చిలకమర్తి లక్ష్మీనరసింహం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''[[చిలకమర్తి లక్ష్మీనరసింహం]]''' ( [[సెప్టెంబరు 26]], [[1867]] - [[జూన్ 17]], [[1946]]) ప్రముఖ [[కవి]], [[రచయిత]], నాటక కర్త, పాత్రికేయుడు, సంఘ సంస్కరణవాది, విద్యావేత్త. 19వ శతాబ్దం చివర, 20వ శతాబ్దం ఆరంభ కాలంలో [[తెలుగు సాహిత్యం]] అభివృద్ధికి, తెలుగు నాట ఆధునిక భావాల వికాసానికి పట్టుకొమ్మలైన మహామహులలో చిలకమర్తి ఒకడు. ఇరవైరెండేళ్ళ వయస్సప్పుడు ఆయన రచించిన [[గయోపాఖ్యానం]] అనే నాటకం ప్రతులు లక్షకి పైబడి అమ్ముడుపోవటమనేది తెలుగు సాహిత్య చరిత్రలో కనీ, వినీ, ఎరగని విషయం. ఈ నాటకంలో [[టంగుటూరి ప్రకాశం]] పంతులు అర్జునుడి వేషం వేసేవాడు.
{{సమాచారపెట్టె వ్యక్తి
| name = చిలకమర్తి లక్ష్మీనరసింహం
పంక్తి 14:
}}
 
లక్ష్మీనరసింహం [[1867]] [[సెప్టెంబర్ 26]]<ref name="ReferenceA">మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి రచించిన తెలుగు రచయితలు మొదటి భాగం</ref> న [[పశ్చిమ గోదావరి]] జిల్లా, [[పెరవలి]] మండలములోని [[ఖండవల్లి,పెరవలి|ఖండవల్లి]] గ్రామములో ఒక బ్రాహ్మణ కుటుంబములో[[కుటుంబము]]<nowiki/>లో వెంకయ్య, రత్నమ్మ దంపతులకు జన్మించాడు.
 
==విద్య, బోధన==
పంక్తి 34:
 
==సంస్కరణ కార్యక్రమాలు==
లక్ష్మీ నరసింహం మొదటి తరం సంఘ సంస్కర్త. 1909 లో సామాజికంగా వెనుకబడిన వర్గాలకోసం ఒక పాఠశాల (రామమోహన పాఠశాల) స్థాపించారు. నిమ్నజాతుల వారి గురించి ప్రత్యేకంగా ఒక పాఠశాలను స్థాపించిన ఘనత ఆంధ్రదేశంలో చిలకమర్తి వారికి దక్కుతుంది. ఎందుకంటే అంతకు మునుపు ప్రభుత్వంచే నడుపబడుతున్న ఒకటి రెండు పాఠశాలలు తప్ప దళితుల కోసం ప్రత్యేకమైన పాఠశాలలను ఎవరూ స్థాపించలేదు. కేవలం తన పుస్తకాలనుండి వచ్చిన రాబడితోనే, తన స్వంత ధనంతో ఆ రామమోహన పాఠశాలను 13 సంవత్సరాలు నడిపి హైయ్యర్ ఎలిమెంటరీ స్కూల్ గా చేసారు. అంథుడైనప్పటికి చిలకమర్తి వారి దళిత జనులకు చేసిన సేవలను అప్పటి మద్రాస్ [[గవర్నర్]] లార్డ్ పెంట్ లాండ్ ఎంతగానో ప్రశంసించారు. బ్రహ్మసమాజం, హితకారిణీ సమాజం వంటి సంస్కరణ దృక్పథం గల సంఘాల కార్యకలాపాలలో పాలు పంచుకొన్నారు. దేశమాత అనే వారపత్రిక ద్వారా [[బ్రిటిషు|బ్రిటిష్]] పాలనకు వ్యతిరేకంగా వ్యాసాలు వ్రాశారు.
 
==విశేషాలు==
పంక్తి 105:
 
== ప్రాచుర్యం ==
చిలకమర్తి లక్ష్మీనరసింహం రచించిన [[గణపతి (నవల)|గణపతి]] నవల బహుళ ప్రచారం పొందింది. [[ఆకాశవాణి|ఆకాశవాణిలో]] శ్రవ్యనాటికగా పలుమార్లు ప్రసారమైంది. చిలకమర్తి ఆశువుగా చెప్పిన ''భరతఖండంబు చక్కని పాడియావు'' పద్యం స్వాతంత్ర్య సమరంలో ప్రముఖ స్థానం పొందింది. [[గయోపాఖ్యానం]] నాటకం ప్రతులు లక్షకు పైగా అమ్ముడుపోయి ఆంధ్రదేశంలో అసంఖ్యాకమైన ప్రదర్శనలు పొందింది. ఆత్మకథలోని పలుభాగాలు విద్యార్థులకు తెలుగువాచకంలో[[తెలుగు]]<nowiki/>వాచకంలో పాఠంగా నిర్దేశించారు.
 
==రచనల నుండి ఉదాహరణలు==
పంక్తి 117:
</poem>
 
'''[[గయోపాఖ్యానం]]'''లో కృష్ణార్జునుల మధ్య పోరును ఆపడానికి సుభద్ర మగని దగ్గరకూ, అన్న దగ్గరకూ వెళ్ళినపుడు వారు ఆమెను దెప్పిన విధం:
 
;ఎంతయినా ఆడువారికి పుట్టింటి పైనే అభిమానం ఉంటుందంటూ అర్జునుడిలా అన్నాడు
పంక్తి 137:
 
;"[[పకోడి]]" గురించి
ఓ సాయంకాలం స్నేహితులంతా కూర్చున్నాక [[పకోడీలు]] తెప్పించారు. అక్కడే వున్న చిలకమర్తివారిని వారి స్నేహితులు పద్యాలు చెప్పమని కోరారు. "కవులకు అక్షర లక్షలిచ్చెడి కాలము గతించినది. పద్యమునకు పకోడినిచ్చెడి దుర్దినములు వచ్చినవి" అని హాస్యోక్తులు విసరి ఆయన పకోడిపై చెప్పిన పద్యాలలో కొన్ని:
::వనితల పలుకుల యందున
::ననిమిష లోకమున నున్న దమృత మటంచున్