పి.సత్యవతి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లొ → లో, స్పూర్తి → స్ఫూర్తి, పదవి విరమణ → పదవీ విరమణ, → using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 36:
| weight =
}}
'''[[పి.సత్యవతి]]''' ప్రఖ్యాత తీలుగు కథా రచయిత్రి.
==జీవిత విశేషాలు==
'''పి.సత్యవతి''' [[1940]] జూలైలో [[గుంటూరు జిల్లా]], [[కొలకలూరు]]లో జన్మించారు. [[ఆంధ్ర విశ్వవిద్యాలయం|ఆంధ్ర విశ్వకళాపరిషత్]] లో ఆంగ్ల సాహిత్యంలో పట్టభద్రులయ్యారు. [[విజయవాడ]] ఎస్.ఎ.ఎస్.కళాశాలలోలో ఆంగ్ల అధ్యాపకురాలుగా వృత్తిని చేపట్టి పదవీ విరమణ చేశారు. పాఠాలు బోధించడం, [[ఇంగ్లీలిషుఆంగ్ల భాష|ఇంగ్లీషు]] సాహిత్యం గురించే కావచ్చు కానీ, ఆమె పరిశీలించిన [[సమాజం]] తెలుగుది. అందుకే ఆమె రచనలను [[తెలుగు]] సాహిత్యంలోనే చేశారు. ప్రత్యేకంగా కథాప్రక్రియలో కృషి చేశారు. తెలుగు, [[ఆంగ్ల]] సాహిత్యాలను శ్రద్ధగా ఒక పద్ధతి ప్రకారం అధ్యయనం చేసిన సత్యవతిగారు సమాజ గమనాన్ని అంతకంటే నిశితంగా పరిశీలించారనడానికి ఆమె రాసిన కథలూ, వెలువరించిన కథాసంపుటాలూ, అరుదుగానైనా అప్పుడప్పుడూ పత్రికలకు ఇచ్చిన ఇంటర్వ్యూలు స్పష్టమైన నిదర్శనాలు.
 
సమాజ గమనాన్ని, సాహిత్య బాధ్యతను గుర్తెరిగిన సత్యవతిగారు కథారచనలో ఒక నిర్దిష్ట గమ్యాన్ని నిర్ధారించుకున్నారు. ఆ బాటలోనే 1970 నుంచి కథారచన చేస్తూ తన సాహితీ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. ఆ దారిలో తనకెదురైన పాఠకులను నిరంతరం ప్రమత్తం చేస్తున్నారు. ఆ రంగం వనితాలోకం. ఆ మార్గం మహోన్నత మహిళామార్గం. పితృస్వామ్య సమాజంలో మహిళలకున్న కష్టాలకంటే వారే కొని తెచ్చుకుంటున్న కష్టాలు ఎక్కువైతే, సమాజం వారిమీద బలవంతంగా రుద్దే పీడన, అపచారాలు, అవమానాలకు అంతేలేదు. ఈ ముప్పేట దాడిని సమర్ధంగా ఎదుర్కోవాలంటే జరుగుతున్న దోపిడీ స్వరూపాన్ని, దోచుకునే విధానాలను ఎండగట్టాలి. వివక్ష విశ్వరూపాన్ని ప్రదర్శింపజేయాలి. ఆ బృహత్తర బాధ్యతను చిత్తశుద్ధితో తలకెత్తుకున్న స్త్రీవాద రచయితలలో పి. సత్యవతి అగ్రగణ్యురాలు.
పంక్తి 44:
రాశిలో తక్కువైనా వాసిలో అమోఘమనిపించుకున్న ప్రముఖ స్త్రీవాద రచయిత పి. సత్యవతిగారి సాహితీ వ్యక్తిత్వాన్ని అంచనా వేయాలంటే ఆమె వెలువరించిన కథా సంపుటాలను పరిశీలించి, పట్టి పట్టి అధ్యయనం చేయాలి. ఆ అంచనాకు మనకున్న గీటురాళ్లు ఏ మాత్రం సరిపోవు. అయితే కొండను అద్దంలో చూపినట్టు ఆ విదుషీమణి సారస్వత కృషిని చూపే ప్రయత్నమిది.
 
‘మర్రినీడ‘ అనే పెద్దకథ గల సంపుటితో జూన్ 1975లో పి. సత్యవతిని రచయిత్రిగా [[నవభారత్ బుక్ హౌస్]] సాహితీలోకానికి పరిచయం చేసింది. [[ఆంధ్రజ్యోతి సతిత్రసచిత్ర వారపత్రిక]]<nowiki/>లో ఒక ప్రయోగంగా అందులో ప్రచురించిన కథలపై పెట్టిన సాహితీ బ్యాలెట్ లో అప్పటి పాఠకులు ఈ పెద్దకథను బహుమతికి అర్హమైన కథగా ఎంచుకున్నారు. అప్పటినుంచీ అడపాతడపా [[బహుమతులు]] ఎన్నో ఆమె ఇంటి గుమ్మాన్ని తట్టాయి. వాటిలో పేర్కొనదగ్గ అవార్డులుగా 1997లో అందుకున్న చాసో స్ఫూర్తి అవార్డును, అదే ఏడాది లభించిన కొండేపూడి శ్రీనివాసరావు అవార్డును, 2002లో వరించిన రంగవల్లి విశిష్ట వ్యక్తి పురస్కారాన్ని, 2004లో స్వీకరించిన [[పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్శిటీ]]యూనివర్సిటీ విశిష్ట పురస్కారాలను పేర్కొనవచ్చును.
 
ఆనక డిసెంబరు 1998లో పన్నెండు కథల [[బంగారం]] “సత్యవతి కథలు“, మే 1995లో ఇంకో పదిహేను కథలతో “ఇల్లలకగానే…“, తాజాగా సెప్టెంబరు 2003లో మరి పన్నెండు కథల మాగాణిగా “మంత్రనగరి” సంపుటాలు ఆమె సాహితీ క్షేత్రంలో దిగుబడి పంట. మధ్య తరగతి మహిళ మనస్తత్వాన్ని పురుషస్వామ్యం రకరకాల మాయోపాయాలతో బురిడీ కొట్టించడం, [[స్త్రీలు]] బాధనంతా పళ్ల బిగువున భరిస్తూ గడపడం మొదటి సంపుటిలో గమనిస్తాం. ఆ క్లిష్టతా చట్రం నుంచి ఒక సంపూర్ణ మానవిగా ఎదగడానికి పడాల్సిన శ్రమ, ఆ క్రమంలో తెంచాల్సిన కట్టుబాట్ల శృంఖలాలు రెండో సంపుటిలో కథనీకరిస్తే, ఈ మొత్తం జెండర్ ఆధిపత్యపు ప్రహసనాన్ని చాపకింద నీరులాగా సమాజం ఎలా నియంత్రిస్తుంటుందో, విషవలయపు విశ్వరూపమెలా వుంటుందో సరికొత్త సాహిత్య టెక్నిక్ (మాజిక్ రియలిజమ్, [[కొల్లాజ్]]) తో మూడో సంపుటిలో ఆవిష్కరించారు. రాజకీయాల జోలికి పోకుండా స్త్రీ జీవితాన్ని విభిన్న కోణాల్లో స్పృశించడం ద్వారా పాఠకులకు, ఆలోచనాపరులకు కొత్తకొత్త ఆలోచనలు ఆవిష్కరింపజేసేలా యదార్థ గాథలు, వ్యదార్థ దృశ్యాలను అక్షరీకరించడం పి. సత్యవతిగారికే చెల్లింది. ఈ కృషిలో ఆమె విజయవంతంగా మరింత ముందుకు పయనిస్తూనేవుంటారు. తరువాత నాలుగవ సంపుటి "మెలకువ" వ్యాస సంకలనం "రాగం భూపాలం " వెలువడ్డాయి. 2016 లో [[విశాలాంధ్ర ప్రచురణాలయం|విశాలాంధ్ర పబ్లిషర్స్]] 40 కథలతో ఆమె కథా సంకలనం ప్రచురించింది.
 
==పురస్కారాలు==
"https://te.wikipedia.org/wiki/పి.సత్యవతి" నుండి వెలికితీశారు