కొండేపూడి నిర్మల: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''[[కొండేపూడి నిర్మల]]''' తెలుగు [[రచయిత్రి]]. ఆమె రాసిన "సందిగ్ధ సంధ్య" పుస్తకానికి గానూ ఆమెకు [[ఫ్రీవర్స్ ఫ్రంట్]] పురస్కారం 1988లో వచ్చింది. ఉమ్మడిశెట్టి సాహిత్య రజతోత్సవ పురస్కారం - 2012 కోసం ప్రముఖ స్త్రీవాద కవయిత్రి శ్రీమతి కొండేపూడి నిర్మల గారి 'నివురు' కవిత్వం ఎంపికైంది.<ref>[http://prasthanam.com/node/329 కొండేపూడి నిర్మలకు ఉమ్మడిశెట్టి సాహితీ రజతోత్సవ పురస్కారం]</ref>
==జీవిత విశేషాలు==
కొండేపూడి నిర్మల ప్రముఖ స్త్రీవాద కవయిత్రి. ఈమె కవిత్వం ఎంతోమందిని ప్రభావితం చేసింది. అప్పటివరకూ అంటరానివిగా మిగిలిపోయిన ఎన్నో కొత్త వస్తువులను స్వీకరించి, కవిత్వం రాసినవారిలో కొండేపూడి నిర్మలని ట్రెండ్‌ సెట్టర్‌గా అభివర్ణించవచ్చు. ఈమె కలంలోంచి[[కలము|కలం]]<nowiki/>లోంచి తొణికిన ఏ రచనని[[రచన]]<nowiki/>ని పరిశీలించినా గాని ఒక ఆర్తితో కూడిన తీవ్రత కనబడుతుంది. ఈమె [[కవిత్వం]]లోనే కాదు ఇతర సాహితీ ప్రక్రియల్లో కూడ తనదైన ముద్రవేశారు. కవిత్వంలో[[కవిత్వం]]<nowiki/>లో గాఢతలాగే వచనంలో వ్యంగ్యం, హాస్యం ఈమె ప్రత్యేకతలు.
 
==పుస్తకాలు==
సందిగ్ధ సంధ్య, నడిచే గాయాలు, బాధాశప్తనది, మల్టీనేషనల్‌ ముద్దు, నివురు. అనేకానేక రూపాలలో పార్శ్వాలలో స్త్రీలను వెన్నంటి ఉండే ధ్వైదీభావాన్ని కొండేపూడి నిర్మలగారు ప్రతిభావంతంగా అనేక కవితల్లో ఎరుకపరిచారు.<ref>[http://vihanga.com/?p=12350 కొండేపూడి నిర్మల కవిత్వం]</ref>
==పురస్కారాలు==
ఈమె [[తాపీ ధర్మారావు]] స్మారక బహుమతి, ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డు, [[నూతలపాటి గంగాధరం]] అవార్డ్, కుమారన్ ఆశాన్ జాతీయ బహుమతి, [[దేవులపల్లి కృష్ణశాస్త్రి]] అవార్డ్, బి.ఎన్. రెడ్డి సాహితీ అవార్డు, ఎస్.బి.ఆర్ అవార్డ్, [[పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం]] అవార్డ్ వంటి [[పురస్కారములు|పురస్కారాలు]] ఎన్నో పొందారు.<ref>[http://kinige.com/book/Kondepudi+Nirmala+Kavitvam కొండేపూడి నిర్మల కవిత్వం పుస్తక పరిచయం]</ref>
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/కొండేపూడి_నిర్మల" నుండి వెలికితీశారు