. అసలు విషయం ఎంతవరకు దాచటానికి వీలౌతుందో అంతవరకూ దాచి అప్పుడు కూడా ఒక దీర్ఘ సమాసంలో దాన్ని కలిపేసి మనతో దోబూచులాడతాడు. మిరుమిట్లు గొల్పే పద్యం ఇది.
==ఉపసంహారం==
శ్రీనాథుడు తన గ్రంథాలతో ఎంతగా లబ్ధప్రతిష్ఠుడయాడో చాటువుల ద్వారా కూడా అంతే. ఐతే శ్రీనాథుడివిగా చెప్పబడేవన్నీ ఆయన చెప్పినవేనా అనేది ఎవరూ తేల్చలేని విషయం. కాని, రసవేత్తలైన పాఠకుల దృష్టిలో శ్రీనాథుడి వ్యక్తిగత జీవనచిత్రణని చూపిస్తాయివి. ఈ చాటుపద్యాలలో కనిపించే శ్రీనాథుడు ఎంతో [[ఆధునికత్వం|ఆధునిక]] భావాలున్నవాడు. ఈ కాలపు సమాజంలో హాయిగా ఇమిడిపోగలవాడు. ఆనాటి సమాజానికి ఆయన జీవనశైలి మింగుడుపడనిదై ఉండాలి. అందుకే అంతటి మహానుభావుడూ చివరిదశలో ఎన్నో ఇక్కట్లకు గురయ్యాడు. ఎవరూ ఆయన్ని ఆదుకోవటానికి రాలేదంటే తన బంధుమిత్రులకు ఎంత దూరమయాడో తెలుస్తుంది. సర్వస్వతంత్రుడిగా, నిరంకుశుడిగా జీవితాన్ని తన మనసుకు నచ్చిన రీతిలో సాగించిన శ్రీనాథుడి మూలంగా మనకు మిగిలిన సంపదలో ముఖ్యభాగం ఈ చాటువులు.
==మూలాలు==
*[[పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం]] ప్రచురించిన శ్రీనాథ మహాకవి శృంగార నైషధం
"https://te.wikipedia.org/wiki/శ్రీనాథుడు" నుండి వెలికితీశారు