"అడివి బాపిరాజు" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
చి
చి
| mother = సుబ్బమ్మ
}}
'''[[అడివి బాపిరాజు]]''' (Adivi Bapiraju) ([[అక్టోబరు 8]], [[1895]] - [[సెప్టెంబరు 22]], [[1952]]) బహుముఖ ప్రజ్ఞాశీలి. స్వాంతంత్ర్య సమరయోధుడు, [[రచయిత]], [[కళాకారుడు]] మరియు నాటక కర్త. [[తెలుగు]] దేశమంతటా విస్తృతంగా ప్రచారంలోనున్న "బావా బావా పన్నీరు" పాట ఈయన వ్రాసిందే. సన్నిహితులు, సమకాలీన సాహితీవేత్తలు ఈయన్ని ముద్దుగా "బాపి బావ" అని పిలిచేవారు.
 
[[File:Adavi Baapiraju Statue at RK Beach 01.jpg|thumb|విశాఖలో అడివి బాపిరాజు విగ్రహం]]
బాపిరాజు [[పశ్చిమ గోదావరి]] జిల్లా లోని [[భీమవరం]]లో [[అక్టోబర్ 8]], [[1895]] న ఒక నియోగి బ్రాహ్మణ కుటుంబములో[[కుటుంబము]]<nowiki/>లో కృష్ణయ్య, సుబ్బమ్మ దంపతులకు జన్మించాడు. [[భీమవరం]] హైస్కూలులో చదివి, [[రాజమండ్రి]] ఆర్ట్స్ కాలేజ్ లో బి.ఏ చదివి, [[మద్రాస్]] లా కాలేజ్ లో బి.ఎల్ పట్టం పొంది, కొంతకాలం న్యాయవాద వృత్తి నిర్వహించిన తరువాత తన ఇతర వ్యాసంగాలలో కృషిని సాగించడానికి ఆ పనిని విరమించాడు. 1934 నుండి 1939 వరకు [[బందరు]] నేషనల్ కాలేజిలో అధ్యాపకునిగా (ప్రిన్సిపాల్ గా) పనిచేశాడు. 1944లో [[హైదరాబాదు]] నుండి వెలువడే తెలుగు [[దినపత్రిక]] [[మీజాన్]] సంపాదకునిగా పనిచేశాడు. తరువాత [[విజయవాడ]] [[ఆకాశవాణి]] రేడియో కేంద్రంలో సలహాదారునిగా ఉన్నాడు. 'నవ్య సాహిత్య పరిషత్' స్థాపించినవారిలో బాపిరాజు ఒకడు. [[చిత్రకళ]]ను నేర్పడానికి [[గుంటూరు]]లో ఒక ఫౌండేషన్ ప్రారంభించాడు.
 
బాపిరాజుకు చిన్ననాటినుండి కవితలు రాసే అలవాటు ఉండేది. బాపిరాజు నవల '''[[నారాయణరావు]]'''కు [[ఆంధ్ర విశ్వకళా పరిషత్]] అవార్డు లభించింది. ఆయన చిత్రించిన చిత్రాలలో '[[సముద్ర గుప్తుడు]]', 'తిక్కన' ప్రసిద్ధమయ్యాయి. [[విశ్వనాథ సత్యనారాయణ]] గేయ సంపుటి [[కిన్నెరసాని పాటలు]] బాపిరాజు చిత్రాలతో వెలువడింది.
1,86,273

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2183512" నుండి వెలికితీశారు