ఎలకూచి బాలసరస్వతి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[ఎలకూచి బాల సరస్వతిబాలసరస్వతి]] జన్మతః [[మహబూబ్ నగర్ జిల్లా|పాలమూరు జిల్లా]] వాడు కాకపోయినా, కాకలుదీరిన కవిగా ఘనతికెక్కినది మాత్రం పాలమూరు జిల్లాకు చెందిన [[జటప్రోలు సంస్థానము]]లోనే. [[నెల్లూరు]] జిల్లా [[పొదిలి]] తాలుకాలోని [[ఎడవిల్లి అగ్రహారం]] వీరి జన్మస్థానం<ref>ఆరుద్ర, సమగ్ర ఆంధ్ర సాహిత్యం,10వ సంపుటం,నాయకరాజుల యుగం-1, ఎమెస్కో,మద్రాస్,1966, పేజి-29</ref>. ఇతడు క్రీ.శ పదునారవ శతాబ్దము చివరను పదునేడు పుర్వార్థమున ఉండినట్లు చారిత్రక ఆధారములున్నవి. వీరు కొంత కాలం [[విజయనగరం]]లో గడిపారు. తరువాత [[తెలంగాణ]]లోని పర్తియాల సంస్థానానికి చేరుకొని రాజా జూపల్లి వెంకటాద్రి దగ్గర కొంత కాలం పనిచేసి, సురభి ముమ్మడి మల్లానాయుడి కాలంలో [[జటప్రోలు]] సంస్థానానికి చేరుకోని వారి కుమారుడైన సురభి మాధవరాయల ఆస్థాన కవిగా పనిచేస్తూ అక్కడే స్థిరపడిపోయాడు.
==సాహితీ ప్రస్థానం==
ఎలకూచి బాలసరస్వతి అసలు పేరు "ఎలకూచి వెంకటకృష్ణయ్య". [[బాల్యం]]లోనే అసమాన్యమైన ప్రతిభా పాండిత్యం చూపడం వలన వీరికి బాల సరస్వతి అను బిరుదు వచ్చింది. ఆ బిరుదునామమే వీరి వ్యవహార నామంగా స్థిరపడిపోయింది. వీరి తండ్రి గారు కృష్ణయ్య. తెలుగు సాహిత్యంలో మహామహోపాధ్యాయగా గణతికెక్కిన తొలి సాహితీవేత్తగా బాలసరస్వతికి పేరుంది.<ref>పాలమూరు సాహితీ వైభవం, రచన: ఆచార్య ఎస్వీ రామారావు, ముద్రణ 2010, పేజీ 20</ref> ఆరు భాషలలో పండితుడు. "షడ్భాషా వివరణము" అనే వీరి గ్రంథం ఆ విషయాన్ని ఋజువుచేసేదేనని పండితుల అభిప్రాయం. రంగకౌముది అను నాటకాన్ని, కార్తికేయాభ్యుదయం, వామన పురాణం , బాహటం అనే ప్రబంధాలు రచించాడు. భ్రమరగీతాలు రాశాడు. వీరు [[విజయనగరం]]<nowiki/>లో ఉండిన కాలంలోనే [[నన్నయ్య]] రాసిన ఆంధ్రశబ్ధచింతామణికి వ్యాఖ్యానం రాశాడు. అయితే ఈ గ్రంథం నన్నయ రాయలేదని, బాలసరస్వతే రాసి, దానికి గౌరవం కలిగించడం కొరకు [[నన్నయ]] పేరు పెట్టి ఉండవచ్చునని కొందరి వాదన. తరువాత త్ర్యర్థి కావ్యంగా ' రాఘవ యాదవ పాండవీయం ' అను కావ్యాన్ని రాశాడు. ఇది నాలుగు ఆశ్వాసాల కావ్యం. [[శ్రీ వేంకటేశ్వరుడు|తిరుపతి వెంకటేశ్వరుని]]కి అంకితం ఇచ్చాడు. పర్తియాల సంస్థానాధిపతి జూపల్లి వెంకటాద్రి కోరిక మేరకు [[భీముడు]], [[కాశీరాజు]] కూతురు నాయకా, నాయికలుగా "చంద్రికా పరిణయం" అను ప్రబంధ కావ్యాన్ని రాశాడు. ఈ గ్రంథంలో పర్తియాల సంస్థానానికి చెందిన జూపల్లి వారి వంశ చరిత్ర వివరించబడింది. అటుపిమ్మట జటప్రోలు సంస్థానానికి వచ్చి [[సురభి మాధవ రాయలు|సురభి మాధవరాయ]]ల కోరిక మేరకు భరృహరి సుభాషిత త్రిశతిని [[తెలుగు]] చేయడానికి పూనుకున్నాడు. భరృహరి సుభాషితాలను అనువాదం చేసిన తొలి తెలుగువాడు కూడా ఎలకూచి బాలసరస్వతే. మాధవరాయల తండ్రి మల్లానాయుడి పేరు మీదగా 'మల్ల భూపాలీయం' గా అనువాదం చేసి ముమ్మడి మల్లానాయుడుకు అంకితమిచ్చాడు.<ref>తెలంగాణ సాహిత్య వైశిష్ట్యం, రచన: ఆచార్య ఎస్వీ రామారావు, ముద్రణ 2012, పేజీ 76</ref> ఇందులో [[నీతి]], [[శృంగారం|శృంగార]], వైరాగ్య శతకాలన్నిటిలోనూ మల్లనాయిని మకుటంతోనే చెప్పటం విశేషం. ' సురభి మల్లా! నీతి వాచస్పతీ!' మకుటంతో నీతి శతకాన్ని, ' సురభి మల్లా! మానినీమన్మథా!' మకుటంతో శృంగార శతకాన్ని, 'సురభి మల్లా! వైదుషీ భూషణా!" మకుటంతో వైరాగ్య శతకాన్ని రాశాడు. ఎలకూచి బాలసరస్వతి రాసిన చివరి గ్రంథం కూడా ఇదేనని పండితుల అభిప్రాయం. ఈ అనువాదానికి ఆనందించిన సురభి మాధవరాయలు ఎలకూచి బాలసరస్వతికి రెండువేల దీనారాలు ఇచ్చి సత్కరించాడు ఈ విధంగా [[జటప్రోలు సంస్థానము|జటప్రోలు]] సంస్థానానికి బాలసరస్వతి గౌరవాన్ని చేకూర్చితే, బాలసరస్వతికీ జటప్రోలు సంస్థానం గౌరవాన్ని చేకూర్చింది.
పంక్తి 25:
ఈయన కృష్ణా మండల నివాసి. జటప్రోలు సంస్థానాశ్రయుడు. తన త్రిశతిని ఆ సంస్థానా ధీశ్వరుడు సురభిమల్ల భూపాలుని పేర రచించి యాయనచే రెండు వేల దీనారముల బహుకరణ మందెనని ప్రసిద్ధి. కృతి పతి వంశజులగు శ్రీ సురభి రాజా వేంకట లక్ష్మారావు బహదురు వారు యిదివరలో నీ మల్ల భూపాలీయమును ప్రకటించుయున్నారు.
==ఆయన రచనల విశిష్టత==
బాల సరస్వతి రచనలలో యాదవ రాఘవ పాండవీయము తెనుగు నందలి త్ర్యర్థి కావ్యములలో కెల్ల మొదటిది. అతని రంగ కౌముది యప్పుడప్పుడే వెలువడుచున్న [[యక్షగానము]]లతో నొకటియై నాటక ముల కుప లక్షణగ నున్నది. ఆయన ఆంధ్ర శబ్ద చింతామణి ని తెలుగు వివరణమును గూడా రచించెను. వీనిని బట్టి చూడ అతనీ ప్రబంధ, ద్వ్యర్థి కావ్య, కావ్యాలంకార సంగ్రహములను రచించిన భట్టుమూర్తితో[[భట్టుమూర్తి]]<nowiki/>తో సరిపోల్చ వచ్చును.
 
ఇతని కవిత్వమున జీవముట్టిపడు చుండును. ఇతడు శతక త్రయమునకు మకుటముగ, సురభిమల్లా నీతి వాచస్పతి,సురభిమల్లా మానినీ మన్మధా, సురభిమల్లా వైదుషీ భూషణా అని అనుకరించుయున్నాడు. మకుట నిర్బంధంచే నితడు శతక త్రయమున శార్దూల మత్తేభములతోనే రచించవలసి వచ్చెను.
"https://te.wikipedia.org/wiki/ఎలకూచి_బాలసరస్వతి" నుండి వెలికితీశారు